Gadwal Wife Kills Husband: ఇటీవల మేఘాలయ రాష్ట్రంలో హనీమూన్ వెళ్లిన దంపతుల్లో.. తన భర్తను భార్య ప్రియుడి సహకారంతో అంతం చేసిన సంగతి తెలిసిందే. ఈ దారుణం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఆ తరహా ఘటనే తెలంగాణ రాష్ట్రంలోని గద్వాల జిల్లాలో చోటుచేసుకుంది.
అప్పటికే ఆమెకు బ్యాంకు ఉద్యోగితో సంబంధం ఉంది.. అయినప్పటికీ ఆమె మరో మగాడిని పెళ్లి చేసుకోవాలనుకుంది. ఇందులో భాగంగానే అతడిని ప్రేమ పేరుతో వేధించింది. పెళ్లి చేసుకోవాలని ఏడ్చేసింది.. అతడిని నమ్మించి.. వివాహం జరిగిన 30 రోజుల్లోనే చంపించింది.. అయితే ఈ ఘటనలో షాకింగ్ నిజాలు వెలుగు చూశాయి. పోలీసుల దర్యాప్తులో బ్యాంకు ఉద్యోగితో ఆమెకు ఉన్న కి సంబంధమే ఈ దారుణానికి దారి తీసిందని తెలుస్తోంది.. సరిగ్గా 5 రోజుల క్రితం తెలంగాణ రాష్ట్రంలోని గద్వాల ప్రాంతంలో యువకుడు అదృశ్యమయ్యాడు. చివరికి ఆదివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి కర్నూలు జిల్లా పాణ్యం ప్రాంతంలో విగత జీవుడిగా కనిపించాడు. గద్వాలలోని తేజేశ్వర్ అనే యువకుడు ప్రైవేట్ సర్వాయర్ గా పనిచేస్తున్నాడు. ఇతడికి ఫిబ్రవరి 13న కల్లూరు ఎస్టేట్ ప్రాంతానికి చెందిన ఐశ్వర్య అనే యువతితో వివాహం కుదిరింది.. ఆ తర్వాత వారిద్దరి మధ్య ఫోన్లో సంభాషణలు జరుగుతున్నాయి. సరిగ్గా పెళ్ళికి ఐదు రోజుల ముందు ఐశ్వర్య కనిపించలేదు. అయితే ఐశ్వర్య కు గతంలోనే ఒక బ్యాంకు ఉద్యోగితో సంబంధం ఉంది. దీంతో అతని వద్దకు ఆమె వెళ్లిపోయిందని అందరూ అనుకున్నారు. ఐశ్వర్య వెళ్ళిపోయిన విషయాన్ని తేజేశ్వర్ ప్రశ్నించగా. కట్నం కోసం మా అమ్మ ఇబ్బందులు పడుతోందని.. ఆ బాధ చూడలేక స్నేహితుతాలి వద్దకు వెళ్లిపోయానని కల్లబొల్లి కబుర్లు చెప్పింది. అంతేకాదు తేజేశ్వర్ ను పట్టుకొని ఏడ్చింది. దీంతో అతడు మే 18న ఐశ్వర్యను వివాహం చేసుకున్నాడు. అయితే ఐశ్వర్య నిత్యం ఫోన్లోనే ఉండడంతో.. తేజేశ్వర్ కు అనుమానం వచ్చింది. దీంతో వారిద్దరి మధ్య వివాహం జరిగిన రెండు రోజుల నుంచే మనస్పర్ధలు వచ్చాయి. ఈ క్రమంలో జూన్ 17న తేజేశ్వర్ కనిపించకుండా పోయాడు. పాణ్యం సమీపంలో అతని మృతదేహం కనిపించింది.
Also Read: Crime News : రాగి పాత్రతో రూ.25 లక్షలు.. కక్కుర్తి పడ్డారు.. చివరికిలా..
పోలీసులకు ఫిర్యాదు చేయగా..
తేజేశ్వర్ మృతదేహం కనిపించిన నేపథ్యంలో అతని కుటుంబ సభ్యులు ఐశ్వర్య, ఆమె తల్లి సుజాత పై అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు లోతుగా దర్యాప్తు చేయగా షాకింగ్ నిజాలు వెలుగు చూశాయి. సుజాత కర్నూలులో బ్యాంకులో స్వీపర్ గా పనిచేస్తున్నది. ఆ బ్యాంకులోకి క్యాషియర్ గా పనిచేస్తున్న వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని తెలుస్తోంది. అతడు క్రమంగా ఐశ్వర్యతోనూ వ్యవహారం సాగించడం మొదలుపెట్టాడు. వాస్తవానికి తేజేశ్వర్ ను వివాహం చేసుకున్న తర్వాత అతడికి 150 సార్లు ఐశ్వర్య ఫోన్ చేస్తే.. క్యాషియర్ కు మాత్రమే ఏకంగా 2000 సార్లు ఫోన్లో మాట్లాడినట్టు కాల్ డాటా ద్వార పోలీసులకు తెలిసింది. తేజేశ్వర్ ను అడ్డు తొలగించుకుంటేనే బాగుంటుందని భావించిన వారిద్దరు.. అతడిని హతమార్చాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే తేజేశ్వర్ ను అంతం చేయడానికి ఆ బ్యాంకు ఉద్యోగి కొంతమందితో ప్రణాళిక రూపొందించి.. సుఫారి కూడా ఇచ్చాడు. ఇందులో తన డ్రైవర్ నాగేష్ ని కూడా ఉపయోగించుకున్నాడు.. జూన్ 17న బ్యాంకు క్యాషియర్ సఫారీ ఇచ్చిన వ్యక్తులు తేజేశ్వర్ ను కలిశారు.. తమ భూమి సర్వే చేయాలని చెప్పి అతడిని గద్వాల దాకా తీసుకెళ్లారు. కారులోనే అతనిపై మూకుమ్మడిగా మారణాయుధాలతో దాడి చేశారు.. అతన్ని అత్యంత పాశవికంగా చంపేశారు. అనంతరం తేజశ్వర్ మృతదేహాన్ని సుగాలి మెట్టు ప్రాంతం వద్ద పడేశారు. ఇక ఈ దారుణానికి ఐశ్వర్య తల్లి సుజాత కూడా తన వంతుగా సహకారం అందించడం విశేషం.. ఐశ్వర్య, సుజాత ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్యాంకు ఉద్యోగి పరారీలో ఉన్నాడు. ఈ హత్యకు కారణమైన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.