Karnataka: ఒక వయసులో ప్రేమ బాగుంటుంది. ఆ ప్రేమ విజయవంతమే పెళ్లి దాకా వెళితే పెద్దగా ఇబ్బంది ఉండదు. ఒకవేళ ఆ ప్రేమ విఫలమైతే.. తప్పనిసరిగా పెళ్లి చేసుకోవాల్సిందే. ఎందుకంటే ఏ కాకి కూడా ఏకాకి లాగా ఉండాలని అనుకోదు. ఇదే సిద్ధాంతం మనుషులకు కూడా వర్తిస్తుంది. మనుషులు ఏక బంధానికి కట్టుబడి ఉంటే బాగుంటుంది. కానీ నేటి రోజుల్లో అది సాధ్యం కావడం లేదు. పైగా బహుబంధాలను కొనసాగించడాన్ని నేటితరం గొప్పగా చెప్పుకుంటున్నది. అలా బహుబంధాన్ని కొనసాగించిన ఓ మహిళ చివరికి తన జీవితాన్ని సర్వనాశనం చేసుకుంది.
Also Read: ఓటీటీ లోకి వచ్చేసిన ‘కింగ్డమ్’ మూవీ..ఎందులో చూడాలంటే!
అదే ఆమె చేసిన తప్పు
కర్ణాటక రాష్ట్రానికి చెందిన దర్శిత (22) అనే యువతికి గతంలో సిద్ధ రాజు అనే వ్యక్తికి ప్రేమ బంధం ఉండేది. వీరిద్దరూ చాలా సంవత్సరాలు పాటు ప్రేమించుకున్నారు. ఏమైందో తెలియదు గానీ సిద్ధ రాజు, దర్శిత విడిపోయారు. ఇదే సమయంలో కేరళ రాష్ట్రానికి చెందిన సుభాష్ అనే వ్యక్తికి దర్శితను ఇచ్చి పెళ్లి చేశారు ఆమె కుటుంబ సభ్యులు. వివాహం జరిగిన తర్వాత ఒక కుమార్తె పుట్టింది. ఉన్న ఊర్లో ఉపాధి లేకపోవడంతో సుభాష్ బతుకు తెరువు కోసం దుబాయ్ వెళ్లిపోయాడు. సుభాష్ దుబాయ్ వెళ్లిపోయిన తర్వాత దర్శిత మళ్ళీ సిద్దరాజుకు ఫోన్ చేయడం మొదలుపెట్టింది. సిద్ధ రాజుకు దగ్గర అయింది. ఈ నేపథ్యంలో సుభాష్ తో తను ఉండలేనని.. కుమార్తెను తీసుకొని నీ వద్దకు వస్తానని సిద్ధరాజుతో చెప్పింది. సిద్ధరాజు వద్దని చెప్పడంతో దర్శిత బలవంతం చేసింది. ఎలాగైనా ఆమెను వదిలించుకోవాలని సిద్ధరాజు డిసైడ్ అయ్యాడు. కుమార్తెను ఇంటి వద్ద ఉంచి రమ్మని చెప్పాడు కర్ణాటక – మైసూరు పరిధిలో ఉన్న సలిగ్రామ్ అనే ప్రాంతంలోకి ఆమెను రమ్మని చెప్పాడు. ముందుగా ఆమెతో శారీరకంగా సుఖాన్ని అనుభవించాడు. ఆ తర్వాత పెళ్లి ప్రస్తావన రాగానే సిద్ధ రాజు ఆమెతో వాగ్వాదానికి దిగాడు. ఇలా ఉంటే సరిపోతుంది గానీ.. కొత్తగా పెళ్లి ఎందుకు అంటూ ఆమెను ప్రశ్నించాడు. అంతేకాదు ఆమెను తీవ్రంగా కొట్టాడు. నోట్లో డిటోనేటర్ పెట్టి పేల్చి చంపాడు. దీంతో ఆ ముఖం చిద్రమైపోయింది.
పోలీసులు విచారించడంతో..
దర్శిత కనిపించకపోవడంతో అత్తింటి వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ లోగానే గుర్తుతెలియని మృతదేహం ఉందని పోలీసులకు తెలియడంతో విచారణ చేపట్టారు. దర్శిత ఫోన్ కాల్ డాటా ఆధారంగా పోలీసులు విచారణ సాగించారు. సిద్ధ రాజును ప్రశ్నిస్తే చార్జింగ్ పెట్టిన ఫోన్ పేలడంతో ఆమె చనిపోయిందని చెప్పాడు. అతను చెప్పిన మాటలు పొంతన లేకుండా ఉండడంతో పోలీసులు అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించారు. ఆ తర్వాత అతడిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.