Mancherial: ఆమె పేరు లావణ్య. స్వస్థలం ఉమ్మడి కరీంనగర్ జిల్లా. ఎన్నో కలలతో.. మరెన్నో ఆశలతో ఆ అమ్మాయి వైవాహిక జీవితంలో అడుగు పెట్టింది. లావణ్యను రామకృష్ణాపూర్ పట్టణంలోని భగత్ సింగ్ నగర్ ప్రాంతానికి చెందిన సింగరేణి కార్మికుడు ముద్దసాని సురేష్ కి ఇచ్చి వివాహం చేశారు.. 2021 లో లావణ్య, సురేష్ వివాహం జరిగింది..కొత్త జీవితంపై ఎన్నో అంచనాలను పెంచుకుంది.. అవన్నీ కూడా నిజమవుతాయని.. కట్టుకున్న భర్త తనమీద బోలెడంత ప్రేమ చూపిస్తాడని భావించింది. కానీ అవేవీ నెరవేరలేదు. పైగా భర్త నుంచి వేధింపులు.. అత్తింటి వారి నుంచి ఇబ్బందులు.. మొదట్లో ఇవన్నీ సర్వసాధారణమని లావణ్య భావించింది. కాలక్రమంలో ఆమెకు ఇవన్నీ మరింత భారంగా అనిపించాయి. దీంతో తట్టుకోలేక తల్లిగారింటికి వెళ్లిపోయింది.
Also Read: కింగ్ డమ్ ఫస్ట్ రివ్యూ… విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కాలర్ ఎగరేయొచ్చా?
తల్లిగారి ఇంటిదగ్గర ఉంటూ.. లావణ్య తనకు నచ్చిన పనులు చేసుకుంటున్నది.. అనేక సందర్భాల్లో కూతురుని అత్తగారింటికి పంపించడానికి ఆమె తల్లిదండ్రులు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీలు నిర్వహించినప్పటికీ అల్లుడు మనసు కరగలేదు. దీంతో ఆమె మరింత దిగులుతో పుట్టింటి దగ్గరే ఉండిపోయింది. ఇలా రోజులు గడుస్తున్నా భార్య మీద అతనికి ప్రేమ కలగలేదు. కనీసం ఆమెను చూసేందుకు అత్తింటి వారింటికి కూడా రాలేదు. ఇదే క్రమంలో ఈ నెల 16న తన తండ్రి గాండ్ల సత్యం (సింగరేణి కార్మికుడు) తో కలిసి పెద్దపల్లి జిల్లాలోని అప్పన్నపేటకు వెళ్ళింది. తిరుగు ప్రయాణంలో అప్పన్న పేట స్టేజి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో లావణ్య తీవ్రంగా గాయపడగా, తండ్రి దుర్మరణం చెందాడు. తీవ్రంగా గాయపడిన లావణ్య కుటుంబ సభ్యులు ఆసుపత్రి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం ఆమె దుర్మరణం చెందింది. దీంతో లావణ్య మృతదేహాన్ని ఆమె కుటుంబ సభ్యులు నేరుగా సురేష్ ఇంటికి తీసుకువచ్చారు.
లావణ్య ను ముఖ్య సమయంలో సురేష్ కు భారీగానే కట్నం ముట్ట చెప్పారు. ఈ నేపథ్యంలో తాము ఇచ్చిన కట్నం రెట్టింపు ఇవ్వాలని.. తమ కూతురుని అన్యాయంగా తమ ఇంటికి పంపించాడని.. ఆమెను తమ ఇంటికి పంపించకపోతే బతికేదని కుటుంబ సభ్యులు అంటున్నారు. దీని అంతటికీ కారణం సురేష్ అని.. అతనిపై చర్యలు తీసుకోవాలని ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు అక్కడికి వచ్చి గొడవలు జరగకుండా లావణ్య మృతదేహాన్ని ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ పోస్టుమార్టం నిర్వహించారు. ఆ తర్వాత అంత్యక్రియలు నిర్వహించడానికి లావణ్య కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. తాము ఇచ్చిన వరకట్నం తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో లావణ్య మృతదేహం రెండు రోజులుగా అంబులెన్స్ లోనే ఉంది. పోలీసులు రంగ ప్రవేశం చేసి.. ఇరు వర్గాలతో మాట్లాడి.. ఒక అంగీకారానికి వచ్చిన తర్వాత లావణ్య మృతదేహాన్ని పెద్దపల్లి జిల్లా ఓదెల గ్రామానికి పంపించారు.. అనంతరం అక్కడ అంత్యక్రియలు నిర్వహించారు.
లావణ్య తల్లిదండ్రులు కాస్త స్థితివంతమైన వారే. సురేష్ సింగరేణి సంస్థలో కార్మికుడిగా పని చేస్తున్న నేపథ్యంలో అతడికి ఇచ్చి వివాహం చేశారు. వివాహ సమయంలో దాదాపు 50 లక్షల వరకు స్థిర, చర ఆస్తులు అతనికి సమర్పించారు. బంగారం కూడా పెట్టారు. లావణ్య చూడ్డానికి అందంగా ఉంటుంది.. దీంతో మొదటి నుంచి సురేష్ ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. భర్త పెట్టే ఇబ్బందులను తట్టుకున్న ఆమె.. ఆ తర్వాత ఓర్చుకోలేకపోయింది. తల్లిగారింటికి వెళ్లిపోయింది. చివరికి రోడ్డు ప్రమాదానికి గురై దుర్మరణం పాలయింది.