Sahasra Case Kukatpally: ఎన్నో కేసులను పరిష్కరించిన పోలీసులకే దిమ్మ తిరిగిపోయింది. వేలాది సీసీ కెమెరాలు పరిశీలించినప్పటికీ ఒక్క క్లూ కూడా దొరకకపోవడం పోలీసులను సైతం ఆందోళనకు గురిచేసింది. చివరికి ఒక ఐటీ ఉద్యోగి ఇచ్చిన సమాచారం కూకట్పల్లి సహస్ర కేసును చేదించేలా చేసింది. కాకపోతే హత్య జరిగిన నాటి నుంచి మొదలుపెడితే అసలు విషయం బయటకు వచ్చేంతవరకు పోలీసులు పడిన టెన్షన్ మామూలుది కాదు.
Also Read: రామ్ చరణ్ తో నటించడానికి నో చెప్పిన యంగ్ బ్యూటీ..మండిపడుతున్న ఫ్యాన్స్!
సహస్ర సోదరుడి దగ్గర ఖరీదైన క్రికెట్ బ్యాట్ ఉండేది. దానిమీద సహస్ర పక్కింట్లో ఉండే అబ్బాయి కన్ను పడింది. పైగా ఆ బాలుడికి క్రికెట్ అంటే చాలా ఇష్టం. కాకపోతే అతని దగ్గర ఖరీదైన బ్యాట్ లేకపోవడంతో అంతగా ఆడే అవకాశం ఉండేది కాదు. అయితే కొన్ని సందర్భాలలో సహస్ర తమ్ముడి బ్యాట్ తో ఆ బాలుడు క్రికెట్ ఆడేవాడు. తనకు బ్యాట్ ఇవ్వాలని కోరితే సహస్ర తమ్ముడు ఒప్పుకునేవాడు కాదు. ఆ బ్యాట్ ఎలాగైనా సరే దొంగిలించాలని ఆ బాలుడు అనుకున్నాడు. ఆరోజు సహస్ర ఇంట్లో ఎవరూ లేకపోవడం.. సహస్ర ఒక్కతే ఉండడం.. ఆమె కూడా టీవీలో మునిగిపోయి కనిపించడంతో నేరుగా ఇంట్లోకి వెళ్లి బ్యాట్ తీసుకున్నాడు. అతడు బ్యాట్ తీసుకోవడాన్ని చూసిన సహస్ర వారించింది. ఇప్పటికే తన వద్ద పదునైన కత్తి ఉండడంతో ఆమె గొంతు కోశాడు ఆ బాలుడు. ఆ తర్వాత ఒంటిమీద అనేకమార్లు కత్తితో పొడిచాడు.
బ్యాట్ తో పాటు ఇంట్లో ఉన్న 80000 నగదు కూడా తీసుకెళ్లాడు. అతడు వెళ్తున్న దృశ్యాన్ని ఓ ఐటీ ఉద్యోగి చూశాడు. ఆ తర్వాత ఆ బాలుడు ఈ కేసు విచారణకు వచ్చిన పోలీసులకు దగ్గరగా ఉండేవాడు. చివరికి సహస్ర చనిపోతున్నప్పుడు డాడీ డాడీ అని అరవడాన్ని తాను విన్నానని ఆ బాలుడు పోలీసులకు చెప్పడం విశేషం. అదే కాదు పోలీసులు విచారణ సాగిస్తున్న క్రమంలో అక్కడ జరుగుతున్న విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేవాడు. తన తల్లిదండ్రులతో కూడా ఈ విషయం గురించి చర్చించేవాడు. అయితే హత్య చేసి వచ్చిన తర్వాత ఆ బాలుడు వెంటనే స్నానం చేశాడు. రక్తపు మరకలు ఉన్న దుస్తులను శుభ్రం చేశాడు. దొంగిలించిన 80 వేల నగదులో కొంత మొత్తంతో ఖరీదైన స్మార్ట్ ఫోన్ కొన్నాడు. ఇదెక్కడిదని తల్లిదండ్రులు అడిగితే మీకెందుకు అని ఎదురు ప్రశ్నించాడు.. హత్య జరిగిన నాటి నుంచి అసలు విషయం వెలుగులోకి వచ్చేంతవరకు కూడా ఆ బాలుడు ఏమాత్రం టెన్షన్ పడకుండా ఉన్నాడు. చివరికి పోలీసులు అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పకుండా నిశ్శబ్దంగా ఉండిపోయాడు.
టీవీలలో వచ్చే నేరమయ చిత్రాలు వంటి వాటితో అతడు స్ఫూర్తి పొందాడు. పైగా నేరం ఎలా చేయాలి.. ఎలా తప్పించుకోవాలి.. అనే అంశాలపై అతడు ముందుగానే ప్రిపేర్ అయ్యాడు. పైగా వాటిని తన నోట్స్ లో కూడా రాసుకున్నాడు. పోలీసులు ఈ కేసును విచారిస్తున్న క్రమంలో ఇవన్నీ దొరికాయి. 15 సంవత్సరాల వయసులోనే అతడు ఇంత క్రూరంగా ఉండడం పట్ల పోలీసులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇంత దారుణంగా అతడు ప్రవర్తిస్తున్న తీరు తమను ఆందోళనకు గురిచేస్తోందని పోలీసులు చెబుతుండడం విశేషం