Chhattisgarh: ఆమధ్య అమెరికా నుంచి ఒక షిప్ బయలుదేరింది. అది అత్యంత ఆధునికమైనది. సౌకర్యాలు అధునాతన స్థాయిలో ఉంటాయి. వారాలపాటు సముద్రంలో ఆ షిప్ ప్రయాణిస్తూ ఉంటుంది. దీనిలో ప్రయాణించాలంటే కోట్ల రూపాయలు ఖర్చు చేయాలి. వాస్తవానికి అంత ఖర్చు పెడితే అంతకంటే ఖరీదైన ఓడలో ప్రయాణించవచ్చు. కానీ ఆ ఓడలో బట్టలు లేకుండా ఉండొచ్చు. ఇష్టానుసారంగా తిరగవచ్చు. నచ్చినట్టుగా జీవితాన్ని ఆస్వాదించవచ్చు . ఇటువంటి సంస్కృతి విదేశాలలో కొత్త కాదు. కానీ ఈ దరిద్రం ఇప్పుడు మన దేశానికి కూడా పాకింది.
మనదేశంలో ఖరీదైన నగరాలలో వెస్ట్రన్ కల్చర్ ఉన్నప్పటికీ..మరీ ఒంటి మీద నూలు పోగులు లేకుండా దారుణంగా వ్యవహరించే పరిస్థితులు లేవు. నైట్ క్లబ్ లు, పబ్ లలో ఇష్టానుసారమైన సంస్కృతి ఉన్నప్పటికీ.. వాటికి కూడా కొన్ని నియంత్రణలు ఉంటాయి. న్యూఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, కోల్ కతా, చెన్నై, కొచ్చి వాటి నగరాలు ఆధునిక జీవనశైలికి ప్రతిబింబాలుగా ఉంటాయి. ఈ నగరాలను కాదని ఛత్తీస్ గడ్ రాజధాని రాయ్ పూర్ లో దారుణం చోటుచేసుకుంది. ఈ నగరంలోని ఓ బార్ లో ఇటీవల అత్యంత ఘోరమైన సంఘటన జరిగింది. ఇక్కడికి వచ్చిన యువతీ యువకులు ఒంటి మీద నూలు పోగు లేకుండా నృత్యాలు చేశారు. పీకల దాకా మద్యం తాగారు. అక్కడే ఉన్న స్విమ్మింగ్ పూల్ లో పూల్ పార్టీ కూడా చేసుకున్నారు. అక్కడ ఈ తరహా దారుణాలు వరుసగా జరుగుతున్నాయి. ఓ బార్ నిర్వాహకులు ఈ విష సంస్కృతికి తెర లేపారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో అక్కడి ప్రతిపక్ష విద్యార్థి సంఘం నాయకులు ఆందోళనకు దిగారు.. ఇటువంటి విధానం సరికాదంటూ నిరసనలు చేపట్టారు. వాస్తవానికి ఈ సంస్కృతిని అక్కడి యువత ట్రెండ్ అని పిలుస్తున్నారు. ఇందులో పాల్గొన్న వారంతా సంపన్న వర్గాలకు చెందినవారు. యువకులకంటే యువతులే ఇందులో ఎక్కువగా పాల్గొనడం విశేషం. పైగా ఒంటిమీద నూలు పోగు లేకుండా వారు వ్యవహరించిన తీరు అత్యంత దారుణంగా ఉందని స్థానికులు అంటున్నారు. “పెద్దగా శబ్దాలతో పాటలు పెట్టుకుని డాన్సులు వేశారు. పీకల దాకా మద్యం తాగారు. ఏం చేస్తున్నారో వారికి అర్థం కావడం లేదు. ఈ తరహా సంస్కృతి ఇంతవరకు మేము చూడలేదు. వారు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అర్థం కావడం లేదని” స్థానికులు అంటున్నారు.
కొంతమంది రాయిపూర్ ప్రాంతానికి టూరిస్ట్ అప్పియరెన్స్ తీసుకురావడానికి ఇలా చేస్తున్నట్టు చెబుతున్నారు. వాస్తవానికి రాయపూర్ అనేది అద్భుతమైన ప్రాంతం. దీనికి చారిత్రాత్మకమైన నేపథ్యం ఉంది. ఇక్కడి అడవులు కూడా బాగుంటాయి. కానీ ఇవేవీ పర్యాటక అందాలు కావనట్టుగా ఆ బార్ నిర్వాహకులు ఈ సంస్కృతికి తెర లేపారు. భారీగా దండుకుంటూ.. దారుణమైన కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. నగ్న పార్టీలలో యువతీ యువకులు ఇష్టానుసారంగా రెచ్చిపోతున్నారు. అక్కడే పడకలు.. ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేయడంతో ఆ పని కూడా కానిస్తున్నారని తెలుస్తోంది.
छत्तीसगढ़: रायपुर में न्यूड पार्टी और स्ट्रेंजर पूल पार्टी के आयोजन को लेकर सियासी विवाद मचा
◆ NSUI कार्यकर्ताओं ने विरोध प्रदर्शन किया और क्लब मालिक को गिरफ्तार किया गया
◆ सोशल मीडिया पोस्टरों और पार्टी आयोजनों के कारण सियासत और पुलिस कार्रवाई गर्म है#Raipur | Stranger… pic.twitter.com/WmN9XPQIcG
— News24 (@news24tvchannel) September 16, 2025