https://oktelugu.com/

Sonu Sood : రాజకీయాల్లోకి వస్తా .. క్లారిటీ ఇచ్చిన కలియుగ కర్ణుడు !

Sonu Sood :  సోనూసూద్‌..  కలియుగ కర్ణుడు అంటూ   నెటిజన్లు ఒక బిరుదు కూడా ఇచ్చారు.   ఆ మధ్య   సోనూకి  ఒక  విగ్రహం  ఏర్పాటు చేసి పూజలు కూడా  జరిపించారు. మొత్తానికి సోనూ జనంలోకి బాగా వెళ్ళాడు.  అందుకే,  మరో ఐదేళ్లపాటు సమాజ సేవపై దృష్టి పెట్టి, ఆ తర్వాత రాజకీయాల్లోకి వస్తానని ప్రముఖ నటుడు సోనూసూద్ వెల్లడించారు. తన ఆలోచనలతో సారూప్యత ఉన్న పార్టీలో చేరతానని తెలిపారు. ఈ పదవికి నువ్వే అర్హుడివని అందరూ అనేస్థాయికి ఎదిగాక తప్పకుండా వస్తానని చెప్పుకొచ్చారు.  పంజాబ్‌లో […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : January 24, 2022 / 11:57 PM IST
    Follow us on


    Sonu Sood :  సోనూసూద్
    ‌..  కలియుగ కర్ణుడు అంటూ   నెటిజన్లు ఒక బిరుదు కూడా ఇచ్చారు.   ఆ మధ్య   సోనూకి  ఒక  విగ్రహం  ఏర్పాటు చేసి పూజలు కూడా  జరిపించారు. మొత్తానికి సోనూ జనంలోకి బాగా వెళ్ళాడు.  అందుకే,  మరో ఐదేళ్లపాటు సమాజ సేవపై దృష్టి పెట్టి, ఆ తర్వాత రాజకీయాల్లోకి వస్తానని ప్రముఖ నటుడు సోనూసూద్ వెల్లడించారు. తన ఆలోచనలతో సారూప్యత ఉన్న పార్టీలో చేరతానని తెలిపారు. ఈ పదవికి నువ్వే అర్హుడివని అందరూ అనేస్థాయికి ఎదిగాక తప్పకుండా వస్తానని చెప్పుకొచ్చారు. 

    Sonu Sood

    పంజాబ్‌లో కాంగ్రెస్‌కే విజయావకాశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ తరఫున మోగా నుంచి పోటీ చేస్తున్న సోదరి మాళవికకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు.  ఏది ఏమైనా కరోనా భారత దేశంలో తన ప్రతాపాన్ని చూపించడం  మొదలుపెట్టినప్పటి నుండీ  సోనూసూద్ పేరు మారుమ్రోగిపోతుంది.  ప్రజలకు ఏ కష్టం వచ్చినా సోనూసూద్ వైపు చూస్తున్నారు. అయితే,  సాధారణ పౌరులే కాదు.. ఈ కష్ట  సమయంలో అవసరం రాగానే  సెలబ్రిటీలు కూడా  ఇప్పుడు  సోనూసూద్  వైపే చూశారు. 

    అతని  ద్వారా సాయం పొందారు.  అందుకే   సినిమా సెట్స్ లో మెగాస్టార్, మోహన్ లాల్  లాంటి స్టార్స్  కూడా   శాలువా కప్పి  సోనూను ప్రత్యేకంగా  సన్మానించారు.  మొత్తానికి కరోనా ఆపద్బాంధవుడిగా సోనూ చేసిన సేవలు,  సాయాలు  ఎంత చెప్పుకున్నా తక్కువే.  సాయం అనే పదానికి  సోనూసూద్ పర్యాయపదం అయిపోయాడు.  

    ఏది ఏమైనా పేదలతో పాటు డబ్బు ఉన్నవారికి కూడా సోనూసూద్ ఇలా సాయం చేస్తుండటం,  ప్రముఖులు సైతం  కరోనా  కష్ట కాలాన్ని దాటలేక  సోను సూద్ ను సాయం కోరడం సోనూసుద్ కి మాత్రమే సాధ్యమైన  ఘనమైన ఘనతే ఇది.