Covid Vaccine: భారతదేశంతో పాటు ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నది కరోనా మహమ్మారి. వ్యాక్సిన్ వచ్చేసిందని, ఇక కేసులు కూడా తగ్గుముఖం పట్టాయని అందరూ ఇక పూర్వ పరిస్థితులు ఏర్పడుతాయని అనుకునేలోపే మరో వేరియంట్‌గా కరోనా రూపాంతరం చెందుతోంది. అలా కొవిడ్ మహమ్మారి జనాలను భయపెడుతోంది. ఇకపోతే కొవిడ్ కట్టడికి రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ జనాలు మాస్కు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ సంగతులు అలా ఉంచితే రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారికి కూడా మరోసారి కొవిడ్ వస్తున్నది. అలా ఎందుకు జరుగుతున్నదంటే..
Covid Vaccine
బీసీసీఐ చైర్మన్, మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ ఇటీవల కాస్త అనారోగ్యానికి గురయ్యారు. దాంతో కోల్‌కత్తాలోని ఆస్పత్రిలో చేరారు. అనంతరం వైద్యులు కొవిడ్ టెస్టు చేయగా పాజిటివని తేలింది. ఇకపోతే ఆయనకు వచ్చిన కొవిడ్ వేరియంట్ ‘డెల్టా’ అని టెస్టులో తెలిసిందని మీడియా ద్వారా తెలుస్తోంది. అయితే, గంగూలీ తన హెల్త్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారని, రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నారని, అయినా కరోనా వచ్చిందని అర్థమవుతున్నది.
Also Read: అత్తి పండ్లు తినేవాళ్లకు షాకింగ్ న్యూస్.. వాళ్లు అస్సలు తినకూడదట!
ఈ క్రమంలోనే వ్యాక్సిన్ పని చేయడం లేదా అనే ప్రశ్నలు కూడా ఎదురవుతున్నాయి. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ విస్తృతంగా జరుగుతోంది. అలా వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ కొవిడ్ మళ్లీ ఎందుకు అటాక్ అవుతున్నదని పలువురు అడుగుతున్నారు కూడా. అయితే, వ్యాక్సిన్ వల్ల ఇమ్యూనిటీ పవర్ ఇంక్రీజ్ అవుతుంది. దాంతో పాటు హ్యూమన్ బాడీకి కలిగే హానిని తగ్గించగలుగుతుంది.
అంతే కానీ వ్యాక్సిన్ వల్ల ఇన్ఫెక్షన్‌ను ఆపలేమనే సంగతి స్పష్టమవుతున్నదని ఆరోగ్య నిపుణులు కొందరు పేర్కొంటున్నారు. ఇకపోతే వ్యాక్సిన్ తయారీలో ఉన్నప్పుడు వాడిన కెమికల్ ఫార్ములాస్ అప్పటి వైరస్‌ను ఎదుర్కోగలవని, ఇప్పుడు వస్తున్న నూతన వేరియంట్స్ మరింత బలంగా వస్తున్నాయని స్పష్టమవుతున్నదని వివరిస్తున్నారు. మొత్తంగా మళ్లీ గతం నాటి కొవిడ్ భయానక పరిస్థితులు అయితే నెలకొంటున్నాయి. డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్ కేసుల వ్యాప్తిని తగ్గించేందుకుగాను ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకుంటున్నాయి.