Fake Judge: అది 1969 సంవత్సరం.. పోలీస్ రికార్డుల్లో మాత్రం సూపర్ నట్వర్‌లాల్, ఇండియన్ చార్లెస్ శోభరాజ్ అని పేర్కొంటారు. కానీ అసలు పేరు మాత్రం ధనిరామ్ మిట్టల్. భారతదేశంలోని అత్యంత తెలివైన నేరస్థుడిగా పేరు గాంచాడు. మిట్టల్ చదువు సంధ్యలు అబ్బక అల్లరిచిల్లరిగా తిరిగి దొంగతనాలకు అలవాటు పడ్డాడనుకుంటే పొరపాటు. ఇతను లా డిగ్రీ చదివాడు. అంతేకాదు హ్యాండ్ రైటింగ్‌లో స్పెషలిస్ట్. గ్రాఫాలజిస్ట్.. ఇలా ఎన్నో విద్యార్హతలున్న ధనిరామ్ మిట్టల్ దొంగతనాన్ని జీవనోపాధిగా ఎంచుకోవడం గమనార్హం. సుమారు ఆరు దశాబ్దాల పాటు రికార్డుస్థాయిలో అరెస్ట్ అవ్వడంతోపాటు వెయ్యికిపైగా కార్లు దొంగతనం చేశాడు. ప్రధానంగా ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్ చుట్టుపక్కల ప్రాంతాల్లో పట్టపగలు కార్లను దొంగలించడం ఇతని స్పెషాలిటీ. మరో స్పెషాలిటీ ఏమిటంటే తప్పుడు పత్రాలను సృష్టించి అదనపు సెషన్స్ జడ్జి స్థానంలో జడ్జి అవతారమెత్తి 2 వేల మంది నేరస్తులను విడిపించాడు. ఏం జరుగుతోందో పోలీసులకు అర్థమయ్యేలోగా అక్కడి నుంచి మిట్టల్ మాయమయ్యాడు. విషయం తెలుసుకున్నాక అతను విడిపించిన నేరస్తులందరినీ మళ్లీ కటకటాల వెనక్కి నెట్టారు.
– ఐకానిక్ బ్రయాన్ సాహిత్యంలా..
ఐకానిక్ బ్రయాన్ ఆడమ్స్ సాహిత్యం ప్రకారం.. ధని రామ్ మిట్టల్, ఒక యువ సైన్స్ గ్రాడ్యుయేట్. పగటిపూట స్టేషన్ మాస్టర్ గా చేసేవాడు మిట్టల్. తన షిఫ్ట్ తర్వాత కోర్టు పార్కింగ్ స్థలాల నుంచి కేవలం వినోదం కోసం వాహనాలను దొంగిలించేవాడు. కోర్టు బయట వాహనాలను చూశాక మిట్టల్‌కు న్యాయ వ్యవస్థకు మరింత దగ్గరవ్వాలన్న ఆలోచన వచ్చింది. అనుకున్నదే తడవుగా న్యాయమూర్తి అవతారమెత్తాడు. మిట్టల్ ఝజ్జర్‌లోని కోర్టులో ఒక న్యాయమూర్తి సంతకం ఫోర్టరీ చేసి అతడిని సెలవుపై పంపించి అతని స్థానంలో మేజిస్ట్రేట్‌గా నియమించబడ్డాడు.
– న్యాయమూర్తిగా దొంగ..
ఇక న్యాయమూర్తిగా మారిన దొంగ కేవలం మొక్కుబడి న్యాయమూర్తి కాలేదు. నిజమైన జడ్జిగా కొంతమందిని జైలుకు పంపారు. చాలా మంది మంది అండర్ ట్రయల్ ఖైదీలకు బెయిల్ ఇచ్చారు. అతని న్యాయ పట్టా అతనికి ‘నేర్చుకున్న’ న్యాయమూర్తిగా మారడానికి సహాయపడింది.
-తర్వాత వృత్తులు మారుతూ..
అయితే జడ్జి పోస్టులో ఎంతో కాలం కొనసాగలేనని తెలుసుకున్న మిట్టల్ తర్వాత వృత్తులను మార్చాడు. జీవితంలో కొత్త విషయాలు నేర్చుకున్నాడు. తర్వాత హర్యానా రవాణా విభాగంలో క్లర్క్ అయ్యాడు, అక్కడ అతను నకిలీ లైసెన్సులను పొందడంలో ప్రజలకు సహాయం చేశాడు. తర్వాత గ్రాఫాలజీలో కోర్సును అభ్యసించడానికి కోల్‌కతా వెళ్లాడు. కానీ మిట్టల్‌ను కార్లు, కోర్టులు సహా ఏ జాబ్ ఉత్తేజపరచలేదు. దీంతో అతను రోహ్‌తక్‌కు తిరిగి వచ్చి, మళ్లీ న్యాయవాద వృత్తిని ప్రారంభించాడు. ఖాళీ సమయంలో అతను తన ఇతర అభిరుచిని తీర్చుకునేవాడు.
-కార్ల చోరీ..
ఇదిలా ఉంటే.. మిట్టల్ 1960 నుంచి 2000 వరకు హర్యానా, చండీగర్, పంజాబ్, రాజస్థాన్‌లలో 150కిపైగా కార్లు చోరీ చేశాడు. మోసం, వంచన వంటి 1000 నేరాలకు పాల్పడ్డాడు. తర్వాత ఆలస్యంగా ఈ విషయాన్ని పోలీసులు గుర్తించారు.
-వయోభారంతో..
ఇక మిట్టల్ వయోభారంతో నేరాలు తగ్గించాడు. 2014–15 తర్వాత అతని క్రైం రేటు తగ్గింది. పశ్చిమ ఢిల్లీలోని పంజాబీ బాగ్‌లో ఒక కారు దొంగతనం చేశాడు. 2016లో 77 సంవత్సరాల వయస్సులో అతను తన రోజువారీ ప్రయాణానికి రాణి బాగ్‌లో ఒక కారును దొంగిలించినందుకు యత్నించి అరెస్టయ్యాడు. ఇది అతని 95వ అరెస్టు.
– వృద్ధాప్యం సాకుతో..
ఇక మిట్టల్ జైల్లో పడిన ప్రతీసారి అతని వృద్ధాప్యం అతనికి సాయం చేసింది. కటకటాల వెనక్కి నెట్టిన ప్రతిసారీ, అతను ఎక్కువసేపు ఉండవలసిన అవసరం లేదు. గత సంవత్సరం చండీగఢ్ కేసు అతన్ని కొంతకాలం జైలులో ఉంచారు.. విడుదలైన తర్వాత, ప్రస్తుతం దాదాపు 85 ఏళ్ల వయస్సులో పక్షవాతం స్ట్రోక్ వచ్చి గురువారం మరణించారు. మిట్టల్ అంత్యక్రియలను నిగంబోధ్ ఘాట్‌లో నిర్వహించిన తర్వాత శనివారం ఆయన కుమారుడు మాట్లాడుతూ ‘నాన్న మిట్టల్ కు చాలా ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. అతను ఒక సంవత్సరం పాటు అనారోగ్యంతో ఉన్నాడని’ తెలిపారు.
స్వయంగా న్యాయశాస్త్రంలో పట్టభద్రుడైన ధనిరామ్ మిట్టల్ తన నేరపూరిత చర్యలకు ముందు 1968 నుంచి 1974 వరకు నకిలీ పత్రాలను ఉపయోగించి స్టేషన్ మాస్టర్‌గా కూడా పనిచేశాడు. తాజాగా మంగళవారం ఢిల్లీలోని పశ్చిమ విహార్‌లో అరెస్ట్ తర్వాత మిట్టల్ మరోసారి వార్తల్లోకెక్కాడు. షాలీమార్ బాగ్‌లో దొంగతనం చేసిన మారుతీ ఎస్టీమ్ కారును స్క్రాప్ డీలర్‌కు విక్రయిస్తుండగా పోలీసులకు పట్టుబడ్డాడు. మే 4న జైలు నుంచి విడుదలైన తర్వాత అతను చేసిన రెండో కారు దొంగతనం ఇది. ఇంతకంటే ముందు మార్చి నెలలో మిట్టల్‌ను ఒకసారి అరెస్ట్ చేశారు.