Tollywood Gossips: దర్శకుడు పరశురామ్ ముగ్గురు హీరోలతో మల్టీస్టారర్ ప్లాన్ చేశాడని రెండు రోజుల నుంచి ఓ వార్త తెగ హల్ చల్ చేస్తోంది. ప్రస్తుతం పరశురామ్ అయితే, మహేశ్ బాబుతో ‘సర్కారు వారి పాట’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉంది. ఈ సినిమా తర్వాతనే ముగ్గురు స్టార్ హీరోలతో భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని ప్లాన్ చేశాడట. పైగా ఈ సినిమా పాన్ ఇండియన్ స్థాయిలో తీస్తాడట. అయితే, ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియదు గానీ, ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది.

Also Read: టాలీవుడ్ ను చావుదెబ్బ తీసిన జగన్.. షాకింగ్ నిర్ణయం
ఇక ‘అఖండ’తో సూపర్ హిట్ అందుకున్న నందమూరి బాలకృష్ణ తన రెమ్యూనరేషన్ ను రెట్టింపు చేశాడట. ఇప్పటివరకు బాలయ్య ఒక్కో సినిమాకు రూ.10 కోట్లు తీసుకుంటూ వచ్చాడు. కానీ, ప్రస్తుతం బాలయ్య.. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కే తన తదుపరి ప్రాజెక్టు కోసం ఏకంగా రూ.22 కోట్లు డిమాండ్ చేశాడని వార్తలు వినిపిస్తున్నాయి. మరీ ఈ నటసింహానికి ఉన్న క్రేజ్‌తో పోల్చుకుంటే.. 22 కోట్లు పెద్ద లెక్కలోకి ఏమి రావు.
రామ్ చరణ్ వరుస సినిమాలు ఒప్పుకున్నాడు. శంకర్, ప్రశాంత్ నీల్, సుకుమార్ లతో ఇలా లైనప్ చాలా భారీగా ఉంది. అయితే, ఈ సినిమాల తర్వాత తన తదుపరి సినిమాలను యంగ్ డైరెక్టర్స్ గౌతమ్ తిన్ననూరితో ఓ సినిమా, అలాగే శ్యామ్‌సింగరాయ్ లాంటి హిట్ సినిమా చేసిన దర్శకుడు రాహుల్ తో మరో సినిమా చేయాలనుకుంటున్నట్టు సమాచారం. ఈ వార్త పై గట్టిగానే ప్రచారమే జరుగుతుంది.
Also Read: ఒకప్పుడు టాలీవుడ్ లో వెలుగు వెలిగి.. ఆ తర్వాత దీన పరిస్థితులు ఎదుర్కొన్నది వీరే…