Bangalore: దొంగతనం అనేది ఒక పనికిమాలిన అలవాటు. కాకపోతే కొంతమంది దీనిని ఒక ఉపాధిగా మార్చుకుంటారు. జేబుకు తెలియకుండా పర్స్ కొట్టేస్తుంటారు. అక్కడితోనే ఆగరు.. బంగారం నుంచి మొదలుపెడితే డబ్బు వరకు ఇలా ప్రతి విలువైన వస్తువు తస్కరిస్తూనే ఉంటారు. దొరికితే దొంగలవుతారు. దొరక్కపోతే దొరల మాదిరిగా ప్రవర్తిస్తుంటారు.
మగవాళ్ళు చేసే దొంగతనాలు తొందరలోనే బయటపడతాయి. కానీ, ఆడవాళ్లు చేసే దొంగతనాలు అంత ఈజీగా బయటపడవు. ఈమె కూడా అలానే అనుకుంది. పైగా చదువుకున్న యువతి కావడం… చూస్తుంటే కార్పొరేట్ ఉద్యోగిగా కనిపించడంతో ఎవరికి పెద్దగా అనుమానం రాలేదు. దానినే తనకు అనుకూలంగా మార్చుకుంది. అంతేకాదు, దాని మాటున దొంగతనాలకు పాల్పడింది. మొదట్లో ఇలా దొంగతనం చేస్తుండడాన్ని ఆమె ఆస్వాదించేది. ఆ తర్వాత ఏమైందో తెలియదు ఒక్కసారిగా దొరికిపోయింది.
దేశ ఐటి రాజధానిగా పేరుపొందిన బెంగళూరులో ఓ గ్లామరస్ దొంగ ఉదంతం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ఈమెకు భక్తి ఎక్కువ. కానీ ఆ భక్తి మాటున దొంగతనాలు చేస్తూ ఉంటుంది. పూజలు చేస్తున్నట్టు.. దేవతామూర్తులకు మొక్కుతున్నట్టు నటిస్తూ ఉంటుంది. ఆ తర్వాత గుళ్ళు, రద్దీగా ఉన్న ప్రదేశాలలో బంగారాన్ని తస్కరిస్తూ ఉంటుంది. అన్నట్టు ఈమె పేరు గాయత్రి. ఈమె చూసేందుకు మోడ్రన్ లుక్ లో కనిపిస్తూ ఉంటుంది. అందువల్లే ఎవరికీ పెద్దగా అనుమానం రాదు. ఈమె తన దొంగతనాలకు తోడుగా భర్తను కూడా పెట్టుకుంది.. అతని పేరు శ్రీకాంత్. గాయత్రి, శ్రీకాంత్ కలిసి ఇప్పటివరకు 60 లక్షల విలువైన బంగారాన్ని తస్కరించారు. ఇటీవల బెంగళూరు ప్రాంతంలో ఓ గుడిలో బంగారం పోవడంతో అక్కడి అర్చకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అర్చకులు నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.