Caught on CCTV: ఢిల్లీలోని షాహదారా ప్రాంతంలోని బిహారీ కాలనీలో దీపావళి వేడుకల సందర్భంగా గురువారం జరిగిన కాల్పుల్లో యువకుడితో సహా ఇద్దరు వ్యక్తులు మరణించగా, ఒక బాలుడు గాయపడ్డాడని పోలీసులు తెలిపారు. ఈ దారుణ ఘటన సీసీటీవీలో రికార్డయింది. మృతులను ఆకాష్ (40), అతని మేనల్లుడు రిషబ్ (16)గా గుర్తించారు. ఈ కాల్పుల్లో పదేళ్ల కుమారుడు క్రిష్‌కు గాయాలయ్యాయి. ఘటనకు సంబంధించి ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వారిపై ఐదు రౌండ్ల బుల్లెట్లు పేల్చారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఓ మైనర్‌ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇది వ్యక్తిగత శత్రుత్వమేనని ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. ‘రాత్రి 8.30 గంటలకు, బిహారీ కాలనీలో కాల్పులు జరిగాయని, కొందరు గాయపడ్డారని మాకు పీసీఆర్ కాల్ వచ్చింది. ఘటనా స్థలానికి చేరుకొని చూడగా ఆకాష్ (40), అతని మేనల్లుడు రిషబ్ (16), అతని కుమారుడు క్రిష్ (10)పై దుండగులు కాల్పులు జరిపినట్లు తెలిసింది. ఆకాష్, రిషబ్ ప్రాణాలు కోల్పోయారు. ప్రాథమిక విచారణలో 5 రౌండ్ల బుల్లెట్లు పేలినట్లు గుర్తించాం’ అని డీసీపీ షహదారా ప్రశాంత్ గౌతమ్ తెలిపారు.
కుటుంబం ఏమంటుంది?
చనిపోయిన ఆకాష్ తల్లి మాట్లాడుతూ దుండగుడు లక్షయ్ చెప్పింది. అతను కొన్ని రోజులు క్రమం తప్పకుండా తమ నివాసానికి వస్తున్నాడని చెప్పింది. దీపావళి రోజున స్వీట్ బాక్స్ తో ఇంటికి వచ్చాడు. ఆమె కొడుకు ఇంటి బయట క్రాకర్లు కాలుస్తున్నాడు. ఈ క్రమంలో అక్కడికి వచ్చిన లక్షయ్ ని చూసి ఆకాష్ ఇంట్లోకి పరుగులు తీశాడు. ఆ సమయంలో ఇంట్లోకి చొరబడి కాల్పులు జరిపాడు. శబ్ధాలు విని ఇంట్లో నుంచి అందరం బయటకు వచ్చి చూడగా రక్తపు మడుగులో ఆకాష్, రిషబ్, క్రిష్ పడి ఉన్నారు.
‘లక్షయ్ అనే వ్యక్తి 3, 4 రోజులుగా మా లైన్ లో తిరుగుతున్నాడు. స్వీట్ బాక్స్ తో మా ఇంటికి వచ్చి, దాన్ని నా చేతుల్లో పెట్టి స్వీకరించమని నన్ను బలవంతం చేశాడు. నా కొడుకు పటాకులు కాల్చేందుకు సన్నాహాలు చేస్తున్న సమయంలో లక్షయ్‌తో సహా ఇద్దరు వ్యక్తులు వచ్చారు, అప్పుడు నేను కాల్పులు జరుపుతున్నట్లు విన్నాను. తర్వాత, నా కొడుకు రక్తపు మడుగులో కనిపించాడు.’ అని ఆమె చెప్పింది.
ఆకాష్ సోదరుడు, రిషబ్ తండ్రి యోగేష్, ఆకాష్‌కి ఒకరితో ఆర్థిక వివాదం ఉందని చెప్పాడు. ‘ఈ సంఘటన గురువారం రాత్రి 7.30 నుంచి 8.00 గంటల సమయంలో జరిగింది. బైక్ పై వెళ్తున్న నా మేనల్లుడు, తెలియని పాదచారితో సహా ఇద్దరు వ్యక్తులు వచ్చారు. బైక్ పై ఉన్న వ్యక్తి నా తమ్ముడిని, నా కొడుకును హత్య చేశాడు. కొంతకాలం క్రితం మా అన్నకు డబ్బు విషయంలో ఒకరితో గొడవ జరిగింది. అని వెల్లడించారు.
Farsh Bazaar double murder cctv
A man and his cousin shot dead while celebrating Diwali. #delhimurder #DelhiPolice #Delhicrime pic.twitter.com/Z8b4iFkS3f— Shehla J (@Shehl) November 1, 2024