Ayesha Meera Case: ఉమ్మడి ఆంధ్రప్రదేేశ్ లో సరిగ్గా 18 ఏళ్లక్రితం అయేషా మీరా అనే యువతి హత్యకు గురైంది. అప్పట్లో ఆ సంఘటన సంచలనం కలిగించింది. అయేషా మీరా దారుణమైన స్థితిలో చనిపోయింది. నాడు ఈ ఘటనపై అప్పటి ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఆందోళనలు చేసింది. నాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలోని కీలక నాయకుడి బంధువు ఈ దారుణానికి కారణమని ఆరోపణలు వినిపించాయి.
ముందుగా ఈ కేసులో సత్యంబాబు అనే యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. దాదాపు అతడిని ఎనిమిది సంవత్సరాల పాటు జైలులో ఉంచారు. తీవ్రంగా ఇబ్బంది పెట్టారు. నాడు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న ఓ మీడియా సత్యం బాబు మీద ఇష్టానుసారంగా కథనాలను ప్రచురించింది. ప్రసారం కూడా చేసింది. సత్యంబాబు తరఫు లాయర్ కోర్టులో సమర్థవంతంగా వాదనలు వినిపించడంతో దాదాపు 8 సంవత్సరాల తర్వాత సత్యం బాబు నిర్దోషిగా బయటికి వచ్చాడు.
2007లో ఆయేషా మీరాను హాస్టల్ లో అత్యాచారం చేసి చంపారు. చంపిన తర్వాత గోడ మీద హెచ్ ప్రేమ చిరత అని నిందితుడు రాశాడు. ఇది తప్ప మరో క్లూ పోలీసులు కనపించలేదు. అనంతరం పోలీసులు ఈకేసును విచారించిన తర్వాత సత్యంబాబును దోషిగా తేల్చారు. అతడిని అరెస్ట్ చేసి.. 2017 వరకు జైల్లో ఉంచారు. సత్యంబాబును జైల్లో వేయడం పట్ల పోలీసులపై రకరకాల ఆరోపణలు వచ్చినప్పటికీ ప్రభుత్వాలు పట్టించుకోలేదు.
అయేషా హత్య కేసులో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ నాయకుడి బంధువు పై తీవ్రస్థాయిలో ఆరోపణలు వచ్చాయి. రాజకీయంగా బలమైన వ్యక్తులు కావడంతో ఈకేసును మూసివేశారని తెలుస్తోంది. పోలీసులపై ఒత్తిడి తీసుకురావడంతో ఆయేషా మీరా కేసును మూసి వేసినట్లు తెలుస్తోంది. ఆయేషా తల్లిదండ్రులు 2018లో హై కోర్టును ఆశ్రయించారు. దీంతో ఈకేసును విచారించిన హైకోర్టు కేసును సీబీఐకి అప్పగిస్తూ తీర్పు చెప్పింది.
కేంద్ర దర్యాప్తు సంస్థ దాదాపు 8 ఏళ్ల పాటు కేసును విచారించింది. ఈనేపథ్యంలో ఆయేషా మీరా కేసులో ఇన్ని సంవత్సరాల పాటు విచారణ సాగించినప్పటికీ ఆధారాలు లభించపోవడంతో కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ మూసివేసింది. కీలక నిందితులు ఇప్పటికీ సేఫ్ గానే ఉన్నారు. రాజకీయ అండదండలు ఉండటంతో వారు తప్పించుకున్నారు. ఎటువంటి సపోర్ట్ లేని ఆయేషా ప్రాణాలు కోల్పోవడమే కాదు.. చివరికి న్యాయాన్ని కూడా పొందలేకపోయింది.