Corona: దేశంలో కరోనా కల్లోలం.. ఒక్కరోజులోనే 2.8 లక్షల కొత్త కేసులు.. పెరుగుతున్న మరణాలు!

Corona: దేశంలో కరోనా మహమ్మారి కల్లోలం మొదలైంది. కొవిడ్-19 మూడో దశ ప్రారంభమైందని ఏయిమ్స్ వైద్యులతో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు తాత్కాలిక లాక్ డౌన్స్‌తో పాటు నైట్ కర్ఫ్యూలను అమలు చేస్తున్నాయి. తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నందున ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన ఆంక్షలను అమలు చేస్తున్నా్యి. దేశంలో క్రమంగా ఒక్కరోజులోనే రెండు లక్షలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. కేంద్రం విడుదల […]

Written By: Mallesh, Updated On : January 19, 2022 4:01 pm

Corona Third Wave

Follow us on

Corona: దేశంలో కరోనా మహమ్మారి కల్లోలం మొదలైంది. కొవిడ్-19 మూడో దశ ప్రారంభమైందని ఏయిమ్స్ వైద్యులతో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు తాత్కాలిక లాక్ డౌన్స్‌తో పాటు నైట్ కర్ఫ్యూలను అమలు చేస్తున్నాయి. తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నందున ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన ఆంక్షలను అమలు చేస్తున్నా్యి. దేశంలో క్రమంగా ఒక్కరోజులోనే రెండు లక్షలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. కేంద్రం విడుదల చేసిన కరోనా బులెటిన్ ప్రకారం మంగళవారం ఒక్కరోజే 18 లక్షల మందికి పైగా కరోనా పరీక్షలు చేయగా 2,82,970 మందికి పాజిటివ్‌గా తేలిందని హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది.

Corona:

సోమవారంతో పోలిస్తే ఒక్క రోజు గ్యాప్‌తో 44,889 కొత్త కేసులు అదనంగా పెరిగాయి. మొత్తం 18 శాతం మేర కొత్త కేసులు నమోదైనట్టు సమాచారం. మరోవైపు దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతుంది. ఇప్పటివరకు 8,961 కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెబ్‌సైట్‌లో పెట్టిన డేటా చెబుతోంది. కరోనా మహమ్మారి కారణంగా గత 24 గంటల్లో 441 మంది ప్రాణాలను కోల్పోయారు.

Also Read:  హోస్ట్ గా వెంకీ..  బాలయ్యలా సక్సెస్ అవుతాడా ? 

దీంతో మొత్తం మరణాల సంఖ్య 4,87,202 కి చేరుకుంది. బుధవారం నాటికి దేశంలో మొత్తం 18,31,000 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత ఏడు నెలలుగా నమోదైన కేసులతో పోలిస్తే ఇదే అత్యధికం. జాతీయ రికవరీ రేటు 93.88 శాతంగా ఉండటం కొంత సంతోషించాల్సిన విషయం. ప్రస్తుతం రికవరీ రేటు తగ్గడం, యాక్టివ్ కేసులు మళ్లీ పెరగడం ఆందోళన కలిగిస్తుంది. గత 24 గంటల్లో 1,88,157 మంది కరోనా మహమ్మారి నుండి కోలుకోగా మొత్తం రికవరీలు ఇప్పుడు 3,55,83,039కి చేరుకున్నాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు 15.13 శాతంగా ఉంది. కరోనాను నియంత్రించే చర్యల్లో భాగంగా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద 158.88 కోట్ల డోసులను అందించినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం ప్రకటించింది. కొత్తగా 76,35, 229 మంది కరోనా నియంత్రణ కోసం వ్యాక్సినేషన్ చేయించుకున్నారు. ఇదిలాఉంటే 15 సంవత్సరాల నుంచి 18 ఏళ్ల మధ్య వయస్సున్న వారికి నిన్నటి వరకు 3.7 కోట్ల వ్యాక్సిన్ య శాఖ మంగళవారం ప్రకటించింది. కొత్తగా 76,35, 229 మంది కరోనా నియంత్రణ కోసం వ్యాక్సినేషన్ చేయించుడోసులు ఇచ్చినట్టు కేంద్ర గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

Also Read: ఇటు 50 రోజుల సెలెబ్రేషన్స్.. అటు ఓటీటీ రిలీజ్ వేడుకలు !

Tags