Siva Shankar Master: శివ శంకర్ మాస్టర్ ఇకలేరు అనగానే ఆయన పై అనేక కథనాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటు ప్రముఖులు, రాజకీయ నాయకులు కూడా పోటీ పడి మరీ ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. బాగుంది, కానీ.. శివ శంకర్ మాస్టర్ హాస్పిటల్ లో ఉన్నప్పుడు ఆయనకు వైద్య సాయం కావాలి అని ‘శివ శంకర్ మాస్టర్ కుటుంబ సభ్యులు’ పబ్లిక్ గా వచ్చి ప్రాధేయపడ్డారు. అప్పుడు ఒక్క మెగాస్టార్ చిరంజీవి తప్ప, ఇక ఎవరూ ఆర్థిక సాయం చేయలేదు.
కానీ, మాస్టర్ చనిపోయాక, మాజీ సీఎం చంద్రబాబు కూడా మాస్టర్ మరణం పై సానుభూతి చూపిస్తూ.. శివశంకర్ మృతితో సినీ పరిశ్రమ ముద్దుబిడ్డను కోల్పోయింది. నృత్యం, నటనతో లక్షలమంది అభిమానాన్ని ఆయన సంపాదించారు’ అంటూ మాస్టర్ గురించి చంద్రబాబు గొప్పగా చెప్పారు బాగుంది. మరి మాస్టర్ కి వైద్య సాయం అవసరం అని చెప్పినప్పుడు బాబు ఎందుకు ముందు రాలేదో ?
దిల్ రాజు బ్యానర్ శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణ సంస్థ కూడా ముసలి కన్నీరు కార్చింది. శివశంకర్ మాస్టర్ లేరన్న విషయం మాకు ఎంతగానో బాధ కలిగించింది అంటూ దిల్ రాజు బ్యానర్ పేరిట ఒక మెసేజ్ వచ్చింది. కానీ, చావుబతుకుల మధ్య మాస్టర్ ఉంటే.. సాయం చేయడానికి మాత్రం ఈ బ్యానర్ తరపున ఒక్కరు ముందుకు రాలేదు.
కానీ మాస్టర్ చనిపోయాక తెగ ఫీల్ అయిపోతూ.. మాస్టర్ గారి కుటుంబానికి మా సానుభూతి తెలియజేస్తున్నాం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాం అంటూ ఒక పోస్ట్ పెట్టారు. ఎవరికీ కావాలండీ రూపాయికి కూడా పనికి రాని వీళ్ళ సానుభూతి ? అన్నట్టు ఇలాంటి విషయాల్లో ఎప్పుడూ సాయం చేసే పవన్ కళ్యాణ్ కూడా మాస్టర్ విషయంలో సాయం చేయడానికి ముందుకు రాలేదు.
సహాయం చేయడానికి పవన్ ముందుకు రాకపోయినా.. సానుభూతి ప్రకటించడానికి మాత్రం పవన్ ముందుకు వచ్చాడు. కొవిడ్‌కు చికిత్స పొందిన శివశంకర్ మాస్టర్ కోలుకుంటారని భావించా. ఆయన కన్నుమూయడం బాధాకరం. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. శాస్త్రీయ నృత్యంలో పట్టున్న ఆయన సినీ నృత్యంలో ఆ పరిజ్ఞానాన్ని మేళవించారు. ప్రేక్షకుల్ని మెప్పించారు. ‘మగధీర’లోని ఓ పాటకు జాతీయస్థాయి పురస్కారాన్ని అందుకున్నారు. శివశంకర్ మాస్టర్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను’ అంటూ పవన్ కల్యాణ్ సెలవిచ్చారు.