Homeక్రైమ్‌Ketan Agarwal Case: సియా చెప్పిన కోటి కాదట..కేతన్ కేసులో 10 కోట్లు.. లాయర్ బయటపెట్టిన...

Ketan Agarwal Case: సియా చెప్పిన కోటి కాదట..కేతన్ కేసులో 10 కోట్లు.. లాయర్ బయటపెట్టిన నిజం..

Ketan Agarwal Case: ఇది మామూలు వ్యవహారం కాదు. రకరకాల మలుపులు తిరుగుతోంది. ఎక్కడ ఆగుతుందో అర్థం కావడం లేదు. కేసును విచారిస్తున్న పోలీసులకే దిమ్మ తిరిగిపోతోంది. వార్తలు రాస్తున్న మీడియా ప్రతినిధులకు తల బద్దలవుతోంది. మలుపుల మీద మలుపులు.. ఉత్కంఠ మీద ఉత్కంఠ తెలుగు ధారావాహిక లాగా సాగిపోతూనే ఉంది. దీనికి ఎక్కడ ఎండ్ కార్డు పడుతుందో అర్థం కావడం లేదు.

ఇటీవల పూణే నగరానికి చెందిన స్థిరాస్తి వ్యాపారి కేతన్ అగర్వాల్ అనుమానాస్పద స్థితిలో కోట మీద నుంచి జారిపడి చనిపోయాడు. మొదట్లో ఇతని మరణాన్ని సహజ మరణం అని అనుకున్నారు. ఆ తర్వాత ఇతని మరణం వెనుక కాబోయే భార్య సియా, ఆమె ప్రియుడు చేతన్ ఉన్నారని పోలీసుల విచారణలో తేలింది. అనేక ఆధారాలు సేకరించిన పోలీసులు ఈ కేసును విచారించడం మొదలుపెట్టారు. దీంతో ఈ వ్యవహారంలో రకరకాల విషయాలు వెలుగుచూస్తున్నాయి.

తాజాగా ఈ కేసులోకి ప్రముఖ న్యాయవాది ఆశతో శ్రీ వాస్తవ ఎంట్రీ ఇచ్చారు. ఆయన ఏకంగా సరికొత్త విషయాన్ని తెరపైకి తీసుకొచ్చారు.. అంతేకాదు 10 కోట్ల వ్యవహారం ఉందని బాంబు పేల్చారు. ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న సియా సోదరుడు సాహిల్ ఇటీవల పోలీసుల విచారణలో కీలక విషయాలను బయటపెట్టారు.. అంతేకాకుండా శ్రీ వాస్తవ అనే లాయర్ మీద కీలక వ్యాఖ్యలు చేశారు. అతడు చేసిన వ్యాఖ్యలతో ఆ లాయర్ తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. అంతేకాదు 10 కోట్ల పరువు నష్టం నోటీసును సాహిల్ కు పంపించారు.

కోర్టు విచారణ జరగకముందే సియా సోదరుడు సాహిల్ లాయర్ శ్రీ వాస్తవ మీద సంచలన ఆరోపణలు చేశారు. “మేము అతడిని న్యాయవాదిగా నియమించుకోలేదు. మోసపూరితంగా మా సోదరి దగ్గరికి వచ్చాడు. ఆమె దగ్గర నుంచి సంతకం సేకరించాడు. అప్పటినుంచి మమ్మల్ని బెదిరిస్తున్నాడని”శ్రీ వాస్తవను ఉద్దేశించి ఇటీవల సాహిల్ వ్యాఖ్యానించాడు. ఈ ఆరోపణల మీద లాయర్ శ్రీ వాస్తవ ఆగ్రహం వ్యక్తం చేశారు. “నేను సియాను నేరుగానే సంప్రదించాను. ఆమె మేజర్ కాబట్టి నిర్ణయాలు మొత్తం ఇండిపెండెంట్గా తీసుకుంది. లీగల్ హెల్ప్ కోసం వకాలత్ నామా మీద నేరుగాని సంతకం చేసింది. సాహిల్ గురించి ఎన్నడు చర్చించలేదు. అసలు అతనితో మాట్లాడలేదు. నేరుగా సియాతోనే చర్చించాం. అతడు నిరాదరమైన ఆరోపణలు చేస్తున్నాడు. దీనివల్ల నా ప్రతిష్టకు భంగం కలిగింది.. అందువల్లే అతడు నుంచి 10 కోట్ల నష్టపరిహారాన్ని కోరుతున్నానని” శ్రీ వాస్తవ పేర్కొన్నాడు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version