Tamil Nadu: నేటి కాలంలో బలంగా ఉండాల్సిన బంధాలు పలచనవుతున్నాయి. కష్టసుఖాల్లో తోడుగా ఉండాల్సిన మనుషులు చిన్న చిన్న కారణాలకే దూరమవుతున్నారు. ఫలితంగా సంసారాలు కూలిపోతున్నాయి. పెద్దలు కుదుర్చిన పెళ్లిళ్లు మాత్రమే కాదు, మనుషులు ఏరి కోరి ఏర్పరచుకున్న ప్రేమ బంధాలు కూడా ఇలానే అవుతున్నాయి.
ఆడ, మగ పరస్పరం కలిస్తేనే లైంగిక సంబంధం ఏర్పడుతుంది. ఇందులో ఎవరికీ పరస్పర ఆసక్తి లేకపోయినా సరే అది ఘోరమైన చర్య అవుతుంది. తొమ్మిది సంవత్సరాలు పాటు కలిసి ఉన్న ఇద్దరు.. బేదాభిప్రాయాల వల్ల విడిపోయారు. కలిసి ఉన్నంతకాలం గొప్పగా ఉన్న వారిద్దరు.. విడిపోయిన తర్వాత పరస్పర విరోధులుగా మారిపోయారు. పైగా తనతో ఇన్ని రోజులు పాటు కలిసి ఉన్న వ్యక్తి మీద ఆ మహిళ కేసు కూడా పెట్టింది. తనను బలత్కారం చేశాడని ఏకంగా కోర్టు మెట్లు ఎక్కింది. దీంతో ఈ వ్యవహారం చర్చకు దారి తీసింది. అయితే ఈ కేసును విచారించిన మద్రాస్ కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
తమిళనాడు రాష్ట్రంలోని తిరునల్వేలి ప్రాంతానికి చెందిన దేవా విజయ్.. ఓ మహిళతో గడిచిన తొమ్మిది సంవత్సరాలుగా రిలేషన్ లో ఉన్నాడు. వీరిద్దరూ అనేక పర్యాయాలు లైంగికంగా కలుసుకున్నారు.. తొమ్మిదేళ్లపాటు వీరిద్దరి మధ్య బంధం గొప్పగా సాగింది. ఆ తర్వాత చిన్న చిన్న కారణాలు వీరిద్దరి మధ్య విభేదాలను సృష్టించాయి. చివరికి విడిపోయారు. అయితే ఆ మహిళ అందరితోనే ఆగలేదు. దేవా తనపై బలాత్కారం చేశాడని కొత్త రాగం అందుకుంది. అంతేకాదు ఏకంగా కోర్టు మెట్లు ఎక్కింది. తొమ్మిదేళ్లుగా తనను ఇబ్బంది పెడుతున్నాడని దేవా మీద ఆ యువతి ఫిర్యాదు చేసింది. ఈ కేసును విచారించిన మద్రాస్ కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
” విఫలమైన ప్రతి బంధాన్ని నేరంగా పరిగణించలేం. బంధాలు చెడిపోగానే బలాత్కారం కేసులు పెట్టడం ఇటీవల సర్వ సాధారణంగా మారిపోయింది. 9 సంవత్సరాలు పాటు దేవా మీద మీరు ఒక్కసారి కూడా మా దగ్గరికి రాలేదు. అతడు బలత్కారం చేస్తుంటే ఎన్ని రోజులపాటు మీరు ఏం చేశారు? అసలు అతడితో మీకు ఎలా పరిచయం? మీకంటూ సొంతవారు లేరా? ఒకరోజు కూడా అతడు చేస్తున్నది నేరమని మీకు అనిపించలేదా? అతని మిమ్మల్ని మోసం చేశాడు అని చెప్పడానికి ఆధారాలు ఏమున్నాయి” ఆగ్రహం వ్యక్తం చేస్తూ కోర్టు కేసు కొట్టు వేసింది.