
కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతోంది. మరో పక్క థర్డ్ వేవ్ రాబోయే రోజుల్లో జడలు విప్పుతుందని నిపుణులు చెబుతున్నారు. సింగపూర్ వంటి దేశాల్లో ఇప్పటికే థర్డ్ వేవ్ సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా నిర్మూలనకు టీకా మాత్రమే ఉపయోగపడుతుంది. దీంతో వ్యాక్సిన్ ప్రాధాన్యత పెరిగింది. దేశంలో జనాభాకు తగిన విధంగా వ్యాక్సిన్ అందుబాటులో లేదు. ఈ నేపథ్యంలో కరోనా వ్యాక్సినేషన్ పై అందరికీ ఆసక్తి పెరుగుతోంది. ప్రభుత్వం టీకాల పంపిణీకి ఏ మేరకు చర్యలు తీసుకుంటుందో అని పలువురు ఎదురుచూస్తున్నారు.
రష్యాకు చెందిన స్పుత్నిక్ వి మాత్రమే భారత్ లోకి ప్రవేశించింది. సార్స్ కోవ్-2 వైరస్ పై అధిక ప్రభావం చూపిస్తున్న అమెరికా కంపెనీల టీకాల విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ప్రబుత్వం2020 మద్య నుంచే ఫైజర్, జాన్సన్ అండ్ జాన్సన్, మోడెర్నాలతో చర్చలు జరుపుతోంది. అమెరికా, ఇజ్రాయెల్, బ్రిటన్ దేశాల్లో కనీసం 50 శాతం మందికి ఒక్క డోసు పడడంతో వైరస్ వ్యాప్తి గణనీయంగా తగ్గింది. భారత్ లో 130 కోట్ల మందిలో 50 శాతం మందికి ఒక్క టీకా పడాలన్నా 75 కోట్లు కావాలి. రెండు డోసులు అయితే 140 కోట్లు అవసరం. డిసెంబర్ నాటికి 216 కోట్ల టీకాలను ఉత్పత్తి చేస్తామని ప్రభుత్వం చెబుతోంది.
ఫైజర్ టీకాలు సరఫరా చేశాక ఏవైనా చిక్కులుంటే బారత ప్రభుత్వమే భరించుకోవాలని చెబుతోంది. వ్యాక్సినేషన్ తో ఏవైనా దుష్ర్పభావాలు ఉంటే బాధితులు కోర్టుకు వెళ్లకుండా చూడాలని పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా25 దేశాలు ఇండెమ్నిటి, నోఫాల్డ్ అంశాలకు ఒప్పుకున్నాయి. అమెరికా, ఐరోపా సంఘం, కెనడా, జపాన్, అర్జెంటీనా వంటి దేశాల్లో కోవాక్స్ అలయెన్స్ కూడా దీనికి అంగీకరించింది.
2021లోనే భారత్ బయోటెక్ సంస్థ నాసికా రంధ్రాల ద్వారా టీకాపై ప్రయోగాలు చేసింది. వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి వ్యాక్సిన్ సమర్థంగా పనిచేస్తోంది. మూడో దశ ప్రయోగ పరీక్షలు నిర్వహిస్తున్నందున టీకా అందుబాటులోక వచ్చే అవకాశం ఉంది. ఫార్మా దిగ్గజం జైడన్ క్యాడిలా్ల కూడా జైకోవ్-డీ పేరుతో అభివృద్ధి చేస్తున్న టీకా 3వ దశ ప్రయోగాలు జరుపుతోంది. కొన్ని నె లల్లో అందుబాటులోకి రానుంది. జెన్నోవా బయోఫార్మా ఆర్ఎన్ఏ టీకా స్పుత్నిక్ సింగల్ డోస్ నొవావ్యాక్స్ వంటి వాటిపై ప్రభుత్వం ఆశలు పెంచుకుంది.