Mobile Frauds: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉంటుంది. విద్యార్థుల నుంచి బడా వ్యాపారుల వరకు ఏదో రకంగా ఫోన్ ను వాడుతూనే ఉన్నారు. కొందరు మొబైల్ ద్వారా స్నేహితులతో మాట్లాడుతారు..మరికొందరు కుటుంబ సభ్యులతో చిట్ చాట్ చేస్తారు. ఇంకొందరు పర్సనల్ మెసేజ్ చేస్తూ ఉంటారు. ఫోన్ లో పర్సనల్ విషయాలు ఏన్నో ఉంటాయి. అవి ఇతరుల కంట పడకుండా జాగ్రత్త పడుతాం. కానీ ఒక్కోసారి అనుకోకుండానే సీక్రెట్ అన్న విషయాలు బయటవారికి తెలిసిపోతుంటాయి. అయితే ముందు జాగ్రత్తగా ఉండడం వల్ల ఇలాంటి పొరపాట్లు చేయరు. మొబైల్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నా.. కొందరు అప్డేట్ అవుతూ హ్యాక్ చేస్తున్నారు. హ్యాక్ కు గురి కాకుండా ఉన్న సమయంలో ఏదో రకంగా మొబైల్ ను తీసుకొని చెక్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఇది బయటి వాళ్లు చేయకపోయినా.. దగ్గరి వాళ్లు ఇలా మొబైల్ తీసుకొని చేయొచ్చు. అందువల్ల ఇతరులకు మొబైల్ ఇచ్చే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కార్యాలయానికి, కుటుంబానికి సంబంధించిన విషయాలతో పాటు మనీ ట్రాన్స్ ఫర్ కు సంబంధించిన రహస్యాలు బయటి వారికి తెలిసిపోతాయి. ఇలా తెలుసుకున్న వారు ఆ సమయంలో కాకుండా తరువాతనైనా ఫోన్ కు సమస్యలు తెచ్చే ప్రమాదం ఉంది. అందువల్ల ఫోన్ ఇతరులకు ఇచ్చే ముందు అలర్ట్ గా ఉండాలి. అయితే ఒక్కోసారి ఆదమరిచి ఉండి అలర్ట్ గా లేకపోతే ఎలా? అనే ప్రశ్న రావొచ్చు. అయితే ఇలాంటప్పుడు ఒక చిన్న ట్రిక్ ద్వారా మీ ఫోన్ ను ఇతరులు ఎలాంటి యాప్స్ ఓపెన్ చేశారో? అనేది దెతులుసుకోవచ్చు.. అదెలాగంటే?
నేటి కాలంలో మొబైల్ ద్వారా ఎన్నో మోసాలు జరుగుతున్నాయి. ఎందుకంటే సర్వ సమాచారం అంతా మొబైల్ లోనే నిక్షిప్తమై ఉంటుంది. ఇంటికి సంబంధించిన పేపర్స్ నుంచి బ్యాంకు బ్యాలెన్స్ వరకు ఫోన్ లోనే సమాచారం ఉంటుంది. అందుకే చాలా మంది ఫోన్ ను హ్యాక్ చేసి డీటేయిల్స్ తెలుసుకోవాలని అనుకుంటారు. కొందరు ఆన్ లైన్ ద్వారా మోసం చేస్తుండగా కొందరు మన పక్కనే ఉండి మనకు సంబంధించిన సమాచారాన్ని దోచుకుంటున్నారు. ఎంత దగ్గరి వ్యక్తి అయినా కొన్ని పర్సనల్ విషయాలు ఇతరులకు చెప్పకుండా ఉండడమే మంచిది. అయితే కొందరు ఫోన్ ను సరదాగా తీసుకొని అయినా అసలు విషయలు తెలుసునే అవకాశం ఉంది.
ఇలాంటి సందర్భంగా ఓ చిన్న ట్రిక్ ద్వారా మొబైల్ న లాస్ట్ మినట్ లో ఎలాంటి యాప్స్ ఓపెన్ చేశారో? ఎంత చేపు చూశారో తెలుసుకోవచ్చు. అందుకోసం డయల్ ప్యాడ్ ఓపెన్ చేసి ##4636## అని లేదా ##4638## అని డయల్ చేయాలి. అప్పుడు ఒక మెసేజ్ వస్తుంది. అప్పుడు మూడు మెసేజ్ లు వస్తాయి. వీటిలో మధ్యలోనిది Usage Statistics పై క్లిక్ చేయాలి. అప్పుడు లాస్ట్ టైం అనే మెసేజ్ పై క్లిక్ చేయగా ఎలాంటి యాప్ ఎప్పుడు? ఎంత సమమంలో యూజ్ చేశారో తెలిసిపోతుంది. దీంతో ఎదుటివారు ఎలాంటి యాప్స్ ఓపెన్ చేశారో తెలుసుకొని వారికి ఇంకోసారి మొబైల్ ఇవ్వడానికి నిరాకరించాలి.
ఇప్పటి నుంచి ఎవరు మొబైల్ తీసుకున్నా.. వారు ఎలాంటి యాప్స్ ఓపెన్ చేస్తున్నారో? ఎందుకు ఓపెన్ చేస్తున్నారో? ముందే తెలుసుకొని జాగ్రత్తగా ఉండాలి. అయితే తెలియని వాళ్లు ఎవరైనా మొబైల్ తీసుకున్నా వారిపై చర్యలు తీసుకునేందుకు ఈ మెసేజ్ ఉపయోగడపుతుంది. మొబైల్ ను దగ్గరి వారికి ఇచ్చినా వారు ఎలాంటి యాప్స్ ఓపెన్ చేశారో ఈ మెసేజ్ ద్వారా తెలుసుకోవచ్చు.
Chai Muchhata is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
Read More