Ajmer Horror: ఇది మామూలు ఘోరం కాదు. అంచనాల కందని దారుణం. ఊహల కందని విషాదం. ఈ కథనం రాయాలంటేనే ఇబ్బందిగా ఉంది. జరిగిన విషయం గురించి చెప్పాలంటేనే బాధగా ఉంది. పాపం ఆ చిట్టి తల్లి ఎంత ఇబ్బంది పడిపోయిందో.. కన్నతల్లి ఇలా చేస్తుంటే ఎంత బాధపడిపోయిందో.. నవ మాసాలు మోసిన మాతృమూర్తి ఇంతటి దారుణానికి ఒడి గట్టిన తర్వాత ఏ కూతురైనా ఏం చేస్తుంది.. పాపం ఆ చిట్టితల్లి నిద్రలోనే శాశ్వత నిద్రలోకి జారిపోయింది. నీళ్లను చూస్తే భయపడి పోయిన ఆమె ఆ నీళ్లలోనే సజీవంగా కాలగర్భంలో కలిసిపోయింది.
అది రాజస్థాన్ రాష్ట్రం అజ్మీర్ ప్రాంతం. అక్కడ తన ప్రియుడు అలోకేష్ అనే వ్యక్తి కలిసి ఓ మహిళ నివాసం ఉంటున్నది. ఆమె వయసు 28 సంవత్సరాలు. ఈమెకు గతంలోనే పెళ్లయింది. మొదటి భర్త ద్వారా కూతురు జన్మించింది. ఆ తర్వాత ఆమెకు అ లోకేష్ పరిచయం అయ్యాడు. అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ప్రియుడి మైకంలో నిండా మునిగిపోయిన అంజలి కట్టుకున్న భర్తను వదిలేసింది. తన కూతురితో అజ్మీర్ దాకా వచ్చేసింది. ప్రియుడితో సంసారం మొదలు పెట్టింది. అంతకుముందే ఆ లోకేష్ తో వివాహేతర సంబంధం ఉండడం.. అతడి మాయలో పూర్తిగా మునిగిపోయిన అంజలి లోకాన్ని మర్చిపోయింది. కొన్ని సందర్భాలలో కన్న కూతురిని కూడా దూరం పెట్టింది. మూడు సంవత్సరాల వయసు ఉన్న కుమార్తెను దూరంగా పడుకోబెట్టి ప్రియుడి సాంగత్యంలో మునిగి తేలేది. శారీరక సుఖం కోసం కొన్ని సందర్భాలలో కుమార్తెను ఓ గదిలో వేసి తాళం పెట్టేది.
తన ప్రియురాలి కుమార్తె అంటే అ లోకేష్ కు విపరీతమైన కోపం ఉండేది. ఆమెను ప్రతి సందర్భంలో దూరం పెట్టేవాడు. తిట్టేవాడు. కొన్ని సందర్భాల్లో కొట్టేవాడు. ఆమె మన ఇద్దరి మధ్య ఉండకూడదని ప్రియురాలిని తరచూ వేధించడం మొదలుపెట్టేవాడు. ఆమె అడ్డు ఉండకూడదని కోప్పడేవాడు. దీంతో ఎలాగైనా సరే తన బిడ్డను అడ్డు తొలగించుకోవాలని భావించిన ఆ తల్లి.. ఆరోజు రాత్రి నిద్రపుచ్చింది. నిద్రలో ఉన్న పాపను సమీపంలో ఉన్న ఓ సరస్సులో పడేసింది. లోతుగా ఉన్న ప్రాంతంలో పడేయడంతో ఆ పాప నీట మునిగి చనిపోయింది. పాప కనిపించకపోవడంతో ఈ విషయాన్ని స్థానికులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టి అసలు విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. ఆ లోకేష్, అతని ప్రియురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన అక్రమ సంబంధాలు పేగుబంధాలను సైతం చిదిమేస్తాయని నిరూపించింది. ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా ఈ తరహా సంఘటనలు పెరిగిపోతున్నాయి. పోలీసులు, కోర్టులు కఠిన శిక్షలు విధిస్తున్నప్పటికీ మనుషుల్లో మార్పు రాకపోవడం బాధాకరం.
Ajmer Horror
Anjali, living with her landlord-turned-partner Alokesh, was constantly taunted about her 3-year-old daughter.
One night, she put the child to sleep… then carried her to Ana Sagar Lake.
CCTV shows the mother drowning her own baby.Love, lies & taunts ended in… pic.twitter.com/w2yh5zUrBs
— Mayank Burmee (@BurmeeM) September 18, 2025