spot_img
Homeక్రైమ్‌Former DGP Granddaughter Fraud: మాజీ డిజిపి మనవరాలినీ వదలని సైబర్ నేరగాళ్లు.. ఎన్ని...

Former DGP Granddaughter Fraud: మాజీ డిజిపి మనవరాలినీ వదలని సైబర్ నేరగాళ్లు.. ఎన్ని కోట్లు ముంచారంటే?

Former DGP Granddaughter Fraud: ఆమధ్య సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ భార్య ఫైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయారు. దాదాపు కోటికి మించిన నగదును కోల్పోయారు. మోసపోయానని గ్రహించిన తర్వాత.. సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఘటన మర్చిపోకముందే.. మళ్లీ ఇంకొక హై ప్రొఫైల్ కేసు తెరపైకి వచ్చింది. ఈసారి సైబర్ నేరగాళ్లు ఏకంగా మాజీ డిజిపి మనవరాలని టార్గెట్ చేశారు.

Also Read: అసెంబ్లీలో ‘గులాబీ’ ఫైట్: కెప్టెన్ కేసీఆర్ లేని గ్రౌండ్.. రేవంత్ ‘సిక్స్’ల పండగ!

హైదరాబాద్ నగరంలో దాదాపు 18 కంపెనీలకు డైరెక్టర్ గా కొనసాగుతున్నారు మాజీ డిజిపి మనవరాలు దొడ్ల దివ్య రెడ్డి. ఇటీవల ఆమె కంపెనీలలో పనిచేస్తున్న అకౌంటెంట్ కు ఒక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ వాట్సప్ ద్వారా వచ్చింది. ఆ నెంబర్ డిపి కి దివ్య రెడ్డి ఫోటో ఉంది.. “నేను మీటింగ్ లో ఉన్నాను. అర్జెంటుగా అమౌంట్ పంపించాలి. నేను చెప్పిన ఎకౌంటు కు 1.20 కోట్లు బట్వాడా చేయాలని” అకౌంటెంట్ కు మెసేజ్ వచ్చింది.

దివ్య రెడ్డి ఫోటో ఉండడం.. పైగా తనకు డబ్బు పంపించాలని మెసేజ్ పంపడంతో .. ఆమె అయి ఉంటారని అకౌంటెంట్ భావించారు. వెంటనే వాట్సప్ సందేశంలో వచ్చిన ఎకౌంట్ నెంబర్ కు అకౌంటెంట్ 1.20 కోట్లు పంపించాడు. ఆ తర్వాత కొద్ది రోజులకు మళ్ళీ అదే నెంబర్ నుంచి అతనికి మెసేజ్ వచ్చింది. ఈసారి ఏకంగా రెండు కోట్లు డబ్బు పంపించాలని ఆ మెసేజ్ లో సైబర్ నేరగాళ్లు పేర్కొన్నారు. దీంతో ఆ అకౌంటెంట్ కంగారుపడ్డాడు. మోసపోయానని గ్రహించి.. విషయాన్ని దివ్య రెడ్డికి చెప్పాడు. దీంతో ఆమె అన్ని ఆధారాలు సేకరించి సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఇటీవల కాలంలో సైబర్ నేరగాళ్లు హై ప్రొఫైల్ వ్యక్తులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. మాయమాటలతో.. మోసపూరితమైన సందేశాలు పంపించి నిండా ముంచేస్తున్నారు. కోట్లకు కోట్లు వేరే ఖాతాలలోకి మళ్లించి.. పబ్బం గడుపుకుంటున్నారు. పైగా ఈ డబ్బులను మ్యూల్ ఖాతాల ద్వారా వేరే వేరే అకౌంట్లకు బదిలీ చేస్తూ డబ్బులను డ్రా చేస్తున్నారు. ఈ అకౌంటు నెంబర్లను కనుక్కొని సమయం లోగా సైబర్ నేరగాళ్లు ఉన్నది మొత్తం ఉడాయించుకొని వెళ్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version