Karthika Deepam January 25 Episode: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ లో ఈరోజు ఎపిసోడ్ లో జరిగిన హైలెట్స్ ఏమిటో చూద్దాం. దీప దగ్గరకు మహాలక్ష్మి వచ్చి రుద్రాణి వ్యక్తిత్వం గురించి చెబుతుంది. ఇక దాంతో దీప రుద్రాణిపై కోపం చూపిస్తుంది. పిల్లల విషయంలో జాగ్రత్తగా చూసుకోవాలని అనుకుంటుంది. కార్తీక్ రోడ్డుపై వెళ్తూ.. రుద్రాణి మాటలు, యజమాని మాటలు తలచుకుంటాడు.

దాంతో హోటల్లో పని చేసే వంటమనిషి దీపనా అని అనుమానం రావడంతో వెంటనే ఇంటికి వెళ్లి చూడాలనుకుంటాడు. దారిన వెళ్తూ ఆనంద్, దీప ఇంట్లో ఉండకూడదని అనుకుంటాడు. కానీ చూసేవరకు దీప వాళ్లు ఉండటంతో కార్తీక్ షాక్ అవుతాడు. ఇక దీప దగ్గరికి వెళ్లి డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చావు అని అడగటంతో దీప అబద్ధం చెబుతుంది. ఇక మనసులో డాక్టర్ బాబుకు అబద్ధం చెప్పానని బాధపడుతుంది.
Also Read: Karthika Deepam: దీప కోసం హోటల్ కు వెళ్ళిన సౌందర్య, ఆనందరావు.. కన్నీటితో మునిగిపోయిన వంటలక్క!
కార్తీక్ తన వెంట తెచ్చిన డబ్బులు దీపకు ఇవ్వటంతో.. ఈ డబ్బులు ఎక్కడికి డాక్టర్ బాబు అని అడుగుతుంది. ఇక కార్తీక్ కూడా అబద్ధం చెప్పి.. తన మనసులో బాధపడుతూ ఉంటాడు. మరోవైపు మోనిత ఇంట్లో విన్నీ భోజనం చేస్తూ ఉంటుంది. అప్పుడే మోనిత ఇంట్లోకి వస్తుంది. ఇక మోనిత గతంలో కార్తీక్ తో కలిసి పూజ చేసిన సీన్ గుర్తుకు చేసుకుంటూ.. కార్తీక్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. విన్నీ తో కొన్ని విషయాలు పంచుకుంటుంది.
కార్తీక్ రోడ్డుపై ఆలోచిస్తూ వెళ్తూ ఉండగా ముందర నుండి రుద్రాణి మనుషులు కారులో వస్తారు. వాళ్ళు కార్తీక్ పై బురద నీళ్లు చల్లాలని అనుకుంటారు. కానీ కార్తీక్ రాయి చూపించి బెదిరిస్తాడు. ఇక పిల్లలు రుద్రాణి మనుషులు వచ్చారని దీపతో భయపడుతూ చెబుతారు. తరువాయి భాగంలో కార్తీక్ హోటల్ లో టేబుల్ తుడుస్తూ ఉండగా అదే సమయంలో దీప అక్కడికి వస్తుంది. ఇక కార్తీక్ ను అలా చూసి.. షాక్ అవుతూ ఏవండీ అంటూ బాగా ఏడుస్తూ ఉంటుంది.
Also Read: నేహా శర్మ నుంచి హెబ్బా పటేల్ దాకా.. ఆ తప్పు చేసి సినీ కెరీర్ కోల్పోయిన వారు వీరే..
[…] Keerthi Suresh Sakhi Movie: జాతీయ అవార్డు గ్రహీత, కీర్తి సురేష్ నటించిన స్పోర్ట్స్ డ్రామా ‘గుడ్ లక్ సఖి’. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. నిన్న ఈ సినిమా అఫీషియల్ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. కాగా ఈ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. కేవలం 24 గంటల లోపే 5 మిలియన్ల వీక్షణలను సాధించింది. అంతేకాకుండా, ట్రైలర్ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో 2వ స్థానంలో నిలిచింది. […]