Jumped Deposit scam : పేమెంట్ లకు సంబంధించి డిజిటల్ యాప్స్ వాడటం ఇటీవల కాలంలో పెరిగిపోయింది.. బడ్డీ కొట్టులో తాగే చాయ్ నుంచి.. షాపింగ్ మాల్స్ లో కొనే దుస్తుల వరకు.. ఇలా అన్నింటికీ డిజిటల్ పేమెంట్స్ యాప్స్ ఉపయోగించడం ఇటీవల కాలంలో పరిపాటిగా మారిపోయింది. బ్యాంకుకు వెళ్లే అవకాశం లేకుండా.. ఏటీఎంల ఎదుట పడిగాపులు కాసే ఖర్మ లేకుండా.. పోయింది.. 2020లో మహమ్మారి వ్యాపించిన నేపథ్యంలో.. దేశం మొత్తం స్తంభించిపోయిన క్రమంలో.. డిజిటల్ పేమెంట్ యాప్స్ వాడకం పెరిగిపోయింది.. ఇక అప్పటినుంచి అంతకంతకు విస్తరించింది. నగదు లావాదేవీలు మొత్తం డిజిటల్ పేమెంట్స్ యాప్స్ ద్వారా జరుగుతున్న నేపథ్యంలో కొత్తగా స్కామర్లు పుట్టుకొచ్చారు. అడ్డగోలుగా సంపాదించడానికి.. అందినంత కాడికి దండు కోవడానికి కొత్త ఎత్తులు వేస్తున్నారు.. గతంలో లింకులు పంపించి.. వ్యక్తిగత రహస్య నెంబర్లు చెప్పమని దోచుకునేవారు. ఆ తర్వాత ఫోన్లు చేసి.. మీకు ఫలానా దగ్గర్నుంచి మాదకద్రవ్యాలు వచ్చాయని, ఫలానా కేసులో మీరు ఇరుక్కున్నారని, ఫలానా వ్యవహారంలో మీవాళ్లు ఉన్నారని.. బెదిరించి డబ్బులు వసూలు చేసేవారు.. అయితే వీటన్నింటిపై పోలీసులు అవగాహన కల్పించిన నేపథ్యంలో ఆ తరహా ఉదంతాలు తగ్గిపోయాయి.
Also Read : పాపిష్టి డబ్బుల కోసం.. పాములను కూడా వదల్లేదు..అందులోనూ స్కామేనా?
ఇప్పుడు కొత్త ఎత్తుగడ
పోలీసులు అవగాహన కల్పించడంతో ప్రజల్లో జాగరుకత పెరిగింది. దీంతో స్కామర్ల ఎత్తుగడలు పలించడం లేదు.. అయితే ఇప్పుడు సరికొత్త దారుణాలకు స్కామర్లు తెర లేపారు. దానిని సైబర్ పరిభాషలో “జంప్డ్ డిపాజిట్ స్కాం” అని పిలుస్తున్నారు.. ఈ స్కామ్ లో భాగంగా ముందుగా మీకు స్కామర్ డబ్బులు పంపిస్తాడు.. డబ్బులు డిపాజిట్ రాగానే మీ మొబైల్ నెంబర్ కు ఒక మెసేజ్ వస్తుంది. డబ్బులు పంపించారని మెసేజ్ రాగానే వెంటనే మీరు మీ ఫోన్ పే లేదా గూగుల్ పే లో బ్యాలెన్స్ చెక్ చేసుకుంటారు. ఆ చెక్ చేసుకునే టైంలో స్కామర్లు పంపించిన ఫ్రీ ఇనిసియేటెడ్ విత్ డ్రా రిక్వెస్ట్ లో మీ పిన్ నమోదవుతుంది. తద్వారా స్కామర్లు వెంటనే డబ్బును డ్రా చేస్తారు..
ఏం చేయాలంటే
అపరిచితులు డబ్బు పంపగానే వెంటనే ఫోన్ పే లేదా గూగుల్ పే లోకి వెళ్లి ఎకౌంట్లో బ్యాలెన్స్ చెక్ చేసుకోకూడదు. ఒకవేళ మీరు గనక చెక్ చేసుకోకుండా ఉంటే స్కామర్లు పంపించిన ఫ్రీ ఇనిసియేటెడ్ విత్ డ్రా రిక్వెస్ట్ గడువు ముగిసిపోతుంది.. ఒకవేళ మీరు తప్పుడు వ్యక్తిగత రహస్య నంబర్ గనక ఎంటర్ చేస్తే.. ఫ్రీ ఇనిసియేటెడ్ విత్ డ్రా రిక్వెస్ట్ లో అదే నమోదవుతుంది. అప్పుడు చీకటి వ్యక్తులకు డబ్బు డ్రా చేసుకునే అవకాశం ఉండదు. అన్నిటికంటే ముఖ్యంగా అపరిచిత వ్యక్తులు డబ్బు పంపిస్తే ఎట్టి పరిస్థితుల్లో డిజిటల్ యాప్స్ ఓపెన్ చేయకూడదు. దాదాపు ఒక 30 నిమిషాల తర్వాత బ్యాలెన్స్ చెక్ చేసుకుంటే సరిపోతుంది.. ఎందుకంటే అప్పటికే ఫ్రీ ఇనిసియేటెడ్ విత్ డ్రా రిక్వెస్ట్ టైం ముగుస్తుంది కాబట్టి స్కామర్ల ఆగడాలు సాగవు.. అందువల్ల డిజిటల్ విధానంలో నగదు లావాదేవీలు నిర్వహించే వాళ్లు జాగ్రత్తగా ఉండాలి. అన్నింటికంటే ముఖ్యంగా అపరిచిత వ్యక్తులు పంపే నగదు విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలి.
Jumped deposit scam తో జాగ్రత్త!!
అజ్ఞాత వ్యక్తుల నుంచి UPI నుంచి మీ ఖాతాలోకి డబ్బులు వస్తే తెగ సంబరపడిపోకండి.
ఆత్రుతగా బ్యాలెన్స్ చెక్ చేసేందుకు పిన్ ఎంటర్ చేశారో.. అంతే.. మీ ఖాతా గుల్ల అవుతుంది.
బ్యాలెన్స్ చెక్ చేసే సమయంలోనే UPI ఐడీలకు పేమెంట్స్ లింక్ లను పంపి సైబర్… pic.twitter.com/qTwC6Vsz6q
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) January 10, 2025