Bluetooth : బ్లూ టూత్ ఆన్ చేస్తున్నారా? ఈ యాప్ ద్వారా మీ డేటా చోరీ మాయం కావొచ్చు..

ఈ నేపథ్యంలో మొబైల్ డేటా ఆన్ చేసి మాత్రమే బ్యాంకింగ్ వ్యవహారాలు జరుపుకోవాలి. ఇక మొబైల్ రిపేర్ కు ఇస్తున్నప్పుడు బ్యాకింగ్ యాప్స్ అన్ ఇనిస్టాల్ చేసి ఇవ్వండి. లేకుంటే మీ పాస్ వర్డ్ వారికి ఎలాగో తెలుస్తుంది. అందువల్ల నష్టం చేకూర్చే అవకాశం ఉంది.

Written By: NARESH, Updated On : April 20, 2024 6:56 pm

Turning on Bluetooth Your data is stolen by this app

Follow us on

Bluetooth : బ్యాంకు వ్యవహారాలు సాగించేందుకు ఒకప్పుుడు కార్యాలయాలకు వెళ్లి క్యూలో నిల్చోవాల్సిన అవసరం ఉండేది. గంటల కొద్దీ సమయం గడిస్తే గాని పనయ్యేది కాకుండే. కానీ ఇప్పుడు మొబైల్ వచ్చాక లక్షల రూపాయలకు క్షణంలో పంపిస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడున్నా మనీ ట్రాన్జాక్షన్ ఈజీ అవుతోంది. అయితే మొబైల్ ద్వారా బ్యాంకింగ్ వ్యవహారాలు ఎంత ఈజీగా ఉంటాయో.. అంతే ప్రమాదాలు కూడా ఉంటాయి. ఒక్కోసారి మనం బ్లూటూత్ ఆన్ చేస్తూ ఉంటాం. ఈ సమయంలో కొందరు ఓ యాప్ ను ఉపయోగించి డేటా చోరీ చేసే అవకాశం ఉంది. ఇంతకీ ఆ యాప్ ఏంటి? ఆ వివరాల్లోకి వెలితే.

నేటి కాలంలో ప్రతి స్మార్ట్ ఫోన్ లో మనీ ట్రాన్జాక్షన్ యాప్స్ కచ్చితంగా ఉంటున్నాయి. వీటి ద్వారా చాలా మంది తమ కార్యకలాపాలను ఈజీగా నిర్వహించుకుంటున్నారు. అయితే కొందరు వీటి విషయంలో నిర్లక్ష్యంగా ఉంటున్నారు. దీంతో తమకు తెలియకుండానే నగదును కోల్పోతున్నారు. ముఖ్యంగా మొబైల్ లో రోజూ నిర్వహించే పనుల్లో కాస్త జాగ్రత్తలు తీసుకొని కొన్ని టిప్స్ పాటిస్తే ఎలాంటి నష్టం ఉండదు. అందు కోసం ఏం చేయాలంటే?

మొబైల్ లో ఫోన్ పే లేదా గూగుల్ పే యూజ్ చేసేటప్పుడు వాటికి ప్రత్యేకంగా పాస్ వర్డ్ కేటాయించుకోండి. ఈ పాస్ వర్డ్ మిగతా యాప్ లకు ఉండకుండా చూడండి. లేకుంటే ఒక్క దాని పాస్ వర్డ్ తెలిస్తే మిగతా వాటికి ట్రై చేసి నష్టాన్ని చేకూర్చవచ్చు. మొబైల్ లో బ్లూ టూత్ ను అవసరం అయినప్పుడే ఆన్ చేసుకోండి. అవసరం లేనప్పుడు దానిని ఆఫ్ చేయడం ఎంతో మంచిది. లేకుంటే ‘Flipper’ అనే యాప్ ద్వారా మీ డేటా చోరీ చేసే అవకాశం ఎక్కువగా ఉంది.

బయటకు వెళ్లినప్పుడు పబ్లిక్ వైఫై లు ఉంటాయి. ఇవి ఉచితంగా వాడుకోవచ్చు. అయితే వీటి ద్వారా బ్యాంకింగ్ యాప్స్ యూజ్ చేయడం ద్వారా డేటా ప్రైవసీకి దెబ్బతినే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మొబైల్ డేటా ఆన్ చేసి మాత్రమే బ్యాంకింగ్ వ్యవహారాలు జరుపుకోవాలి. ఇక మొబైల్ రిపేర్ కు ఇస్తున్నప్పుడు బ్యాకింగ్ యాప్స్ అన్ ఇనిస్టాల్ చేసి ఇవ్వండి. లేకుంటే మీ పాస్ వర్డ్ వారికి ఎలాగో తెలుస్తుంది. అందువల్ల నష్టం చేకూర్చే అవకాశం ఉంది.