Homeక్రైమ్‌Pune businessman Ketan Agarwal case: పూణే వ్యాపారి కేసు: పకడ్బందీగా ప్రణాళిక.. కానీ అక్కడే...

Pune businessman Ketan Agarwal case: పూణే వ్యాపారి కేసు: పకడ్బందీగా ప్రణాళిక.. కానీ అక్కడే నిందితులు దొరికిపోయారు..

Pune businessman Ketan Agarwal case: పూణే వ్యాపారి కేతన్ అగర్వాల్ కేసులో నిందితులు సియా, చేతన్ అత్యంత పకడ్బందీగా ప్రణాళిక రూపొందించారు. అతడిని అంతం చేయడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేశారు. మే 31న ముందుగా అనుకున్న ప్రణాళిక ప్రకారం.. లోహ్ గడ్ కోటకు తీసుకువెళ్లాలనుకున్నారు. ఆరోజు కేతన్ వెళ్లలేదు.. మళ్లీ జూన్ 14న ప్రణాళిక రూపొందించారు. ఈసారి కేతన్ వెళ్లక తప్పలేదు.. కేతన్ ను అక్కడికి తీసుకెళ్లిన తర్వాత ఎత్తయిన ప్రదేశం నుంచి అతడిని నెట్టివేసింది సియా. అయితే అతడు లోయలో పడి.. ఒక చిన్నపాటి పొదను పట్టుకున్నాడు.. ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ తర్వాత సియా అక్కడ పాము కనిపించిందని.. అందువల్లే లోయలోకి నెట్టి వేసినట్టు చెప్పింది. ఆమె మాటలను నిజమని కేతన్ నమ్మాడు.

జూన్ 18న తన పుట్టినరోజు కావడంతో సియా అతడిని అక్కడికి తీసుకెళ్ళింది. వారిద్దరిని సియా ప్రేమికుడు చేతన్ అనుసరించాడు. కేతన్ ను సియా ఎత్తయిన ప్రాంతం వద్దకు తీసుకెళ్లిన తర్వాత.. అతడిని నెట్టివేశారు. లోయలో పడిన అతడు చనిపోయాడు. అతడు చనిపోయిన తర్వాత సియా గట్టిగా కేకలు వేయడం మొదలుపెట్టింది. భద్రతా సిబ్బంది వచ్చారు. సహాయక చర్యలు మొదలుపెట్టారు. కానీ అప్పటికే అతడు చనిపోయాడు. దీనిని మొదట్లో ప్రమాదం అని అనుకున్నారు. కానీ వెనుక ఉన్న అసలు వాస్తవం వేరే ఉందని ఆ తర్వాత తెలిసింది.

కేతన్ చనిపోయిన తర్వాత.. నాలుగు రోజు అతడి సోదరి ఫోన్ చేస్తే సియా వచ్చింది. వారిద్దరు కేతన్ గురించి మాట్లాడుకున్నారు. అయితే కేతన్ చనిపోయిన రోజు చెప్పిన మాటలకు.. ఆరోజు మాటలకు తేడా ఉండడంతో సియా మీద కేతన్ సోదరికి అనుమానం వచ్చింది. వారు పోలీసులకు కంప్లైంట్ చేశారు. దీంతో పోలీసు రంగంలోకి దిగి విచారణ మొదలుపెట్టారు. వాస్తవానికి మొదట్లో ఈ కేసులో సియా మీద కేతన్ కుటుంబ సభ్యులకు ఎటువంటి అనుమానాలు లేవు. ఎప్పుడైతే ఆమె మాట తడబడిందో.. వివరాలు చెప్పడంలో ఆమె తత్తర పాటును ప్రదర్శించిందో.. అప్పుడే వారికి అనుమానాలు మొదలయ్యాయి. ఆ తర్వాత పోలీసులకు కంప్లీట్ చేస్తే.. వారి విచారణలో అసలు విషయాలు బయటపడ్డాయి.

కేతన్ ను తోసి వేసింది తాను కాదని చేతను చెబుతున్నాడు. పోలీసులు ఎన్ని రకాలుగా విచారణ సాగించినప్పటికీ అతడు అదే చెబుతున్నాడు. మరోవైపు సియా నెట్టి వేయలేదని అంటున్నది. అలాంటప్పుడు అతడిని నెట్టివేసింది ఎవరు.. వీరిద్దరు కాకుండా మూడో వ్యక్తి ఎవరైనా వచ్చారా.. ఇప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం లభించాల్సి ఉంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular