Srinivas Rayudu Case: శ్రీకాళహస్తి జనసేన మాజీ ఇన్చార్జి కోటా వినూత, ఆమె భర్త చంద్రబాబు దగ్గర పని చేసిన డ్రైవర్ శ్రీనివాస రాయుడు ఇటీవల దారుణమైన స్థితిలో మరణించిన విషయం తెలిసిందే. ఇతడిని వినూత, చంద్రబాబు, ఇంకా కొంతమంది కలిసి అంతం చేశారని పోలీసుల విచారణలో బయటపడింది. వినూత, చంద్రబాబు, ఇతర నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టడానికి పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇందులో భాగంగా రోజుకో తీరుగా సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి.
Also Read: మోడీ నిర్ణయం దేశ భవిష్యత్తును మార్చబోతోందా?
కోటా వినూత కుటుంబానికి శ్రీనివాసరాయుడుతో 16 సంవత్సరాలుగా అనుబంధం ఉంది. శ్రీనివాస రాయుడు కోటా వినూతకు డ్రైవర్ గా, వ్యక్తిగత సహాయకుడిగా, రాజకీయ సలహాదారుడిగా పని చేస్తున్నాడు. సరిగ్గా కొద్ది రోజుల క్రితం వినూత శ్రీకాళహస్తి మీడియా వాట్సాప్ గ్రూప్ లో ఒక పోస్ట్ చేశారు.. ఇకపై శ్రీనివాసరాయుడుతో తమకు ఎటువంటి సంబంధం లేదని అందులో పేర్కొన్నారు. అతడిని విధుల నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత కొద్ది రోజులకే శ్రీనివాసరాయుడు చెన్నైలోని ఓ నదిలో విగత జీవిగా కనిపించాడు. పోలీసులు అనేక కోణాలలో దర్యాప్తు చేసి కోటా వినూత, ఆమె భర్త చంద్రబాబు, కొంతమందిని అరెస్ట్ చేశారు. కోటా వినూత పేరు శ్రీనివాస రాయుడు చేతి మీద ఉండడం పోలీసులకు ఈ కేసును త్వరగా దర్యాప్తు చేయడానికి ఉపకరించింది. ఈ నేపథ్యంలో శ్రీనివాసరాయుడు కేసు విషయంలో అనేక విషయాలు వెలుగు చూస్తున్నయి. కోట వినూతకు చెందిన వ్యక్తిగత వీడియోలు డ్రైవర్ శ్రీనివాస రాయుడు దగ్గర ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు.. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కీలక రాజకీయ నాయకుడుగా ఉన్న ఒక వ్యక్తి కోటా వినూత వ్యక్తిగత గదులలో కెమెరాలు పెట్టించారని.. ఆ వీడియోలను ఆయనకు చేరవేయడంలో శ్రీనివాసరాయుడు కీలకపాత్ర పోషించాడని.. దానికోసం ఆ నాయకుడు శ్రీనివాసరాయుడికి 30 లక్షల నగదు ఇచ్చాడని వినూత దంపతులు పోలీసుల విచారణలో వెల్లడించినట్లు తెలుస్తోంది.
ఆ వీడియోలను బయటపెడతానని కోట వినూత దంపతులను ఆ రాజకీయ నాయకుడు బెదిరించాడని.. కోట వినూత అనుచరులకు ఆ వీడియోలను పంపిస్తానని భయభ్రాంతులకు గురి చేశాడని.. అందువల్లే శ్రీనివాస రాయుడిని విధుల నుంచి తొలగించినట్టు వినూత దంపతులు వెల్లడించారు. అయితే ఈ విషయాన్ని జనసేనలో ఉన్న ఓ కీలక నాయకుడికి కోటా వినూత దంపతులు చెప్పినప్పటికీ ఆయన పట్టించుకోలేదని.. అందువల్లే ఈ దారుణానికి తమ పాల్పడినట్టు కోటా వినూత దంపతులు పోలీసుల విచారణలో వెల్లడించినట్లు సమాచారం. అయితే దీనిని జనసేన, టిడిపి నాయకులు ఖండిస్తున్నారు. పోలీసులకు దొరికిపోయిన తర్వాత వినూత దంపతులు మార్చుతున్నారని.. కోట వినూత పేరును చేతి మీద పచ్చబొట్టు పొడిపించుకున్నాడు అంటే జరిగిన వ్యవహారం ఏమిటో అర్థం కావడం లేదా అంటూ టిడిపి, జనసేన నాయకులు అంటున్నారు.. ఇదంతా కూడా వేరే వ్యవహారం వల్ల జరిగిందని.. దానిని డైవర్ట్ చేయడానికి ఇలాంటి పథకాలు పన్నుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. అయితే ఈ కేసులో ఇంకా మరిన్ని విషయాలు వెలుగులోకి తీసుకురావాల్సి ఉన్న నేపథ్యంలో.. పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు చెబుతున్న సమాచారం ప్రకారం ఈ కేసుకు సంబంధించి మరికొద్ది రోజుల్లో మరిన్ని నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.