CM Jagan: మద్యపానం ఒక భయంకరమైన వ్యసనం.. దీని వలన ఎంత పెద్ద ప్రమాదం వాటిల్లుతుందో అందరికీ తెలుసు.. సామాన్య మధ్యతరగతితో పాటు బడుగుబలహీన వర్గాల జీవితాలను మద్యం నాశనం చేస్తోంది. సంపాదించిన దాంట్లో సంగం ఇంటి పెద్ద మద్యానికే ఖర్చుపెడితే ఆ కుటుంబం ఎలా బాగుపడుతుంది. ఇలా చాలా ఇళ్లల్లో మద్యం అగ్గిరాజేసింది. గొడవలకు కారణమవుతోంది. ఫలితంగా కుటుంబాలు విడిపోవడానికి మూలంగా మారుతోంది. మద్యం అనేది ఒక మహమ్మారి వంటిది. దీనికి బానిస అయిన వాడు బంధాలు, బంధుత్వాలను పట్టించుకోడు. ఫలితంగా కుటుంబం ఛిద్రమైపోతుంది. ఇప్పుడు మద్యపానం గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే ఏపీలో సీఎం జగన్ మద్యం ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం దీనిపై ఏపీ రాజకీయాల్లో సర్వత్రా చర్చ జరుగుతోంది.
ఏపీలో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే దశల వారీగా సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తాం.. ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు సీఎం జగన్ చెప్పిన మాట..వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జగన్ ఆ దిశగా అడుగులు వేశారు. నూతన మద్యం పాలసీని తెచ్చి ఏపీలో మద్యం దుకాణాల సంఖ్యను తగ్గించారు. దీంతో ప్రజలు ఎంతో సంతోషించారు. అక్కడి మద్యం దుకాణాలను కూడా ప్రభుత్వమే స్వాధీనం చేసుకుని నడిపిస్తోంది. దశలవారీగా మద్యపాన నిషేధం అమలు కోసం ముందుగా జనాలను మందుకు దూరంగా ఉంచాలని ధరలు అమాంతం పెంచేశారు. 50 నుంచి70 శాతం పెంచేశారు. ఈ నిర్ణయం వలన జనం మద్యానికి దూరంగా ఉన్నారంటే లేరని చెప్పాలి. ఏపీ దుకాణాల్లో కాకుండా పక్కరాష్ట్రాల నుంచి మద్యం తెచ్చి అక్రమంగా విక్రయించేవారు. అంతేకాకుండా మళ్లీ సారా వంటి లోకల్ మేడ్ జీవం పోసుకుంది.
ఆదాయం కోసమేనా..
ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం ఆర్థిక కష్టాల్లో చిక్కుకుని కొట్టుమిట్టాడుతోంది. ఏ ప్రభుత్వానికైనా మద్యం అనేది ప్రధాన ఆదాయ వనరు. జగన్ మాత్రం ఏకంగా మద్యపాన నిషేధం అమలు చేస్తానని ప్రకటించారు. ఏపీ ఆర్థిక పరిస్థితి ఏంటో ఆయనకు కూడా తెలుసు. అయినా కూడా డేర్ స్టెప్ తీసుకున్నారు. అయితే, జనాలు మద్యానికి దూరంగా ఉండటం లేదు. పక్కరాష్ట్రాలకు, నాటుసారా వంటివి లోకల్‌గా తయారు చేసి అమ్ముతున్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడటమే కాదు.. అటు ప్రజలు కూడా అక్రమార్కుల వద్ద మద్యం కొని తమ జేబులు గుల్ల చేసుకుంటున్నారు. ఎలాగూ రాష్ట్రంలో మద్యపాన నిషేధం సక్సెస్ కాలేదు. అందుకే జగన్ 20శాతం ధరలు తగ్గించి పక్కరాష్ట్రాలకు ఏపీ రెవెన్యూ వెళ్లకుండా ప్లాన్ చేసింది. ఎక్సైజ్ అధికారులు కూడా బడా లీడర్ల ఒత్తిడిని తట్టుకోలేక సరిహద్దుల్లో తనిఖీలు సరిగా చేయడం లేదని వాదన వినిపిస్తోంది. అందుకే అక్రమ మద్యం ఏరులై పారుతోంది.
Also Read: TDP Leaders: సొంతగూటికి మాజీ టీడీపీ నేతలు.. ఆసక్తి చూపని బాబు..!
అయితే, జగన్ నిర్ణయంపై ప్రతిపక్షాలు, ప్రజల నుంచి భిన్న స్వరం వినిపిస్తోంది. జగన్ సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తానని చెప్పి మళ్లీ మద్యం ధరలు తగ్గించడం ఏంటని పెదవి విరుస్తున్నారు. రాష్ట్రం ఆదాయం కోల్పోకుండా జగన్ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా మద్యపాన నిషేధం ప్రకటించడం, మళ్లీ ధరలు తగ్గించి ప్రజలను తాగమని చెప్పడం చూస్తుంటే ఆలోచన లేమీతో, తొందరపాటు నిర్ణయాలతో రాష్ట్రాన్ని జగన్ నాశనం చేస్తున్నారని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.
Also Read: AP government: ఏపీ సర్కారుకు కేంద్రం షాక్.. అప్పులపై ఆంక్షలు..
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.
Read MoreWeb Title: Cm jagan back over alcohol ban
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com