
సోనాక్షి సిన్హా అనగానే బాలీవుడ్ లో బబ్లీ బ్యూటీ అని గుర్తుకువస్తోంది. అయితే, ఈ మధ్య సోనాక్షి మొత్తానికి తన ఫిజిక్ స్టైల్ ను మార్చుకుంది. కాగా సోనాక్షి ప్రస్తుతం సౌత్ వైపు చూస్తోంది. నిజానికి ఈ బ్యూటీ ఆ మధ్య తెలుగులో ఓ సినిమా చేయబోతోందనీ, అదీ నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాలో హీరోయిన్ గా చేస్తోందని వార్తలు వచ్చాయి.
చివరకూ అది అవాస్తవం అని తేలిపోయింది. అయితే ఎప్పటినుండో సోనాక్షికి సౌత్ లో సినిమాలు చేయాలని ఆశ ఉందని తాజాగా చెబుతుంది. కానీ ఇది అబద్దం అంటున్నారు సౌత్ సినిమా లవర్స్. ఆ మధ్య టాలీవుడ్‌లో ఈ భారీ బ్యూటీ ఎంట్రీ ఇవ్వబోతోందనే ప్రచారం భారీ స్థాయిలో జరిగింది. అయితే తన మీద వస్తున్న గాసిప్స్‌కి ఎప్పటికప్పుడు చెక్ పెట్టే సోనాక్షి.. ఆ ప్రచారాన్ని తిప్పి కొట్టే ప్రయత్నంలో బాలయ్య సినిమా పై చేసిన కామెంట్స్ ఆమెకు సౌత్ హీరోలు అంటే ఎంత చిన్న చూపో తెలియజేశాయి.
ఆ మధ్య బాలయ్య సినిమా పై స్పందిస్తూ.. ‘నేను బాలకృష్ణ సినిమాలో చేయడంలేదు అని ‘బాలకృష్ణ’ అంటూ ఏకవచనాన్ని పేర్కొంది సోనాక్షి సిన్హా. 100కి పైగా సినిమాలు చేసిన స్టార్ హీరో బాలకృష్ణ, పైగా ఎమ్మెల్యే కూడా.. అలాంటి హీరోకి కాస్తంత రెస్పెక్ట్ కూడా ఇవ్వలేదు సోనాక్షి. కెరీర్ మొదట్లోనే సౌత్ సినిమాల్లో ఛాన్స్ లు వస్తే.. ఆ సినిమాలు తన స్థాయి కాదు అంటూ బీరాలు పోయింది.
కానీ, ఇప్పుడు సౌత్ సినిమాల పై, ఇక్కడ హీరోల పై ప్రేమను పెంచుకోవాడనికి కారణం.. సోనాక్షికి బాలీవుడ్ లో సినిమాలు తగ్గడమేనట. సోనాక్షి సిన్హా తండ్రి శతృఘన్ సిన్హా బాలీవుడ్ లో రెబల్ స్టార్. తన తండ్రిలానే సోనాక్షి సిన్హా కూడా డేరింగ్ అండ్ డాషింగ్ అనిపించుకునే క్రమంలో, అప్పట్లో సౌత్ మూవీస్ పై చిన్న చూపు చూపించింది. ఇప్పుడు సౌత్ సినిమాల కోసం ఆశ పడుతుంది.