Homeక్రైమ్‌Gold Loan Scam In India: 'మీ బంగారాన్ని తాకట్టు నుంచి విడిపిస్తాం..' అంటూ ఎవరైనా...

Gold Loan Scam In India: ‘మీ బంగారాన్ని తాకట్టు నుంచి విడిపిస్తాం..’ అంటూ ఎవరైనా కలుస్తున్నారా..?

Gold Loan Scam In India: వివిధ అవసరాల నిమిత్తం కొంతమంది బంగారం తాకట్టుపెట్టి రుణం తీసుకుంటారు. అయితే ఆ తర్వాత సరైన ఆదాయం లేకపోవడంతో ఈ రుణం పై వడ్డీ పెరుగుతుంది. ఈ సమయంలో బంగారం తీసుకోవడానికి అవకాశం ఉండదు. అయితే కొందరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపిస్తాం అంటూ ఇటీవల ప్రకటనలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ ప్రకటనలు పోస్టర్ల రూపంలో మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కూడా కనిపిస్తూ ఉన్నాయి. అయితే కొందరు వీటికి అట్రాక్ట్ అయి మోసపోయిన సంఘటనలు ఉన్నాయి. తాకట్టు పెట్టిన బంగారం విడిపిస్తా అంటూ వ్యక్తుల వివరాలు పూర్తిగా తెలుసుకొని వారి బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు కొల్లగొడుతుంటారు. అసలు ఈ మోసం ఎలా ఉంటుందంటే?

బంగారం పై రుణం లేదా బ్యాంకు నుంచి రుణం తీసుకున్న వారు.. దీని నుంచి విముక్తి పొందాలని కోరుతూ ఉంటారు. దీనిని అదును చేసుకున్న కొందరు తక్కువ వడ్డీకే కొత్తలోని ఇస్తాం అంటూ ప్రచారం చేస్తారు. అయితే ఒకవేళ ఈ ప్రకటనలకు స్పందిస్తే మోసం చేసేవారు ముందుగా తాకట్టు రసీదు, ఆధార్, ఫోటోలు పంపాలని కోరుతాడు. ఆ వివరాలు వచ్చిన తర్వాత నకిలీ ఒప్పందాన్ని చేసుకుంటారు. ఆ తర్వాత లోన్ ఆఫర్ లెటర్లు పంపిస్తారు. కానీ చివరికి అదేమీ ఇవ్వకుండా మొహం చాటేసి కనిపించకుండా పోతారు.

ప్రధానంగా ఇలాంటి వాటిలో నాలుగు రకాల మోసాలు ఉంటాయి. వీటిలో మొదటిది ముందస్తు ఫీజు బస్సులు చేయడం. బంగారం విడిపిస్తామని చెప్పిన వారు ప్రాసెసింగ్ ఫీజు పేరిట ముందస్తుగా డబ్బులు వసూలు చేస్తారు. ఇందులో ఇన్సూరెన్స్, స్టాంపు చార్జీలు అంటూ అదనంగా వసూలు చేస్తారు. రెండోది బంగారం తీసుకుని పారిపోవడం వంటివి కూడా ఉంటాయి. కొందరు గ్యాంగ్ గా ఏర్పడి ఫ్రీ ప్లాన్ తో రెడీగా ఉంటారు. ముందుగా వీరిలో ఒకరు బ్యాంకుకు వెళ్లి బంగారం తీసుకొస్తామంటూ వస్తారు. ఆ తర్వాత బాధితులతో అధికార పత్రం పై సైన్ చేయించుకుంటారు. బంగారం తీసుకున్న తర్వాత ఒక్కసారిగా అదృశ్యం అవుతారు.

అలాగే తాకట్టులో ఉన్న ఫైనాన్స్ కంపెనీ తమకు బాగా పరిచయం ఉందని.. సెటిల్మెంట్ చేస్తామని బాధితులను నమ్మిస్తారు. ఇందులో భాగంగా బాధితులను తిప్పుకుంటూ వారి చేత ఖర్చులు చేయిస్తారు. చివరికి బంగారం మాత్రం తాకట్టు లోనే ఉంటుంది. చివరగా తాకట్టు పెట్టిన వారి సమాచారం సేకరించడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తారు. ఇందులో ఆధార్, పాన్, తాకట్టుకు సంబంధించిన రసీదులను తీసుకొని మరోచోట లోన్ పొందుతారు. ఇలాంటి మోసాలు ఎక్కువగా గ్రామీణ, పట్టణాల్లో కనిపిస్తాయి. అప్పుల బాధతో ఉన్నవారు వాటి నుంచి త్వరగా బయటపడేందుకు బాధితులు చెప్పే ప్రతి మాట వింటూ ఉంటారు. అందువల్ల ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper
Exit mobile version