Nicholas Paul Grubb : అమెరికాలోని పెన్సిల్వేనియాలో ఆల్బాని టౌన్ షిల్ పర్వతాలున్నాయి. వీటిని అధిరోహించేందుకు 1977లో కొందరు ఔత్సాహికులు అక్కడికి వెళ్లారు. ఈ క్రమంలో వారు పినాకిల్ సమీపంలో శిఖరం పైకి వెళ్లారు. వారికి అక్కడ ఊహించని సన్నివేశం ఎదురైంది. అక్కడ ఒక గుహలోపల పూర్తిగా గడ్డకట్టుకుపోయిన స్థితిలో ఒక వ్యక్తి మృతదేహం కనిపించింది. దీంతో వారు ఒక్కసారిగా భయపడ్డారు. ఆ తర్వాత ఈ విషయాన్ని స్థానికంగా ఉన్న పోలీసులకు చెప్పారు. వారు చెప్పిన వివరాల ఆధారంగా పోలీసులు ఆ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పూర్తిగా గడ్డకట్టుకుపోయిన ఆ వ్యక్తి మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి దేహం పై ఎటువంటి గాయాలైన ఆనవాళ్లు కనిపించలేదు. ఆ పరిసర ప్రాంతాల్లో ఇటువంటి అనుమానాస్పద వస్తువులు కూడా లభ్యం కాలేదు. ఆ మృతదేహానికి పోలీసులు పోస్టుమార్టం నిర్వహించగా.. అధికంగా మత్తు పదార్థాలు తీసుకోవడం వల్లే చనిపోయాడని తెలిసింది. అయితే మృతుడు వేసుకున్న దుస్తులు, అతని వద్ద ఉన్న వస్తువులను పోలీసులు పరిశీలించినప్పటికీ.. అతడు ఎవరనేది తెలియ రాలేదు. ఈ విషయం మిస్టరీగా మారడంతో.. పోలీసులు ఆ వ్యక్తికి పినాకిల్ మ్యాన్ అనే పేరు పెట్టారు.
ఇన్ని రోజుల తర్వాత ..
ఈ ఘటన వెలుగులోకి వచ్చి దశాబ్దాలు గడుస్తున్నప్పటికీ చనిపోయిన వ్యక్తి ఎవరనేది తెలియ రాలేదు. ఫోరెన్సిక్ సైన్స్ లో చోటు చేసుకున్న పురోగతి వల్ల పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేసేందుకు నిర్ణయించారు. డీఎన్ఏ నమునాలు సేకరించి వాటిని పరిశీలించారు. గతంలో తప్పి పోయిన వారి జాబితా(NamUs)ను పోల్చి చూశారు. అయినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది..ఈ క్రమంలో ఒక చిన్న క్లూ వారికి లభించింది. అప్పట్లో శవపరీక్ష చేస్తున్నప్పుడు మృతుడి దగ్గర నుంచి ఫింగర్ ఫ్రింట్ కార్డును గుర్తించారు. Nam Us కు పంపించారు.. ఆ ఫింగర్ ప్రింట్ ను ఫొరెన్సిక్ నిపుణులు విశ్లేషించారు. గంటల వ్యవధిలోనే ఆ కేసును ఛేదించారు. చనిపోయిన ఆ వ్యక్తి పేరు నికోలస్ పాల్ గ్రబ్(27) గా గుర్తించారు. అతడిది పోర్ట్ వాషింగ్టన్. ఈ వివరాలను బెర్క్స్ కౌంటీ పోలీసులు మీడియాకు వెల్లడించారు. అంతేకాదు సంవత్సరాలపాటు అతడి కుటుంబ సభ్యులకు ఈ వివరాలు తెలియజేస్తామని వివరించారు. గ్రబ్ కు సంబంధించిన దుస్తులు, వస్తువులను వారి కుటుంబ సభ్యులకు అందజేస్తామని ప్రకటించారు. ” అప్పట్లో ఫోరెన్సిక్ సైన్స్ ఇంతలా అభివృద్ధి చెందలేదు. అందువల్లే అతడి వివరాలు తెలుసుకోలేకపోయాం. ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది. అందువల్లే అతడి గురించి చెప్పగలిగాం. ఏదిఏమైనప్పటికీ ఇన్ని దశాబ్దాల తర్వాత ఆ కేసును చేదించగలిగాం. ఆ వివరాలను మృతుడి కుటుంబ సభ్యులకు చెప్పగలిగామని” పోలీసులు పేర్కొన్నారు.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read More