https://oktelugu.com/

వైరస్ తో కలిసి జీవించాల్సిందేనా?

  భారత్ లో కరోనా ఎంట్రీతో కేంద్రం దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలు చేస్తున్న సంగతి తెల్సిందే. ప్రస్తుతం మూడోవిడుత లాక్డౌన్ కొనసాగుతోంది. మే 17తో మూడోవిడుత లాక్డౌన్ ముగియనుండగా మరోసారి కొన్ని షరతులతో లాక్డౌన్ కొనసాగిస్తారనే ప్రచారం జరుగుతోంది. తొలివిడుత లాక్డౌన్ ను ఖచ్చితంగా అమలు చేసిన కేంద్రం ఆ తర్వాత రెండోవిడుత లాక్డౌన్ ముగిసే సమయానికి ఆయా రాష్ట్రాలకు కొన్ని సడలింపులిచ్చింది. గ్రీన్, ఆరెంజ్, రెడ్ జోన్ల పేరిట కరోనా ప్రాంతాలను విభజించింది. ఆయా ప్రాంతాల్లో […]

Written By: , Updated On : May 12, 2020 / 02:08 PM IST
Follow us on

 

భారత్ లో కరోనా ఎంట్రీతో కేంద్రం దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలు చేస్తున్న సంగతి తెల్సిందే. ప్రస్తుతం మూడోవిడుత లాక్డౌన్ కొనసాగుతోంది. మే 17తో మూడోవిడుత లాక్డౌన్ ముగియనుండగా మరోసారి కొన్ని షరతులతో లాక్డౌన్ కొనసాగిస్తారనే ప్రచారం జరుగుతోంది. తొలివిడుత లాక్డౌన్ ను ఖచ్చితంగా అమలు చేసిన కేంద్రం ఆ తర్వాత రెండోవిడుత లాక్డౌన్ ముగిసే సమయానికి ఆయా రాష్ట్రాలకు కొన్ని సడలింపులిచ్చింది. గ్రీన్, ఆరెంజ్, రెడ్ జోన్ల పేరిట కరోనా ప్రాంతాలను విభజించింది. ఆయా ప్రాంతాల్లో కొన్ని షరతులతో కార్యకలాపాలకు అనుమతులను ఇచ్చింది. తాజాగా ప్రజలు గుంపులుగా తిరిగే ప్రాంతాలైన రైల్వే, బస్సులు, ట్రాన్స్ పోర్టు, భారీ పరిశ్రమలు, మద్యం షాపులకు షరతులతో కూడిన అనుమతులు ఇస్తుండటంపై కరోనా విషయంలో కేంద్రం చేతులెత్తేసిందా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. వీటన్నింటికి బారులు తెరవడంతో ప్రజలు ఏమేరకు భౌతిక దూరం పాటిస్తారనేది సవాల్ గా మారింది.

ఇటీవల కేంద్రం ప్రభుత్వం రాష్ట్రాలకు మద్యం షాపులు తెరిచేందుకు అనుమతులివ్వడంతో మద్యంప్రియులంతా రోడ్లపై బారులు తీసిన దృశ్యాలు చూశాం. ఒకరిపై ఒకరుపడుతూ మద్యంకోసం కిలోమీటర్ల మేర క్యూలో నిల్చున్నారు. కొన్నిచోట్ల మద్యంప్రియులపై లాఠి చార్జీలు చేయగా మరికొన్ని చోట్ల మొత్తానికి వైన్ షాపులు బంద్ చేసిన ఘటనలు వెలుగుచూశాయి. ఇదే తరుణంలో మద్యంప్రియులను కంట్రోల్ చేస్తామనే సాకుతో రాష్ట్రాల ప్రభుత్వాలు ఇష్టానుసారంగా మద్యం ధరలు పెంచి తాగుబోతుల జేబులకు చెల్లుపెట్టి ఖజనా నింపుకునే ప్రయత్నం చేశాయి. మద్యం ధరలతో మద్యంప్రియులను కంట్రోల్ ఎంతవరకు చేశారో తెలియదు కానీ భౌతికదూరం అనే మాట గాలికొదిలేశారనే స్పష్టం బట్టబయలైంది. ఈనేపథ్యంలోనే మరోసారి కేంద్రం రైళ్లు, విమానాలు, బస్సులను, ఇతర వాహనాలను, పరిశ్రమలకు అనుమతి ఇవ్వడం మరింత ఆందోళనకు గురిచేస్తోంది.

దేశంలో పదుల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు ఉన్న సమయంలో కేంద్రం లాక్డౌన్ విధించింది. కాగా ప్రస్తుతం 70వేలకు చేరువలో ఉంది. ఈ దశలో కేంద్రం లాక్డౌన్లో అన్నిరకాల సడలింపులు ఇస్తుండటంపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే కరోనా వైరస్ కు వ్యాక్సిన్ ఇప్పట్లో వచ్చే పరిస్థితి లేకపోవడంతో దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తుంది కేంద్రం. లాక్డౌన్ విధించిన 50రోజుల్లో కరోనాతో పోరాడేందుకు కావాల్సిన అన్నిరకాల సదుపాయాలను సమకూర్చుకున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు ప్రజలు కరోనా కలిసి జీవించేందుకు సిద్ధమవ్వాలి అన్న సంకేతాలను ఇస్తుంది. ఈ వ్యవహారమంతా ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నెత్తిన పెట్టింది. ప్రజలు రోగనిరోధక శక్తిని పెంచుకునేలా అవగాహన కల్పిస్తుంది. ఇప్పటివరకు కరోనాను కట్టడి చేసిన కేంద్రం సడలింపులను ఇస్తుండటంతో ఏమేరకు వైరస్ వ్యాప్తిని నిరోధిస్తుందనేది ప్రశ్నార్థకంగా మారింది.

ఇప్పటికే ముఖ్యమంత్రిలతో చర్చించిన ప్రధాని మోదీ త్వరలోనే మరోసారి లాక్డౌన్ పొడగింపు, సడలింపులపై క్లారిటీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కరోనా వ్యాప్తి చెందకుండా ఉండాలంటే ప్రతీఒక్కరూ భౌతిక దూరం పాటించడం తప్పనిసరి. అలాంటి ప్రాథమిక సూత్రానికి తూట్లు పొడిచేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తుండటంపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతోన్నాయి. దీనిపై ప్రధాని మోదీ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే..!