Bihar Car Accident: సాహసమే శ్వాసగా సాగిపో అని వెనుకటికి ఓ కవి అన్నాడు. ఆ సాహసం చేసటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వెనుకా ముందూ చూసుకుని సాహసం చేయాలి. కానీ, నేటికాలంలో సాహసం చేయాడానికి యువత ఏమాత్రం వెనుకాడటం లేదు. జిందగీ న మిలే దోబారా అంటూ యువత ప్రమాదకర మైన విన్యాసాలు చేస్తోంది. వాటిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది. అలా వచ్చిన ఆర్టిఫిషియల్ హైప్ తో కన్నుమిన్ను కానకుండా వ్యవహరిస్తోంది.
వయసు వేడిలో.. ఉడుకునెత్తురు ఉద్రేకంలో యువత చేస్తున్న పనులు ఆందోళన కలిగిస్తున్నాయి. జరగకూడని ప్రమాదాలు జరిగి.. కన్నవాళ్లకు అంతులేని శోకాన్ని మిగుల్చుతున్నాయి. బిహార్ లో జరిగిన దారుణం నేటికాలంలో యువత వ్యవహరిస్తున్నతీరుకు అద్దం పడుతోంది. పైగా ఈఘటనలో కన్నవాళ్లకు తీరని దు:ఖం మిగిలింది.
బిహార్ రాష్ట్రంలో నలుగురు యువకులు దారుణమైన పనిచేశారు. మితిమీరిన వేగంతో ప్రయాణించి ప్రాణాలు తీసుకున్నారు. కారులో భోజ్ పూరిపాటలుపెట్టుకుని 150 కిలోమీటర్ల వేగంతో కారును నడిపారు. డ్యాన్స్ లు చేస్తూ బీభత్సం కలిగించారు. చివరికి కారు వేగాన్నినియంత్రించడం సాధ్యంకాకపోవడంతో అదుపుతప్పి ఎలక్ట్రిక్ స్తంభాన్ని ఢీకొని నదిలో పడిపోయింది. ఈ దారుణమైన ఘటన దేశవ్యాప్తంగా కలకలం కలిగించింది. ఈ ప్రమాదంలో కుమార్(28), అంకిత్(26), వసంత్(23), సాగర్ మరణించారు. ఈ ఘోర ఘటనకు ముందు వారు చేసిన లైవ్ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా సర్కులేట్ అవుతోంది.
బీహార్ రాష్ట్రంలోని మాదేపూరప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో చనిపోయిన యువకులు ఓ జాతరకు వెళ్లి వస్తున్నారు. అర్థరాత్రి విపరీతమైన వేగంతో కారును నడిపారు. బోజ్ పూరి పాటలు వింటూ సందడిచేశారు. డ్యాన్సులు కూడా వేశారు. విపరీతమైన వేగంతో కారును నడపడంతో స్పీడ్ ఏమాత్రం కంట్రోల్ కాలేదు. దీంతో వారు నడుపుతున్న కారు ఓ నది వంతెన పై నుంచి రెయిలింగ్ ను ఢీ కొట్టి అందులో పడిపోయింది. ఈప్రమాదంలో ముగ్గరు అక్కడికక్కడే చనిపోయారు. ఒకరి ఆచూకీ లభించలేదు. గజ ఈతగాళ్లు గంటల పాటుు శ్రమించిన తర్వాత వారి ఆచూకీ లభించింది.