Third Wave Begins: ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం పెరుగుతోంది. చాపకింద నీరులా విస్తరిస్తోంది. కరోనా ఉధృతి క్రమంగా ఎక్కువవుతోంది. వారం రోజుల్లోనే నాలుగు రెట్లు పెరిగింది. దీంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటికే మొదటి, రెండో దశల్లో ప్రాణాలు కోల్పోగా ప్రస్తుతం మూడో దశ మొదలైందనే భయం అందరిలో నెలకొంది. పాజిటివిటీ రేటు కూడా భారీగా ఉంటోంది. దీంతో పలు స్టేట్లు ఆంక్షలు విధించేందుకు సిద్ధమవుతున్నాయి. పశ్చిమ బెంగాల్, మహారాష్ర్ట లాంటి స్టేట్లు లాక్ డౌన్ విధించాయి. దీంతో మరిన్ని ప్రాంతాలు కూడా లాక్ డౌన్ విధించే దిశగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
రానున్న రోజుల్లో కొవిడ్ మరింత విస్తృతమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ తో ప్రాణాపాయం లేకపోయినా వ్యాధి తీవ్రత మరింత వేగంగా వ్యాపిస్తోంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. మూడో దశలో మరణాల శాతం సున్నాగా ఉన్నా జాగ్రత్తలు పాటించాల్సిందేనని చెబుతున్నారు. మరోవైపు పండుగల నిర్వహణపై ఆంక్షలు విధించేందుకు సిద్ధమవుతున్నారు. రాష్ర్టంలో కూడా మూడో దశ మొదలైందనే సంకేతాలు ప్రభుత్వం నుంచ వస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ వైరస్ ను జయించాలని చెబుతోంది.
Also Read: దేశంలో తొలి ఒమిక్రాన్ మరణం.. మొదలైన థర్డ్ వేవ్ భయాలు?
ప్రస్తుతం ఒమిక్రాన్ వేరియంట్ దేశంలో వేగవంతంగా ఆక్రమిస్తోంది. బాధితుల్లో లక్షణాలు మాత్రం కనిపించడం లేదు. గతంలో వ్యాధి లక్షణాలు బయటపడటంతో అప్రమత్తమయ్యారు. కానీ ప్రస్తుతం ఎవరిలో కూడా వ్యాధికి సంబంధించిన లక్షణాలు కనిపించకపోవడంతో భయం కలిగిస్తోంది. దీంతో వ్యాధి మెల్లమెల్లగా ముదిరి ప్రాణాలు పోయే సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాధి తీవ్రత ముదిరితే ఆస్పత్రుల్లో చేరాల్సిందేనని హెచ్చరిస్తున్నారు.
కొవిడ్ నిబంధనలు పాటిస్తూ మాస్కులు ధరిస్తూ బౌతిక దూరంలో ఉంటూ వ్యాధిని దరిచేరనీయొద్దని చెబుతున్నారు. అప్రమత్తతే శ్రీరామరక్ష అని సూచిస్తున్నారు. అందరు విధిగా టీకాలు తీసుకుని వైరస్ వ్యాప్తిని అరికట్టాల్సిన అవసరం ఉందని తెలుస్తోంది. రాబోయే రోజుల్లో ఎన్ని కేసులు వచ్చినా ధీటుగా ఎదుర్కొనే సామర్థ్యం పెంచుకునేందుకు ప్రభుత్వం కూడా సన్నద్దమవుతోంది. వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత వేగవంతంగా చేసేందుకు సిద్ధమైంది.
Also Read: బీ ఆలెర్ట్ పిల్లలపై ఒమిక్రాన్ ప్రభావం