https://oktelugu.com/

సోనూసుద్ కి మాత్రమే సాధ్యమైన ఘనమైన ఘనత ఇది !

కరోనా భారత దేశంలో తన ప్రతాపాన్ని చూపించడం మొదలుపెట్టినప్పటి నుండీ సోనూసూద్ పేరు మారుమ్రోగిపోతుంది. ప్రజలకు ఏ కష్టం వచ్చినా సోనూసూద్ వైపు చూస్తున్నారు. అయితే, సాధారణ పౌరులే కాదు.. ఈ కష్ట సమయంలో అవసరం రాగానే సెలబ్రిటీలు కూడా ఇప్పుడు సోనూసూద్ వైపే చూస్తున్నారు. అతని ద్వారా సాయం పొందుతున్నారు. ఇటీవల క్రికెటర్ సురేష్ రైనా, సోనూసూద్ నుంచి సాయం అందుకున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో ఇండియన్ క్రికెటర్‌ కూడా సోనూసూద్ నుండి సాయాన్ని […]

Written By:
  • admin
  • , Updated On : May 13, 2021 / 11:20 AM IST
    Follow us on


    కరోనా భారత దేశంలో తన ప్రతాపాన్ని చూపించడం మొదలుపెట్టినప్పటి నుండీ సోనూసూద్ పేరు మారుమ్రోగిపోతుంది. ప్రజలకు ఏ కష్టం వచ్చినా సోనూసూద్ వైపు చూస్తున్నారు. అయితే, సాధారణ పౌరులే కాదు.. ఈ కష్ట సమయంలో అవసరం రాగానే సెలబ్రిటీలు కూడా ఇప్పుడు సోనూసూద్ వైపే చూస్తున్నారు. అతని ద్వారా సాయం పొందుతున్నారు.

    ఇటీవల క్రికెటర్ సురేష్ రైనా, సోనూసూద్ నుంచి సాయం అందుకున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో ఇండియన్ క్రికెటర్‌ కూడా సోనూసూద్ నుండి సాయాన్ని పొందాడు. టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ తన బంధువుల్లో ఒకరికి అర్జెంట్ గా రెమిడిసివర్ ఇంజెక్షన్ కావాలని దండం పెడుతూ సోషల్ మీడియాలో సాయం కోరాడు.

    హర్భజన్ పోస్ట్ ను చూసిన కొందరు నెటిజన్లు సోనూసూద్‌ ను అడగాలంటూ ట్యాగ్ చేయగానే, అది గమనించిన సోనూసూద్ వెంటనే స్పందిస్తూ తప్పకుండా సహాయం అందుతుందంటూ మెసేజ్ పెట్టాడు. నిజంగానే మెసేజ్ పెట్టిన వెంటనే కర్ణాటకలో అవసరమైన ఆ వ్యక్తికీ ఇంజెక్షన్ అందింది. దీంతో ఎమోషనల్ అయిన హర్బజన్ సింగ్ సోనూసూద్ కు ట్వీట్ చేస్తూ..

    ‘ధన్యవాదాలు సోదరా.. దేవుడు ఆశీస్సులతో మీరు బాగుండాలి’ అని ఆశీర్వదిస్తూ మెసేజ్ పెట్టాడు. ఏది ఏమైనా పేదలతో పాటు డబ్బు ఉన్నవారికి కూడా సోనూసూద్ ఇలా సాయం చేస్తుండటం, ప్రముఖులు సైతం ఈ కష్ట కాలాన్ని దాటలేక సోను సూద్ ను సాయం కోరడం సోనూసుద్ కి మాత్రమే సాధ్యమైన ఘనమైన ఘనతే ఇది.