https://oktelugu.com/

Madhya Pradesh: విద్యార్థితో ఉపాధ్యాయురాలి కామకేళి.. చివరికి అది ఎంతకు దారి తీసిందంటే..

మధ్యప్రదేశ్లోని ఇండోర్ నగరంలో ఒక ప్రైవేట్ ఫార్మసీ కాలేజీ ఉంది. ఈ కాలేజీలో గౌరవ్ అనే 19 సంవత్సరాల విద్యార్థి బీఫార్మసీ చదువుతున్నాడు. ఇతడు చదువులో చురుకుగా ఉంటాడు. చూసేందుకు అందంగా ఉంటాడు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : August 9, 2024 / 09:09 PM IST

    Madhya Pradesh

    Follow us on

    Madhya Pradesh: పాఠాలు నేర్పాల్సిన పంతులమ్మ దారితప్పింది. విద్యార్థికి మంచి బుద్ధులు నేర్పాల్సిన టీచరమ్మ వక్రమార్గం పట్టింది. చెడుదారుల్లోకి వెళ్లకుండా సన్మార్గంలో వెళ్లాలని విద్యార్థికి చెప్పాల్సిన ఉపాధ్యాయురాలు తన నీతి మాలిన పని చేసింది. చివరికి సమాజం ముందు తలవంచుకుంది. ఆమె చేసిన పనికి కుటుంబం మొత్తం తల వంపులకు గురైంది. చివరికి ఊరు వదిలి పారిపోయింది. బంధుమిత్రుల ముందు తల ఎత్తుకోలేక.. తన ఫోన్లను స్విచ్ ఆఫ్ చేసుకుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ నగరంలో జరిగిన ఈ సంచలన సంఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అటు జాతీయ మీడియా, ఇటు సోషల్ మీడియాలో ఈ సంఘటన తెగ షేక్ చేస్తోంది.

    మధ్యప్రదేశ్లోని ఇండోర్ నగరంలో ఒక ప్రైవేట్ ఫార్మసీ కాలేజీ ఉంది. ఈ కాలేజీలో గౌరవ్ అనే 19 సంవత్సరాల విద్యార్థి బీఫార్మసీ చదువుతున్నాడు. ఇతడు చదువులో చురుకుగా ఉంటాడు. చూసేందుకు అందంగా ఉంటాడు. అయితే అతగాడిని చూసి తిట్టే ప్రేమలో పడిపోయింది ఆ కాలేజీలో పనిచేసే ఇంగ్లీష్ టీచర్. అతడిని మాటల్లో పెట్టింది. ఆ తర్వాత వలపు వల విసిరింది. మొదట్లో దానికి అతడు ఒప్పుకోలేదు. ఆ తర్వాత ఒప్పుకోక తప్పలేదు పైగా ఆమె వయసు కూడా 30 సంవత్సరాలలోపు ఉండడంతో గౌరవ్ లొంగిపోవాల్సి వచ్చింది. ఆ ఇంగ్లీష్ టీచర్ పిలిచిన ప్రతిసారి గౌరవ్ ఆమె ఇంటికి వెళ్లేవాడు. ఆమె ఇంట్లో ఎవరూ లేని సమయంలో అతడిని పిలిపించుకునేది. ఆ తర్వాత తెల్లార్లు ఇద్దరూ స్వర్గ సుఖాలను పొందేవారు. ఇలా చాలా కాలం పాటు సాగింది. ఆ తర్వాత ఆ ఇంగ్లీష్ టీచర్ ఆమెలో ఉన్న మరో రూపాన్ని చూపించడం మొదలుపెట్టింది. వారిద్దరూ ఏకాంతంగా ఉన్నప్పుడు వీడియోలు తీసి అతడిని బెదిరించేది. ఇలా ఆమె బెదిరించినప్పుడల్లా అతడు డబ్బులు ఇచ్చేవాడు. ఇలా నిత్యం ఆమెకు అవసరం ఉన్నప్పుడల్లా డబ్బులు డిమాండ్ చేసేది. అతడు స్నేహితుల వద్ద అప్పులు తెచ్చి ఆమెకు డబ్బులు ఇచ్చేవాడు. అయితే ఇటీవల ఆమె వేధింపులు తారాస్థాయికి చేరుకున్నాయి. దీనికి తోడు ఆమె డబ్బులు ఎక్కువగా అడగడంతో అతడు ఇచ్చుకోలేకపోయాడు. అంత డబ్బు తాను ఇవ్వలేనట్టు చేతులెత్తేశాడు. దీంతో ఆమె అతనిపై ఇండోర్ లోని ఒక పోలీస్ స్టేషన్లో మానభంగం కేసు పెట్టింది.

    పోలీసులకు ఫిర్యాదు చేసే క్రమంలో ఆమె పలు ఫోటోలను వారికి చూపించింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఆ యువకుడిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆ తర్వాత ఆ యువకుడి తండ్రిని పోలీస్ స్టేషన్ కు పిలిపించారు.. మూడు లక్షలు ఇస్తే కేసు విత్ డ్రా చేసుకుంటానని ఆ ఇంగ్లీష్ టీచర్ ఆ యువకుడి తండ్రికి ఆఫర్ ఇచ్చింది. ఈ క్రమంలో గౌరవ్ తండ్రి 45 వేలకు మాట్లాడి.. అతడిని బయటికి తీసుకొచ్చాడు. ఆ తర్వాత ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడి చర్చకు దారి తీసింది. గౌరవ్ ఇంటికి వెళ్ళిన తర్వాత అవమానభారంతో కృంగిపోయాడు. ఇంట్లో ఉరి వేసుకునే ఆత్మహత్య చేసుకున్నాడు.. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. గౌరవ్ తల్లిదండ్రులు ఇంటికి వచ్చి చూడగా అతడు విగత జీవిగా వేలాడుతూ కనిపించాడు. దీంతో వారు లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

    పోలీసులు ఆ ఇంగ్లీష్ టీచర్ ను అదుపులోకి తీసుకున్నారు. ఆ ఇంగ్లీష్ టీచర్ ను కళాశాల యాజమాన్యం విధుల నుంచి తొలగించినట్లు తెలుస్తోంది. మన వైపు గౌరవ్ ఫోన్ లో ఫోటోలు, వీడియోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతడి బ్యాంక్ లావాదేవీలను కూడా పరిశీలించారు. అయితే ఇంగ్లీష్ టీచర్ తో కేసు విత్ డ్రా చేయించేందుకు కొందరు పోలీసులు గౌరవ్ తండ్రిని డబ్బులు డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. దీనిపై పోలీసు ఉన్నతాధికారులు సిబ్బందిపై ఆగ్రహంగా ఉన్నట్టు సమాచారం. వారిపై విచారణకు కొంతమంది సిబ్బందిని నియమించినట్టు తెలుస్తోంది. మొత్తానికి ఓ ఇంగ్లీష్ టీచర్ – విద్యార్థి వ్యవహారం ఇండోర్ నగరాన్ని వార్తల్లోకి ఎక్కించింది.