Husband staged dharna: నేటి కాలంలో భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది ఉండడం లేదు. ముఖ్యంగా నేటి కాలపు యువతీ యువకులు ప్రతి విషయంలోనూ స్వేచ్ఛను కోరుకుంటున్నారు. తమకంటూ ప్రైమసీ ఉండాలని భావిస్తున్నారు. అందువల్లే ఏ విషయంలో కూడా రాజీవ్ పడడం లేదు. దీంతో బంధాలు కాస్త బలహీనమవుతున్నాయి. పెళ్లిళ్లు పెటాకులై అయిపోతున్నాయి. ఇవి కాస్త ఇతర సంబంధాల వైపు దారితీస్తున్నాయి.
ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. కుటుంబ పెద్ద కు అందరూ భయపడేవారు. చిన్న చిన్న గొడవలు వచ్చినా సరే కుటుంబ పెద్ద పరిష్కరించేవారు. ఫలితంగా సంసారాలు సజావుగా సాగేవి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉండేది. కానీ, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. పైగా చిన్న చిన్న విషయాలకే అహాలు దెబ్బతినడంతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు.. బంధాలను తెంపుకోవడానికి.. కొత్త బంధాలలో ఇమిడి పోవడానికి ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు.
ఈ ఘటన కూడా అటువంటిదే.. పైగా ఈ వ్యవహారంలో ఓ భర్త చేస్తున్న పోరాటం కన్నీరు తెప్పిస్తోంది.. భార్య సాగిస్తున్న విచ్చలవిడితనం సమాజంలో మారిన పరిస్థితికి అద్దం పడుతోంది.. నిజమాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ప్రశాంత్ అనే వ్యక్తి సంయుక్త అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. సరిగ్గా నాలుగు నెలల క్రితం వివాహం జరిగింది. మొదట్లో వీరి వైవాహిక బంధం బాగానే ఉంది. ఆ తర్వాత పరిస్థితి మారిపోయింది. సంయుక్త తన బావా లింబాద్రితో లేచిపోయిందని ప్రశాంత్ ఆరోపిస్తున్నాడు. అంతేకాదు తన భార్యను పంపించాలని ఏకంగా లింబాద్రి ఇంటిముందు ధర్నా చేశాడు.
లింబాద్రి, సంయుక్త వాట్సాప్ చాటింగ్ ను ప్రశాంత్ బయటపెట్టాడు. ఇదే విషయాన్ని పోలీసుల దృష్టి కూడా తీసుకెళ్లాడు. అయినప్పటికీ తనకు న్యాయం జరగడంలేదని అతడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తన దుస్థితిపై మీడియాలో వచ్చిన కథనాలను ఫ్లెక్సీ రూపంలో ఏర్పాటు చేసి లింబాద్రి ఇంటి ముందు ధర్నా చేశాడు. అతనితో లింబాద్రి కుటుంబ సభ్యులు గొడవపడ్డారు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారం మీడియాలో ప్రముఖంగా ప్రసారం కావడంతో.. పోలీసులు రంగ ప్రవేశం చేశారు. దీనికి సంబంధించి విచారణ జరుపుతున్నామని పోలీసులు చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ తన భార్య ను తనతో పంపించాలని ఓ భర్త చేస్తున్న పోరాటం ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది. కన్నీరు పెట్టించేలా చేస్తోంది. మరి ఈ విషయంలో పోలీసులు ప్రశాంత్ కు ఎలాంటి న్యాయం చేస్తారో చూడాల్సి ఉంది.