సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పాన్ ఇండియా రేంజ్ ఆర్టిస్ట్ లు చాల తక్కువ మంది ఉన్నారు. అదే బాలీవుడ్ లో అయితే క్యారెక్టర్ ఆర్టిస్ట్ లలో కూడా పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు ఉన్న వారే ఎక్కువ. అయితే సౌత్ లో మాత్రం ఆ లోటు ఎక్కువగా కనిపిస్తోంది. పైగా సౌత్ లో మెయిన్ ఇండస్ట్రీస్ అయినా తెలుగు తమిళంలో కూడా పాన్ ఇండియా నటులు నలుగురైదుగురే ఉన్నారు. వారిలో ప్రముఖంగా చెప్పుకోవాల్సిన పేరు ‘నాజర్’. ఆయన విలన్ గా నటిస్తే విలన్ ఇలాగే ఉండాలి అనిపిస్తోంది.
ఇక తాతయ్యగా, ఫాదర్ గా నటిస్తే ఆ పాత్రల్లోని ప్రేమ ప్రేక్షకుల మనసును బలంగా తాకుతుంది. ఇలా ఏ పాత్ర వేసినా.. ఆయన అన్ని పాత్రల్లోనూ మెప్పించగలరు. అందుకే, నాజర్ అంటే ఇండియా వైడ్ గా కోట్లాది మంది ప్రేక్షకులు ఆయన నటనను ఆదరిస్తారు. కాగా నాజర్ గురించి ఎవ్వరికీ తెలియని విషయాలు చూస్తే.. ఆయన యుసి స్టడీస్ చేశారు. ఆపై మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో బాటనీ డిగ్రీ కూడా చేశారు. అయితే డిగ్రీ చదివే రోజుల్లోనే ఆయనకు నటన పై మక్కువ ఎక్కువైంది. దాంతో నాటకాలు వేయాలని ఆశ కలిగింది ఆయనకు.
అలా ఆయన ఎన్నో నాటకాలు వేసి మొత్తానికి రంగస్థల నటుడిగా బాగా పాపులర్ అయ్యారు. దాంతో ఆయన పెద్దగా కష్టపడకుండానే సినిమాల్లో అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. ఇక ఆ తరువాత ఆయన నటనా జీవితానికి తిరుగు లేకుండా పోయింది. అయితే, నాజర్ లో నటుడితో పాటు రచయిత కూడా ఉన్నాడని చాలామందికి తెలియదు. నాజర్ నటుడిగా మారకముందే మ్యాగజైన్లు, న్యూస్ పేపర్ల కోసం కొన్ని కథలు, కవితలను కూడా రాశారు.
అన్నట్టు నాజర్ యాక్టింగ్ లో మాస్టర్ డిప్లమా చేసి గోల్డ్ మెడల్ కూడా సాధించారు. పైగా నాజర్ జాయిన్ అయిన ఇన్స్టిట్యూట్ లోనే సూపర్ స్టార్ రజనీకాంత్, విజయ్ కాంత్ లాంటివారు స్టార్లు కూడా జాయిన్ అయ్యారు. అలాగే మరో ఇన్స్టిట్యూట్ లో కూడా నాజర్ కొనాళ్ల పాటు యాక్టింగ్ నేర్చుకున్నారు. అక్కడ మెగాస్టార్ చిరంజీవి, నాజర్ కు క్లాస్ మెట్ అట. అప్పుడే నాజర్ కి చిరుకి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది.