Emmanur Women theft Copper Wire : రోడ్డు పక్కనే ఉండి.. బస్తాలలో కనిపిస్తుంటే చెత్త ఏరుకునే మహిళలు అని స్థానికులు భావించారు. పాపం వారికి ఏమిటి ఈ దుస్థితి అంటూ వారిలో వారే చర్చించుకున్నారు. ఆ మహిళలు చెత్త ఏరుకోకుండా అటు ఇటు చూస్తుంటే.. పాపం ఆకలి వేస్తుందేమోనని అనుకున్నారు.. కానీ వారు అనుమానాస్పదంగా కనిపించడంతో.. ఏదో సందేహం వచ్చి వారిని పరీక్షించారు. వారి వద్ద ఉన్న బస్తాలను చూశారు. అంతే ఒక్కసారిగా వారికి ఫ్యూజులు ఎగిరిపోయాయి. దీంతో వెంటనే వారు స్థానికంగా ఉన్న పోలీసులకు సమాచారం అందించారు. ఫలితంగా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ మహిళలను తనిఖీ చేశారు. వారి వద్ద ఉన్న బస్తాలను పరిశీలించారు. దీంతో పోలీసులకు కూడా ఒక్కసారిగా మైండ్ బ్లాంక్ అయిపోయింది.
Also Read :ఈ దొంగ స్టైలే వేరు.. దృశ్యం సినిమా తరహాలో చోరీలు.. చివరికి పోలీసులకు ఎలా చిక్కాడంటే?
ఇటీవల కాలంలో ఎమ్మానూరు ప్రాంతంలో రైతుల మోటార్ల నుంచి కాపర్ వైరు చోరీకి గురవుతోంది. ట్రాన్స్ ఫార్మర్లలో కూడా కాపర్ వైరు చోరీకి గురవుతోంది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం వేసవి కాలం కావడంతో రైతులు పొలాల వద్దకు వెళ్లడం లేదు. అయితే ఇదే అదునుగా ఆ మహిళలు చోరీలకు పాల్పడుతున్నారు. రాత్రిపూట విద్యుత్ మోటార్ల నుంచి కాపర్ వైర్ చోరీ చేస్తున్నారు. ట్రాన్స్ ఫార్మర్లలో కూడా కాపర్ వైరును దొంగిలిస్తున్నారు. ఇలా దొంగిలించిన కాపర్ వైర్ ఇతర ప్రాంతాలలో విక్రయిస్తున్నారు. ప్రస్తుత బహిరంగ మార్కెట్లో కాపర్ వైర్ కు విపరీతమైన డిమాండ్ ఉంది. కిలో వేలల్లో పలుకుతోంది. అందువల్లే ఈ మహిళలు దొంగల అవతారం ఎత్తారు. ట్రాన్స్ ఫార్మర్ లలో కాపర్ వైర్ చోరీ చేసి విక్రయిస్తున్నారు.. తద్వారా వేలకు వేలు సంపాదిస్తున్నారు. అయితే తమ దొంగిలించిన కాపరు వైరు ఒక వ్యాపారికి విక్రయించే క్రమంలో ఎమ్మనూరు వద్ద ఆగారు. అయితే స్థానికులకు అనుమానం వస్తుందని భావించిన ఆ దొంగలు చెత్త ఏరుకునే వారిగా అవతారం ఎత్తారు. తమ వద్ద ఉన్న కాపర్ వైర్ ను బస్తాలలో నిలువ చేశారు. చివరికి గ్రామస్తులకు అనుమానం రావడంతో దొరికిపోయారు.
” గ్రామస్తులు ఫిర్యాదు చేయడంతో మేము సంఘటన స్థలానికి వచ్చాము. అక్కడ మహిళలను చూసి మేం కూడా షాక్ అయ్యాం.. వారి వద్ద భారీగా కాపర్ వైర్ ఉంది. దానిని విక్రయించడానికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు. గ్రామస్తులు ఫిర్యాదు చేయడంతో మేము సంఘటన స్థలానికి వచ్చాము. చివరికి మా పరిశీలనలో వారి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. వారిని అదుపులోకి తీసుకొని కాపర్ వైర్ స్వాధీనం చేసుకున్నామని” పోలీసులు చెబుతున్నారు. స్వాధీనం చేసుకున్న కాపర్ వైర్ విలువ లక్షలలో ఉంటుందని తెలుస్తోంది. పోలీసులు వారిని రిమాండ్ కు తరలించారు.