Affairs Destroying Lives: అనేక ఘోరాలు జరుగుతున్నాయి. కనివిని ఎరుగనిస్థాయిలో అనర్ధాలు చోటుచేసుకుంటున్నాయి. అయినప్పటికీ చాలామంది చాటుసంబంధాలను వదులుకోవడం లేదు. భర్తకు తెలియకుండా భార్య..భార్యకు తెలియకుండా భర్త వివాహేతర సంబంధాలను నెరుపుతుండడం ఇటీవల కాలంలో ఎక్కువైపోయింది. ఈ బంధాల వల్ల ప్రాణాలు పోతున్నాయి. జరగకూడని దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఘటనలలో నిందితులు కఠిన శిక్షలు ఎదుర్కొంటున్నప్పటికీ.. సమాజం నుంచి చీత్కరింపులు చవి చూస్తున్నప్పటికీ.. పరిస్థితి ఏ మాత్రం మారడం లేదు.
Also Read: ఏం టేస్ట్ రా బై.. పురుగుల మందు ఈఎంఐలో దొరుకుతుందా బ్రో
వివాహేతర సంబంధాలు ఎంతటి దారుణాలకు కారణమవుతాయో ఇటీవల కాలంలో జరిగిన సంఘటనలు నిరూపించాయి. ఈ దారుణాలు అంతకంతకు పెరిగిపోతున్న తీరు సమాజంలో పెడ పోకడలకు అద్దం పడుతోంది. తాజాగా మధ్యప్రదేశ్లో వివాహేతర సంబంధం వల్ల ఏకంగా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. దీనంతటికీ కారణం ఒక మహిళ చేసిన తప్పు. ఆ మహిళ పేరు ద్రౌపది.. ఈమె భర్త పేరు మనోహర్. మనోహర్ తన భార్య ద్రౌపది, తల్లి పూల్ రాణి, కుమార్తె శివాని, కుమారుడు రాహుల్ తో కలిసి ఉంటున్నాడు. అయితే ద్రౌపది స్థానికంగా ఉన్న ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. పిల్లలు టీనేజ్ వయసుకు వచ్చారని విషయం కూడా మర్చిపోయి.. అతనితో సల్లాపాలలో మునిగి తేలడం మొదలుపెట్టింది. పలుమార్లు ఈ వ్యవహారానికి సంబంధించి పంచాయతీలు జరిగినప్పటికీ ద్రౌపది తన తీరు మార్చుకోలేదు.
Also Read: వివాహేతర సంబంధం.. బెస్ట్ ఫ్రెండ్ ప్రాణం తీశాడు…
ద్రౌపదిని ఇటీవల మనోహర్ తీరు మార్చుకోవాలని సూచించాడు. ఇలాంటి వ్యవహారాలు కొనసాగిస్తే పరువు పోతుందని హెచ్చరించాడు. దానికి ద్రౌపది ఏ మాత్రం ఒప్పుకోకపోగా.. వరకట్నం వేధింపులు కేసు పెడతానని మనోహర్ ను హెచ్చరించింది. దీంతో మనోహర్ భయపడి పోయి.. తన తల్లి పూల్ రాణి, కుమార్తె శివాని, కుమారుడు రాహుల్ కు పురుగుల మందు కలిపిన శీతల పానీయం ఇచ్చాడు. వారందరూ అది తాగి చనిపోయారు. మనోహర్ కూడా విషం కలిపిన శీతల పాణ్యం తాగి బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు. ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ఇక ఈ కేసులో ద్రౌపది, సురేంద్రను మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచి రిమాండ్ కు తరలించారు.