నిజానికి ప్రతి ఆదివారం సామ్ ఆ వారం మొత్తంలో తానూ చేసిన పనులకు సంబంధించిన ఫోటోలను ఈ మధ్య రెగ్యులర్ గా తన ఇన్ స్టాగ్రామ్ ఎకౌంట్ లో పోస్ట్ చేస్తోంది. ఈ క్రమంలో శిల్పారెడ్డితో సమంత దిగిన ఫోటోలను కూడా పోస్ట్ చేసింది. ఏది ఏమైనా సమంతలో ఈ మధ్య చాలా మార్పులు వచ్చాయి. అలాగే తన స్టైల్ ను కూడా పూర్తిగా మార్చేసింది.
పైగా సెలెబ్రిటీల పుట్టిన రోజులను గుర్తుపెట్టుకొని మరీ.. అందరికీ ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతుంది. సమంతలో వచ్చిన ఈ మార్పులు వెనుక కారణం.. అక్కినేని నాగచైతన్యతో ఆమె బంధం తెగిపోయింది అని, అందుకే సామ్ లో ప్రస్తుతం ఇలాంటి మార్పులు వచ్చాయని ఎప్పటి నుంచో టాక్ ఉంది.
అక్కినేని కోడలుగా సమంత ప్రత్యేకమైన క్రేజ్ ను తెచ్చుకుంది. అయితే సమంత తన సోషల్ మీడియా అకౌంట్స్ నుండి తన పేరుకు ముందు ఉన్న ‘అక్కినేని’ పేరును తొలగించిన దగ్గర నుంచి ఆమె వ్యక్తిగత జీవితం గురించి ఎన్నో ఊహాగానాలు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఆ రూమర్స్ సారాంశం ఒక్కటే.. చైతుతో సమంత విడిపోతుంది అని.
మరి నిజంగానే చైతుతో సమంత విడిపోతుందా ? చూడాలి. ప్రస్తుతం సమంత చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. అయితే సామ్ మాత్రం నయనతార నిర్మాణంలో విగ్నేష్ శివన్ డైరెక్షన్ లో రాబోతున్న సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా షూట్ లోనే సామ్ ప్రస్తుతం బిజీగా ఉంది.