https://oktelugu.com/

కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి షాక్.. 20 రోజులకు పాజిటివ్‌..?

దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ వేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ వైద్య సిబ్బందితో పాటు ప్రైవేట్ వైద్య సిబ్బందికి వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ జరుగుతుండగా వ్యాక్సిన్ తీసుకున్న 20 రోజుల తర్వాత ఇద్దరు వైద్యులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. కరోనా నిర్ధారణ అయిన వారిలో నిమ్స్‌కు చెందిన రెసిడెంట్‌ డాక్టర్‌ ఒకరు కాగా ఉస్మానియా వైద్య కళాశాలకు చెందిన పీజీ విద్యార్థి మరొకరు అని సమాచారం. కరోనా వ్యాక్సిన్ తొలి డోస్ తీసుకున్న […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : February 14, 2021 10:25 am
    Follow us on

    దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ వేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ వైద్య సిబ్బందితో పాటు ప్రైవేట్ వైద్య సిబ్బందికి వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ జరుగుతుండగా వ్యాక్సిన్ తీసుకున్న 20 రోజుల తర్వాత ఇద్దరు వైద్యులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. కరోనా నిర్ధారణ అయిన వారిలో నిమ్స్‌కు చెందిన రెసిడెంట్‌ డాక్టర్‌ ఒకరు కాగా ఉస్మానియా వైద్య కళాశాలకు చెందిన పీజీ విద్యార్థి మరొకరు అని సమాచారం.

    కరోనా వ్యాక్సిన్ తొలి డోస్ తీసుకున్న తరువాత నిర్లక్ష్యం వహించడం వల్లే వీళ్లు కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది. అధికారులు ఇద్దరు వైద్యులకు కరోనా నిర్ధారణ కావడాన్ని గుట్టుగా ఉంచేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కరోనా జాగ్రత్తలు తీసుకుని ఉంటే వైద్యులు కరోనా బారిన పడి ఉండేవారు కాదని తెలుస్తోంది. ఈ ఏడారి జనవరి నెల 16వ తేదీన కరోనా వ్యాక్సిన్ తొలి విడత పంపిణీ ప్రక్రియ మొదలైంది.

    అయితే కరోనా వ్యాక్సిన్ కు హెల్త్ వర్కర్లలో చాలామంది దూరంగా ఉన్నట్టు సమాచారం. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తరువాత కొంతమంది సైడ్ ఎఫెక్ట్స్ బారిన పడుతూ ఉండటంతో మరికొందరు హెల్త్ వర్కర్లు కరోనా వ్యాక్సిన్ పనితీరుపైనే అనుమానాలు వ్యక్తం చేస్తుండటం గమనార్హం. వాస్తవానికి కరోనా వ్యాక్సిన్ తొలి డోస్ తీసుకున్న 28 రోజులకు రెండో డోస్ తీసుకోవాలి. రెండో డోస్ తీసుకున్న రెండు వారాల తరువాత యాంటీబాడీల ఉత్పత్తి జరుగుతుంది.

    కరోనా వ్యాక్సిన్ తొలి డోస్ తీసుకున్న 42 రోజుల వరకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వైద్య, ఆరోగ్య శాఖ ఈ మేరకు సూచనలు చేస్తున్నా కొంతమంది నిర్లక్ష్యం వహిస్తూ ఉండటం వల్ల కరోనా బారిన పడుతున్నట్టు తెలుస్తోంది.