Homeకరోనా వైరస్Omicron: ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం పిల్లలపై ఎంతంటే? 

Omicron: ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం పిల్లలపై ఎంతంటే? 

Omicron: కొవిడ్ ఒమిక్రాన్ వేరియంట్ ప్రస్తుతం భారత్‌తో పాటు ప్రపంచాన్ని వణికిస్తోంది. రోజురోజుకూ కేసులు బాగా పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలోనే వైరస్ వ్యాప్తి కట్టడికి భారత్‌లోని పలు రాష్ట్రాల ప్రభుత్వాలు నైట్ కర్ఫ్యూలు విధించడంతో పాటు వీకెండ్ లాక్ డౌన్లు పెడుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ థర్డ్ వేవ్‌లో ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం పిల్లపైన ఏ మేరకు పడుతుంది? ఈ విషయమై నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం.
దేశరాజధాని ఢిల్లీ ఎయిమ్స్ ఈ విషయమై సెమినార్ నిర్వహించారు. వైద్యులు, పలువురు ప్రముఖులు ఇందులో పాల్గొని థర్డ్ వేవ్ లో పిల్లలపై ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం గురించి పలు విషయాలను తెలిపారు. ఒమిక్రాన్ వేరియంట్ చాలా వేగంగ వ్యాప్తి చెందడం వలన అది పిల్లలకూ వస్తున్నదని వివరించారు వైద్యులు. అయితే, చాలా మంది ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటించడం లేదని, అందు వల్లే వ్యాప్తి ఇంకా ఎక్కువవుతున్నదని పేర్కొంటున్నారు. ఇకపోతే ఇప్పటి వరకు అయితే కొవిడ్ మహమ్మారి బారిన పడిన పిల్లల సంఖ్య అయితే అంత గణనీయంగా పెరగలేదని తెలుస్తోందని వివరించారు.
భారతదేశంలో ఇప్పటికయితే పిల్లకు అంత స్థాయిలో ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం చూపలేదు. కానీ, అగ్రరాజ్యం అమెరికాలో చిన్నారులపైన ఈ వేరియంట్ ప్రభావం చూపుతోంది. పలు రుగ్మతలతో బాధపడుతున్నవారు వైరస్ బారిన పడితే కోలుకోవడానికి కొంచెం కష్టమవుతుందని తెలిపారు. డెల్టా కంటే ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి కొంచెం తీవ్రంగా ఉన్నదని అంటున్నారు. అమెరికాలో ఇప్పటికే చాలా మంది చిన్నారుల ఈ వేరియంట్ బారిన పడ్డారని తెలిపారు. ఈ క్రమంలోనే పిల్లలైనా పెద్దలైనా రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోవడంతో పాటు భౌతిక దూరం పాటించాలని, మాస్కు కంపల్సరీగా ధరించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇకపోతే ఇప్పటికే కొన్ని దేశాలు రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారికి బూస్టర్ డోస్ కూడా ఇస్తున్నారు. భారత్‌లోనూ పలు చోట్ల బూస్టర్ డోసు పంపిణీ స్టార్ట్ అయింది. బూస్టర్ డోస్ పంపిణీ ద్వారా హ్యూమన్ బాడీలో ఒమిక్రాన్ వేరియంట్‌ను ఎదుర్కొనే ఇమ్యూనిటీ పవర్ వస్తుందని వైద్య నిపుణులు వివరిస్తున్నారు.
Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.
RELATED ARTICLES

Most Popular