Beast Movie 1st Day Collections: బ్లాక్ బస్టర్ సాంగ్స్ మరియు అద్భుతమైన ట్రైలర్ తో సౌత్ ఇండియా లోనే మోస్ట్ క్రేజీ ప్రాజెక్ట్స్ లో ఒక్కటిగా నిలిచినా తమిళ స్టార్ హీరో విజయ్ బీస్ట్ మూవీ నిన్న భారీ అంచనాల నడుమ అన్ని ప్రాంతీయ బాషలలో ఘనంగా విడుదల అయిన సంగతి మన అందరికి తెలిసిందే..విజయ్ గత చిత్రం మాస్టర్ తెలుగు లో భారీ హిట్ అవ్వడం, దానికి తోడు బీస్ట్ సినిమాలోని పాటలు మన తెలుగు లో కూడా పెద్ద హిట్ అవ్వడం తో ఈ సినిమా ఇక్కడ కూడా మంచి హైప్ తెచ్చుకుంది..కానీ అభిమానులు ప్రేక్షకులలో ఉన్న ఆ భారీ అంచనాలను ఈ సినిమా అందుకోవడం లో విఫలం అయ్యింది అనే చెప్పాలి..మొదటి రోజు మొదటి ఆట నుండే బీలో యావరేజి టాక్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రానికి ఓపెనింగ్స్ మాత్రం అదిరిపోయింది అనే చెప్పాలి..ముఖ్యంగా తమిళనాట విజయ్ కి ఎలాంటి క్రేజ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..మాస్ , యూత్ మరియు ఫామిలీ ఆడియన్స్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత అన్ని వర్గాల్లో అంతతి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో ఎవరైనా ఉన్నారా అంటే అదే ఇలయథలపతి విజయ్ అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు..పైగా ఆయన ముందు చిత్రాలు అన్ని బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి..అందుకే బీస్ట్ సినిమాకి టాక్ తో సంబంధం లేకుండా ఆల్ టైం రికార్డు ఓపెనింగ్ ని సొంతం చేసుకుంది.

తమిళ నాడు లో ఈ చిత్రం మొదటి రోజు ఏకంగా 40 కోట్ల రూపాయిల గ్రాస్ ని సొంతం చేసుకొని ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డు గా నిలిచింది..విజయ్ నాలుగేళ్ల క్రితం చేసిన సర్కార్ సినిమా తమిళనాడు లో ఏకంగా 36 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసి ప్రభంజనం సృష్టించింది..బీస్ట్ సినిమా వరుకు ఆ సినిమానే మొదటి రోజు ఆల్ టైం రికార్డు గా ఉన్నది..మధ్యలో సూపర్ స్టార్ రజిని కాంత్ మరియు అజిత్ సినిమాలు వచ్చినప్పటికీ ఈ రికార్డు ని బద్దలు కొట్టడం లో విఫలం అయ్యాయి..కానీ మళ్ళీ నాలుగేళ్ల తర్వాత తన రికార్డుని తానె బద్దలు కొట్టుకోవడం ఇప్పుడు తమిళనాడు లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది..తెలుగు లో కూడా ఈ సినిమాకి అద్భుతమైన ఓపెనింగ్స్ వచ్చాయి..ఇక్కడ దాదాపుగా ఈ సినిమా 10 కోట్ల రూపాయిల గ్రాస్ మరియు 5 కోట్ల రూపాయిల షేర్ ని ఈ సినిమా మొదటి రోజు వసూలు చేసినట్టు ట్రేడ్ లో వినిపిస్తున్న చర్చ..ఇక ఓవర్సీస్ లో విజయ్ కి ఎలాంటి మార్కెట్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత అక్కడ ఆ స్థాయి మార్కెట్ ని ఏర్పర్చుకున్న ఏకైక తమిళ్ స్టార్ హీరో విజయ్ మాత్రమే..అమెరికా లో ఈ సినిమా కేవలం ప్రీమియర్స్ నుండే ఆరు లక్షల డాలర్లను వసూలు చేసింది..ఇక మలేసియా ,శ్రీలంక, ఆస్ట్రేలియా మరియు UK వంటి ఓవర్సీస్ ప్రాంతాలు అన్ని కలిపి ఈ సినిమా మొదటి రోజు మూడు మిలియన్ డాలర్లు వసూలు చేసి ఉంటుంది అని అంచనా.

Also Read: Beast First Day Collections: ఎంతకు కొన్నారు ? ఎంత నష్టపోతున్నారు ?
ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 150 కోట్ల రూపాయలకు జరిగింది..మొదటి రోజే ఈ సినిమా దాదాపుగా 100 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసింది..అంటే కేవలం ఒక్క రోజులోనే ఈ సినిమా 50 శాతం కి పైగా రికవరీ చేసింది అన్నమాట..ఈరోజు హాలిడే అవ్వడం తో నేడు కూడా మొదటి రోజు లానే సమానంగా వసూళ్లు వచ్చే అవకాశం ఉంది అని, వీకెండ్ లోపు ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కూడా అయిపోతుంది అని ట్రేడ్ వర్గాల్లో గట్టిగ వినిపిస్తున్న వార్త..ఇదే కనుక నిజం అయితే వరస్ట్ రేటింగ్స్ తో సూపర్ హిట్ కొట్టిన రెండవ తమిళ హీరో గా విజయ్ సరికొత్త చరిత్ర సృష్టించిన వాడిగా నిలిచిపోతాడు..గతం లో సూపర్ స్టార్ రజిని కాంత్ హీరో గా నటించిన కబాలి చిత్రం కూడా ఇలాగె వరస్ట్ రేటింగ్స్ తో తమిళనాడు లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది..ఇప్పుడు ఆ జాబితాలోకి విజయ్ కూడా చేరబోతున్నాడు అని కోలీవుడ్ లో జోరుగా సాగుతున్న చర్చ..ఈరోజు ఇండియన్ సినీ ప్రేక్షకులు ఎంతో ఆత్రుతతో ఎదురు చూసిన KGF చాప్టర్ 2 విడుదల అయ్యింది..దీనికి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ రావడం తో ఈ సినిమా ప్రభావం బీస్ట్ కలెక్షన్స్ పై ఎంతైనా కాస్త ఎఫెక్ట్ చూపించొచ్చు..దీనిని అధిగమించి బీస్ట్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద విజయం సాధిస్తే మాత్రం..సౌత్ ఇండియా లో విజయ్ ని మించిన హీరో లేరు అని చెప్పొచ్చు..మరి చూడాలి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ రేంజ్ ఎక్కడకి వెళ్లి ఆగుతుందో అనేది.
Also Read: Beast Movie Review: రివ్యూ : బీస్ట్
[…] Also Read: 150 కోట్లు పెట్టి కొన్నారు..మొదటి రోజే ఎ… […]