
శృతి హాసన్ అంటేనే బోల్డ్.. ఉన్నది ఉన్నట్టు మాట్లాడటంలో ఎప్పుడో మాస్టర్స్ పూర్తి చేసింది. చివరకు తన ఘాటు ఎఫైర్స్ గురించి కూడా శృతి చాలా ఓపెన్ గా మాట్లాడుతూ ఉంటుంది. ఇక తాజాగా తన పేరెంట్స్ గురించి కూడా శృతి హాసన్ ఓపెన్ గా మాట్లాడేసింది. జూమ్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో శృతి తన తల్లితండ్రుల దాంపత్య జీవితం గురించి చెబుతూ.. ‘మా అమ్మానాన్న విడిపోవడం అనేది నా దృష్టిలో అయితే కచ్చితంగా కరెక్ట్ అనే చెబుతా.
అందుకే వాళ్ళు విడాకులు తీసుకున్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను’ అంటూ శ్రుతి హాసన్ చెప్పుకొచ్చింది. అసలు ఎవరైనా ఎంత బోల్డ్ హీరోయిన్ అయినా సరే.. మరీ ఇలా తల్లితండ్రులు విడిపోయినందుకు హ్యాపీ అంటూ స్టేట్ మెంట్స్ ఇవ్వరు. అయితే తన తల్లితండ్రులు కమల్ హాసన్, సారిక విడిపోవడం పై తన ఆనందానికి కారణం చెబుతూ
‘మా అమ్మానాన్ననే కాదు, ఎవరైనా సరే, కలిసి బతకలేమని అనుకున్న తర్వాత ఇక వారిద్దరూ విడిపోవడమే కరెక్ట్ అని నేను నమ్ముతా.
అనవసరంగా తిట్టుకుంటూ, కొట్టుకుంటూ, రాజీపడుతూ బతకడం దేనికి ? హ్యాపీగా లేని లైఫ్ వల్ల ఎవరికీ ఉపయోగం ? అందుకే, నా దృష్టిలో మా అమ్మానాన్న తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని నేను ఇప్పటికీ బలంగా నమ్ముతున్నాను. ఐతే, మా పేరెంట్స్ విడిపోయినప్పుడు నేను చిన్న పిల్లని. నాకు బాగా గుర్తు. మా పేరెంట్స్ కలిసునప్పుడు కన్నా, విడిగా ఉన్నప్పుడే వారిద్దరూ ఎంతో హ్యాపీగా ఉన్నారు, విడిపోయాక వాళ్ళు ఎవరి కోసం దేని కోసం రాజీ పడటం నేను చూడలేదు.
ఇద్దరికీ నచ్చింది చేసే స్వేచ్ఛ ఉంది. ఇక ప్రస్తుతానికి అయితే, వారిద్దరి మధ్య మాటల్లేవు. వాళ్ళను కలపాలని నేను కూడా ఎప్పుడూ ప్రయత్నం చేయలేదు. బలవంతం చేయడం నాకిష్టం లేదు’ ఆని శృతి హాసన్ చెప్పుకొచ్చింది. శృతి హాసన్ తల్లి సారిక. ఆమె కమల్ హాసన్ కి రెండో భార్య. కమల్ హాసన్, సారికలకు ఇద్దరు కూతుళ్లు.. శృతి, అక్షర. ఇక కమల్ హాసన్ సారికతో విడిపోయిన తర్వాత, హీరోయిన్ గౌతమితో కలిసి ఉన్నాడు. ప్రస్తుతం ఆమె కూడా కమల్ కి దూరంగా ఉంటుంది.