Hathras Tragedy : ఇంతకీ హథ్రాస్ లో ఏం జరిగింది? ఇంతమంది చావుకు కారణమైన ఎవరీ బోలే బాబా?

Hathras Tragedy బాబాను క్రమంగా బోలే బాబా అని పిలుచుకోవడం మొదలు పెట్టారు భక్తులు. ఇక్కడ ముఖ్యంగా శివారాధన చేస్తారట. అయితే ఇక్కడ ఇచ్చే తీర్థం తాగితే ఎన్ని సమస్యలు ఉన్నా తొలిగిపోతాయి అని నమ్ముతారట భక్తులు.

Written By: Swathi, Updated On : July 2, 2024 8:01 pm

Hathras Tragedy

Follow us on

Hathras Tragedy : హథ్రాస్.. హథ్రాస్ ఏ ఛానెలో చూసినా హథ్రాస్ పేరే మారుమోగుతుంది. ఇంతకీ ఏం జరిగింది. ఎందుకు చాలా మంది ప్రాణాలు వదిలారు? ఎవరిదీ ఈ పాపం? ఎందుకు ఇలా జరిగింది అనే వివరాలు తెలుసుకుందాం. ఉత్తరప్రదేశ్ లోని హథ్రస్ జిల్లా సికింద్రా రౌ ఏరియా రతి భాన్పూర్ లోని ఓ గ్రామంలో బోలే బాబ అనే గురువు సత్సంగ్ ను ఏర్పాటు చేశారు. ఆయనను నమ్మే జనాలు అక్కడికి తండోపతండాలుగా తరలివచ్చారు. ఓ వైపు వేడి, మరో వైపు ఏకధాటిగా వస్తున్న జనాలు, గ్యాప్ లేకుండా ఇసుక పోస్తే రాలనంత జనంలో ఆ ఏరియా మొత్తం నిండిపోయింది.

ఏకంగా 4 లక్షల మంది హాజరైన ఈ సభలో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. వేదిక వద్ద ఊపిరాడక అసౌకర్యానికి గురయ్యారట భక్తులు. ఇక ప్రవచనాలు ముగిసిన తర్వాత తిరిగి వెళ్లే దారి సరిగ్గా లేకపోవడం, మరోవైపు ఉక్కపోత వల్ల పరుగులు తీశారట ప్రజలు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి పెద్ద ఎత్తున గుమిగూడిన భక్తులు ఉక్కబోతను భరించలేక పరుగులు తీయడంతో తొక్కిసలాట మొదలైంది అంటున్నారు భక్తులు. ఈ తొక్కిసలాటలో మహిళలు, చిన్నారులు, వృద్ధులు కూడా గాయపడ్డారు. అయితే ఇందులో ఏకంగా వంద మందికి పైగా మరణించారట. 150 మందికి పైగా గాయపడ్డారు అని సమాచారం.

ఈ ఘటనపై ఇప్పటికే పీఎం ప్రదాని మోడీ, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం యోగి ఆదిత్యనాథ్, , రాహుల్ గాంధీలు స్పందించారు. వీరికి నష్టపరిహారం కూడా అందిస్తామని ప్రకటించింది ప్రభుత్వం. ఇదిలా ఉంటే కొన్ని సంవత్సరాల క్రితం ఓ ప్రభుత్వ ఉద్యోగం చేసిన వ్యక్తి బోలే బాబాగా మారారు. గతంలో ఆయన ప్రవచనాలు చెప్పడం ప్రారంభించారట. ఇవి నచ్చిన జనాలు వేలల్లో ఆ తర్వాత లక్షల్లో తరలి రావడం ప్రారంభించారట. బాబాను క్రమంగా బోలే బాబా అని పిలుచుకోవడం మొదలు పెట్టారు భక్తులు. ఇక్కడ ముఖ్యంగా శివారాధన చేస్తారట. అయితే ఇక్కడ ఇచ్చే తీర్థం తాగితే ఎన్ని సమస్యలు ఉన్నా తొలిగిపోతాయి అని నమ్ముతారట భక్తులు.