Homeక్రైమ్‌Gold Man Vijay Delhi Police Seizure: రెండున్నర కిలోల బంగారంతో బిల్డప్ ఇచ్చాడు.. పోలీసులేమో...

Gold Man Vijay Delhi Police Seizure: రెండున్నర కిలోల బంగారంతో బిల్డప్ ఇచ్చాడు.. పోలీసులేమో ఇత్తడి చేసి పంపించారు..

Gold Man Vijay Delhi Police Seizure: బంగారం మీద ఆడవాళ్లకు విపరీతమైన ఇష్టం ఉంటుంది. ఎంత బంగారం ఉన్నా సరే ఆడవాళ్లు ఇంకా కావాలని కోరుకుంటారు. రకరకాల ఆభరణాలను ధరించి ముచ్చట పడుతుంటారు. పెళ్లిళ్లకు.. పెద్దమనుషుల ఫంక్షన్లకు బంగారాన్ని ఒంటి మీద ధరించి మురిసిపోతుంటారు. ఆడవాళ్ళందరూ ఒక చోట చేరితే బంగారం గురించి చెప్పుకుంటుంటారు.

Also Read: ఏంటి ఈ బౌలింగ్ తో ఐపీఎల్ ట్రోఫీ గెలుస్తారా.. బ్యాగులు సర్దుకుని ఇంటికి వచ్చేయండి

కొంతమంది మగాళ్లకు కూడా బంగారం ఉంటే విపరీతమైన ఇష్టం ఉంటుంది. మెడలో గొలుసులు.. చేతికి ఉంగరాలు.. రకరకాల అభరణాలు చేయించుకుని ధరిస్తారు. పదిమందిలో తమ దర్పాన్ని ప్రదర్శిస్తుంటారు. గోల్డ్ మాన్ లాగా తమహావభావాలను ప్రదర్శిస్తుంటారు. ఇటీవల కాలంలో ఒంటిమీద మగాళ్లు కిలోల కొద్ది బంగారాన్ని ధరించడాన్ని ఫ్యాషన్ గా మార్చుకున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో చాలామంది పహిల్వాన్లు.. సెటిలర్లు.. రియల్టర్లు బంగారాన్ని ధరించి.. సోషల్ మీడియాలో పెట్టడం.. సెలబ్రిటీలుగా చలామణి అవడం ఇటీవల కాలంలో పెరిగిపోయింది..

కొన్ని యూట్యూబ్ చానల్స్ అయితే ఇలా బంగారం ధరించిన వ్యక్తులతో ఇంటర్వ్యూలు కూడా చేయడం మొదలుపెట్టాయి.. తద్వారా ఇలా వచ్చిన ఫేమ్ ను ఉపయోగించుకొని ఆ బంగారు బాబులు సెలబ్రిటీలుగా చలామణి అవుతున్నారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో గోల్డ్ మెన్ గా పేరుపొందిన విజయ్ అనే ఓ వ్యక్తికి ఢిల్లీ పోలీసులు షాక్ ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఐదు రాష్ట్రాలలో ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో విమానాశ్రయాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో విజయ్ తన ఒంటిమీద రెండున్నర కిలోల బంగారాన్ని ధరించి ఢిల్లీలో ఒక కార్యక్రమానికి హాజరయ్యాడు. దీంతో అక్కడి పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. బంగారం మొత్తం స్వాధీనం చేసుకున్నారు. ఇందులో కేజీ బంగారానికి ఆయన పత్రాలు చూపించడంతో దానిని అతడికి ఇచ్చేశారు. మిగతా బంగారానికి పత్రాలు చూపించకపోవడంతో దానిని స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు విజయ్ కి నోటీసులు ఇచ్చి పంపించారు.

విజయ్ గోల్డ్ ధరించి ఆ సమావేశానికి వచ్చిన వారందరికీ తన రేంజ్ ఏమిటో చూపించాలని అనుకున్నాడు. కానీ ఢిల్లీ పోలీసులు షాక్ ఇచ్చారు. సినిమాలో మాదిరిగా ట్విస్ట్ ఇచ్చి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఫలితంగా విజయ్ డిఫెన్స్ లో పడ్డాడు. ఢిల్లీ పోలీసులు ఇచ్చిన షాక్ నుంచి ఇంతవరకు తేరుకోలేదు

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular