Amritsar: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత రకరకాల వీడియోలు కనిపిస్తున్నాయి.. అందులో కొన్ని వీడియోలు ఆసక్తికరంగా అనిపిస్తుంటే.. మరికొన్ని వీడియోలు విచిత్రంగా అనిపిస్తుంటాయి. కాకపోతే ఈ వీడియో చాలా డిఫరెంట్. ఈ వీడియోను చూసినవాళ్లు కొంతమంది ఆశ్చర్యపోతుంటే.. కొంతమంది బాధపడకు బ్రో అంటూ ఓదారుస్తున్నారు..
నేటి కాలంలో వివాహాలు ఇన్స్టంట్ వ్యవహారాల లాగా మారిపోయాయి. ప్రేమ, పెద్దలు కుదిర్చిన వివాహాలు చూస్తుండగానే పెటాకులవుతున్నాయి. అందువల్లే కోర్టుల ద్వారా విడాకులు తీసుకుంటున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. కొన్ని సందర్భాలలో వివాహేతర సంబంధాల వ్యవహారాలు కూడా సంచలనం కలిగిస్తున్నాయి. అనైతిక బంధాల వల్ల దారుణాలు కూడా జరుగుతున్నాయి.
మీరు చదివే ఈ కథనంలో ఓ వ్యక్తి కథ మాత్రం పూర్తి డిఫరెంట్. అతని పేరు షోనీ కపూర్. అతడు ఉండేది అమృత్ సర్ ప్రాంతంలో. 15 సంవత్సరాల క్రితం ఇతడికి వివాహం జరిగింది. ఇన్ని సంవత్సరాలపాటు షోనీ వైవాహిక జీవితం సజావుగానే సాగింది. అయితే ఇటీవల తన భార్యను, ఆమె స్నేహితుడితో ఒక హోటల్ లో చూడకూడని స్థితిలో షోని కపూర్ చూశాడు. అంతే ఆ క్షణమే గుండె పగిలిపోయిందని విలపించాడు.. షోని కపూర్ కు పిల్లలు కూడా ఉన్నారు…
కొంతకాలంగా తన భార్య వ్యవహారం అతనికి తేడాగా కనిపించింది. దీంతో ఆమె కదలికలను అతడు నిత్యం పసిగట్టడం మొదలుపెట్టాడు. ఇటీవల తనకు పని ఉందని ఆమె బయటకు వెళ్ళింది. ఆమె ఫోన్ మాట్లాడుతున్న తీరు.. ఇతర వ్యవహారాలు అతనికి అనుమానం కలిగించాయి. దీంతో భార్యను అతడు అనుసరించాడు. అతడు ఊహించినట్టుగానే ఆమె మార్గం పెడ తోవ లాగా అనిపించింది. అంతేకాదు ఆమె తన స్నేహితుడితో హోటల్ రూమ్ లో ఉంది. వారిద్దరూ చూడకూడని స్థితిలో ఉండడంతో ఒక్కసారిగా షోని కపూర్ విలపించాడు. ” ఎంతగానో ప్రేమించాను. ఇన్ని సంవత్సరాలపాటు సంసార బంధాన్ని అద్భుతంగా సాగించాను. కానీ ఆమె ననన్ను మోసం చేసింది. చివరికి జీవితం ఇలా అయిపోయింది” అని షోనీ కపూర్ విలపించడం అందరిని కలచి వేస్తోంది.