Uttarakhand : కోల్ కతా అర్జీ ఆస్పత్రిలో ట్రైయినీ డాక్టర్ పై జరిగిన హత్యాచార ఘటన దేశాన్ని మొత్తం కుదిపేస్తోంది. ఈ కేసును ఏకంగా సిబిఐ విచారిస్తోంది. ఈ దారుణం వెనక అనేక దిగ్భ్రాంతికరమైన వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా గురువారం వైద్యులు శాంతి ప్రదర్శనలు నిర్వహించారు.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ఘటనను మర్చిపోకముందే దేవ భూమి ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రుద్రపూర్ లో మరో దారుణం చోటుచేసుకుంది. సంఘటన జరిగిన తొమ్మిది రోజుల తర్వాత అసలు విషయం వెలుగులోకి రావడం సంచలనాన్ని సృష్టిస్తోంది. ఇంతకీ ఏం జరిగిందంటే..
ప్రైవేట్ ఆస్పత్రిలో..
రుద్రపూర్ ప్రాంతంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో ఓ నర్స్ పనిచేస్తోంది. ఆమె పనిచేసే ప్రైవేట్ హాస్పిటల్ ఇంద్ర చౌక్ లో ఉంది.. ఆమె రుద్రపూర్ సరిహద్దులో ఉన్న ఉత్తరప్రదేశ్లోని బిలాస్ పూర్ ప్రాంతంలో తన 11 సంవత్సరాల కుమార్తెతో కలిసి ఉంటోంది. భర్తతో విడాకులు తీసుకున్నట్టు తెలుస్తోంది. గత నెల 30న ఆమె తన విధులు ముగించుకొని ఈ – రిక్షా లో బిలాస్ పూర్ వెళ్ళింది. ఇదే క్రమంలో ధర్మేంద్ర అనే దినసరి కూలీ ఆమెను అనుసరించాడు. ఆటో ఆమె ఉండే అపార్ట్మెంట్ కు చేరుకుంది. ఆమె అలా దిగిందో లేదో ధర్మేంద్ర వెనుక నుంచి దాడి చేశాడు. ఆమెను సమీపంలో ఉన్న పొదల్లోకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత అత్యాచారం చేశాడు. ఆమె ధరించిన చున్నీతో గొంతుకు బిగించి హత్య చేశాడు. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని ఆ ప్రాంతానికి దాదాపు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న దిబ్ డిబా గ్రామంలో ఓ నిర్మానుష్య ప్రదేశంలో పడేసి వెళ్లిపోయాడు. ఆమె పర్స్ లో ఉన్న మూడువేల నగదు కూడా తస్కరించాడు. ఈ దారుణానికి పాల్పడుతున్న సమయంలో ధర్మేంద్ర తీవ్రమైన మత్తులో ఉన్నాడు.
ఎంతసేపటికి ఇంటికి రాకపోవడంతో..
నర్స్ ఎంతసేపటికి ఇంటికి రాకపోవడంతో ఆమె సోదరి తర్వాతి రోజు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన జరిగిన తొమ్మిది రోజుల తర్వాత ఈనెల 8న పోలీసులు ఆ నర్స్ మృతదేహాన్ని గుర్తించారు. బాధితురాలి ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా నిందితుడిని గుర్తించారు. నిందితుడు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని బరేలి జిల్లా చెందిన వ్యక్తిని పోలీసుల విచారణలో తేలింది. పోలీసులు ప్రస్తుతం ఆ కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని రాజస్థాన్ రాష్ట్రంలో పట్టుకుని అరెస్టు చేశారు.. ధర్మేంద్ర ఉత్తరాఖండ్ ప్రాంతంలోని ఉధమ్ సింగ్ నగర్ లో రోజువారి కూలిగా పనిచేసేవాడు. అత్యాచారం చేసిన తర్వాత ఆమె చున్నీ ని గొంతుకు బిగించి హత్య చేశాడు.. ఆ తర్వాత గొంతు కోశాడు.. ఆమె ధరించిన నగలను, ఇతర వస్తువులు దొంగిలించి పారిపోయాడు.”నిందితుడు మాదకద్రవ్యాలకు బానిస అయ్యాడు. అంతకుముందు కొద్ది రోజుల క్రితం ఆ నర్స్ ఒంటరిగా వెళ్లడం అతడు చూశాడు. ఆ తర్వాత ఘటన జరిగిన రోజు ఆమెను ఆటోలో ప్రయాణించడం చూశాడు. ఆ తర్వాత ఆటో దిగడమే ఆలస్యం ఆమెను ఒక్కసారిగా అడ్డగించాడు. పొదల్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడని” పోలీసులు పేర్కొన్నారు.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: A daily laborer named dharmendra killed a nurse working in a private hospital in rudrapur area
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com