Delhi missing girl : ఆ అమ్మాయిది త్రిపుర. ఉన్నత విద్యను అభ్యసించడానికి ఢిల్లీ వచ్చింది. ఢిల్లీలోని ఓ ఫేమస్ కాలేజీలో చదువుతోంది. ఈ క్రమంలో ఏడవ తేదీన తన ఫ్రెండ్ ను మీట్ అవడానికి వెళ్ళింది. ఆ తర్వాత ఆ యువతి కనిపించకుండా పోయింది. పోలీసులు ఎంతగా ట్రై చేస్తున్నా ఆ అమ్మాయి జాడ కనిపించడం లేదు. చివరికి ఈ వ్యవహారంలో సీఎంవో(చీఫ్ మినిస్టర్ ఆఫీస్) అధికారులు ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది.
ఐదు రోజులుగా ఆ యువతి కనిపించకుండా పోవడం కన్న తల్లిదండ్రులకు శోకాన్ని తెప్పిస్తోంది . ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తోంది. ట్రేస్ చేద్దామంటే సిగ్నల్ మ్యాచ్ అవ్వడం లేదు. దీంతో ఆ అమ్మాయి జాడ వెతకడం ఢిల్లీ పోలీసులకు తలనొప్పి వ్యవహారంగా మారింది.. ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలో దక్షిణ త్రిపుర జిల్లాలోని సబ్ రూమ్ ప్రాంతానికి చెందిన 19 సంవత్సరాల యువతీ చదువుకోవడానికి ఢిల్లీ వచ్చింది. ఢిల్లీలో కనిపించకుండా పోయింది. ఆమె ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని ఆత్మ రామ సనాతన ధర్మ కాలేజీలో చదువుకుంటున్నది. ఈనెల 7వ తేదీన ఆ యువతి తన కుటుంబంతో చివరి కాల్ మాట్లాడింది. ఇక అప్పటినుంచి ఆమె కనిపించకుండా పోయింది. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తోంది.. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఘటన త్రిపుర వ్యాప్తంగా చర్చ నీయాంశంగా మారింది. చివరికి ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు రంగంలోకి దిగారు. ఆమె ఆచూకీ లభించేలా చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీసులను కోరారు..
ఆ యువతి కొంతకాలంగా ఓ యువకుడి ప్రేమలో ఉన్నట్టు తెలుస్తోంది. అతడితో కలిసి ఢిల్లీలోని రోహిల్లా రైల్వే స్టేషన్ వెళ్లింది. ఆ స్టేషన్ వెళ్తున్నట్టు ఈనెల ఏడో తేదీన తల్లికి ఫోన్ ద్వారా సమాచారం అందించింది. ఉదయం 6 గంటలకే ఈ విషయాన్ని ఆ యువతి తన తల్లికి చెప్పింది. మరో రెండు గంటల 45 నిమిషాల వ్యవధిలో తల్లి ఫోన్ చేయగా యువతి ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. ఇక అప్పటినుంచి ఆ యువతి ఫోన్ ఆన్ కాలేదు. ఆమె నుంచి ఎటువంటి ఫోన్ కుటుంబ సభ్యులకు రాలేదు. దీంతో ఆ యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు రంగంలోకి దిగి ఆధారాలు సేకరించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా ఓ క్యాబ్ డ్రైవర్ ను ప్రశ్నించారు.. అతడు చెప్పిన వివరాలు పోలీసులకు ఈ కేసులో కీలక పురోగతి సాధించేలాగా అనిపించాయి. ఆ యువతిని క్యాబ్ డ్రైవర్ ఢిల్లీ సిగ్నేచర్ వంతెన సమీపంలో దింపాడు. సిగ్నేచర్ వంతెన ఉన్న ప్రాంతంలో భద్రత అంతగా ఉండదు. అక్కడ సిసి కెమెరాలు ఎక్కువ ఉండవు. సీసీ కెమెరాలు లేకపోవడంతో ఈ కేసు పోలీసులకు సవాల్ గా మారింది. ఆ ప్రాంతంలో ప్రతి ప్రదేశాన్ని పోలీసులు జల్లెడ పడుతున్నప్పటికీ ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదు. ఆమె ఉంటున్న హాస్టల్లో ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదు. గతంలో ఆ యువతి తన ఖర్చులకోసం కుటుంబ సభ్యుల వద్ద నుంచి డబ్బులు అడిగి తీసుకునేది. కొద్దిరోజులుగా ఆమె డబ్బులు కూడా అడగడం లేదు.. అయితే ఆ యువతి ఎటు వెళ్ళింది? మరోవైపు ఆమె కలవడానికి వెళ్ళిన యువకుడి జాడ కూడా తెలియడం లేదు. అతడి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అని వస్తోంది. దీంతో ఈ కేసు సంక్లిష్టంగా మారింది.
” ఆ యువతి జాడ కోసం ఎంతగానో ప్రయత్నిస్తున్నాం.. ఎక్కడ ఉందో తెలియడం లేదు. ఫోన్ సిగ్నల్స్ కూడా ట్రేస్ కావడం లేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తోంది.. ఆమె స్నేహితుడి జాడ కూడా తెలియడం లేదు. అతడు ఎక్కడ ఉన్నాడో అర్థం కావడం లేదు. ప్రస్తుతం వారి కోసం వెతుకుతున్నాం. వారు వెళ్లిన మార్గంలో సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నామని” ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు.