
దేశంలో కరోనా వైరస్ కేసులు అంతకంతకూ తగ్గుతున్న సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కావడం లేదు. కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ సైతం కరోనా చికిత్స కొరకు వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ వేగంగా చేపడుతోంది. అయితే కరోనా వైరస్ కు చెక్ పెట్టే మరో డ్రగ్ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. బ్రిటన్ కు చెందిన నాటింగ్‌హామ్ శాస్త్రవేత్తలు థాప్సీగార్గిన్ అనే డ్రగ్ తో కరోనాకు చెక్ పెట్టవచ్చని చెబుతున్నారు.
Also Read: నీళ్లు అనుకుని శానిటైజర్ తాగిన కమిషనర్.. చివరకు..?
కరోనాతో పాటు ఇతర వైరస్ లపై కూడా ఈ మందు సమర్థవంతంగా ప్రభావం చూపుతుందని వెల్లడిస్తున్నారు. ఇంగ్లండ్‌లోని పిర్‌బ్రైట్ ఇన్‌స్టిట్యూట్, చైనాలోని యానిమల్ అండ్ ప్లాంట్ హెల్త్ ఏజెన్సీ కూడా ఈ మందుపై పరిశోధనలు చేస్తున్నాయి. ఇన్‌ఫ్లుయెంజా– ఎ వైరస్, జలుబు, రెస్పిరేటరీ సిన్సీషియల్ వైరస్ లపై కూడా ఈ డ్రగ్ సమర్థవంతంగా పని చేస్తుందని తెలుస్తోంది. ఈ డ్రగ్ ఇంజెక్షన్ తో పాటు టాబ్లెట్ల రూపంలో కూడా లభించనుంది.
Also Read: ప్రైవేట్ మార్కెట్‌లోకి కరోనా వ్యాక్సిన్.. ఎప్పటినుంచంటే..?
థాప్సీగార్గిన్ డ్రగ్ ను తక్కువ మోతాదులో వాడితే మూడు వైరస్ లకు వ్యతిరేకంగా రోగ నిరోధక వ్యవస్థను చైతన్యవంతం చేసే అవకాశాలు ఉంటాయి. కరోనా సోకని వారు ఈ మందు వేసుకుంటే వైరస్ బారిన పడే అవకాశాలు తగ్గుతాయని తెలుస్తోంది. ఇతర యాంటీవైరల్ మందులతో పోల్చి చూస్తే ఈ డ్రగ్ వందల రెట్లు ప్రభావవంతంగా పని చేస్తుందని ఈ డ్రగ్ కు సైడ్ ఎఫెక్ట్స్ తక్కువగా ఉంటాయని తెలుస్తోంది.
మరిన్ని వార్తలు కోసం: కరోనా వైరస్
భవిష్యత్తులో ఇతర వైరస్ లు విజృంభించినా థాప్సీగార్గిన్ ను ఉపయోగించడం వల్ల వైరస్ కు త్వరగా చెక్ పెట్టే అవకాశాలు ఉంటాయని తెలుస్తోంది. ఈ డ్రగ్ కడుపులోని ఆమ్ల గాఢతకు సమానమైన వాతావరణంలో ఉంటుందని తెలుస్తోంది.