Vijay Devarakonda: విజయ్ దేవరకొండ తన స్టార్ డమ్ ను పాన్ ఇండియా రేంజ్ లో పెంచుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో ‘దేవర శాంటా’ పేరుతో 100 మందికి 10 వేల రూపాయల చొప్పున క్రిస్మస్ గిఫ్ట్ ఇస్తున్నాడు. విజయ్ దేవరకొండ ఈ ‘దేవర శాంటా’ పేరుతో ఇచ్చే క్రిస్మస్ గిఫ్ట్ గురించి ప్రకటన చేశాక, ఈ ప్రకటనకు అనూహ్య స్పందన వచ్చింది. దేవర శాంటా 2021 యాష్ ట్యాగ్ కు అత్యధిక సంఖ్యలో రిక్వెస్ట్ లు పెట్టుకున్నారు గిఫ్ట్ ఆశించేవారు.

తాజాగా విజయ్ దేవరకొండ టీమ్ 100 మందిని ఎంపిక చేశారు. ఈ 100 మందికి ఒక్కొక్కరికి 10 వేల రూపాయల చొప్పున ఇవ్వబోతున్నారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ ట్వీట్ చేస్తూ.. ‘మై లవ్స్.. మీరు ‘దేవర శాంటా’ విజేతల జాబితాలో మీ పేరు చెక్ చేసుకోండి. త్వరలో మా టీమ్ మిమ్మల్ని సంప్రదించి డబ్బులు ట్రాన్స్ ఫర్ చేస్తుంది’ అంటూ విజయ్ ట్వీట్ చేశాడు. అయినా ఫ్యాన్స్ కి ఇలా డబ్బులు పంచి పెట్టే హీరో ఒక్క విజయ్ దేవరకొండే అనుకుంటా.
పైగా విజయ్ దేవరకొండ ‘దేవర శాంటా’ పేరుతో ప్రతి క్రిస్మస్ కు ఇలా బహుమతులు ఇస్తూ వస్తున్నాడు. ఈ ఏడాది కూడా నగదు రూపంలో బహుమతులు ఇస్తున్నాడు. ఇక విజయ్ ప్రస్తుతం పూరితో ‘లైగర్’ సినిమా చేస్తున్నాడు. పక్కా ప్లాన్ తో ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్స్ సెట్ చేసుకున్నా.. కరోనా కారణంగా లైగర్ షూటింగ్ ను పోస్ట్ ఫోన్ చేసుకున్నారు.
Also Read: Rowdy Boys: యాక్షన్ .. రోమాంటిక్ గా కట్ అయిన ‘రౌడ్ బాయ్స్’ ట్రైలర్..!
అయితే, సినిమాల వేగం తగ్గినా సంపాదన మాత్రం తగ్గలేదు. విజయ్ ఈ గ్యాప్ లో యాడ్స్ పై పడ్డాడు. నేషనల్ లెవల్లో పెద్ద బ్రాండ్స్ ని తన ఖాతాలో వేసుకోవడానికి కొన్నాళ్ళు పాటు ఏకంగా ముంబైలోనే మకాం మార్చాడు. ఇప్పుడు తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు తర్వాత, ఆ స్థాయిలో యాడ్స్ చేస్తోన్న తెలుగు హీరో విజయ్ దేవరకొండ. విజయ్ ఖాతాలో ఎక్కువ బ్రాండ్స్ పడటానికి కారణం కరుణ్ జోహార్ అని తెలుస్తోంది. మొదటి నుండి కరుణ్ జోహార్ విజయ్ దేవరకొండకు సపోర్ట్ చేస్తున్నాడు.
Also Read: Ramesh Babu: హీరో మహేష్ బాబు సోదరుడు రమేశ్ బాబు కన్నుమూత
http://twitter.com/TheDeverakonda/status/1479470721042567171?s=20